twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీముఖి, శివజ్యోతి దాదాగిరి.. వితికతో గుంజీలు.. పునర్నవిని సన్నీలియోన్‌ అంటూ!

    |

    Recommended Video

    Bigg Boss Telugu 3: Episode 31 Highlights | నన్ను అలా అంటే ఒక్కొక్కడిది పగులగొడుతా..మహేష్ వార్నింగ్!

    బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 29, 30 రోజు చాలా వినోదంగా సాగింది. ఎప్పుడూ గొడవలతో అట్టుడికే ఆ ఇంటిలో శ్రీముఖి, శివజ్యోతి ఓ హ్యాపీ ఎపిసోడ్‌కు తెర లేపారు. వితిక, పునర్నవిని టీజింగ్, ర్యాంగింగ్ చేస్తూ వినోదం పంచారు. వారిద్దరితో గుంజీలి తీసి.. మాటలతో బెదిరించారు. మంగళవారం ఎపిసోడ్‌లో మహేష్ విట్ట, అలి రెజా మధ్య గొడవ, కెప్టెన్సీ టాస్క్ మధ్య ఈ ర్యాగింగ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ఇంతకు ర్యాగింగ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

     సైట్ కొట్టడంతో కళ్లజోడా?

    సైట్ కొట్టడంతో కళ్లజోడా?

    మంగళవారం ఉదయమే పునర్నవి, వితికను శ్రీముఖి, శివజ్యోతి గట్టిగా ర్యాగింగ్ చేశారు. ఫ్యాషన్ పరేడ్ చేస్తున్నారా? రాత్రి పూట మీ రూమ్ నుంచి సౌండ్‌లు వినిపిస్తున్నాయి ఏమిటీ సంగతి అంటూ శ్రీముఖి దబాయించింది. అంతలోనే పునర్నవిని శివజ్యోతి కూడా పశ్నలతో విసిగించింది. ఏంటీ అప్పుడే కళ్లజోడు వచ్చింది? బాగా చదువుతావా? లేక సైట్ కొట్టి కొట్టి కళ్లజోడు వచ్చాయా? అని ప్రశ్నించింది. దాంతో బాగా చదవడం వల్లే కళ్లోజోడు వచ్చాయి అంటూ వినయంగా పునర్నవి సమాధానం చెప్పింది.

     వితికతో గుంజీలు

    వితికతో గుంజీలు

    శ్రీముఖి, శివజ్యోతి ర్యాంగింగ్ చేయడాన్ని చూసి వితిక, పునర్నవి ముసిముసి నవ్వులు నవ్వారు. దాంతో ఏం పోరి ఎందుకు నవ్వుతున్నావు?. నవ్వినందుకు వితికతో గుంజీలు తీయించింది. ఆ తర్వాత మీ పేర్లేమిటని అడిగితే నా పేరు పునర్నవి.. సావిత్రి అని, వితిక వాణిశ్రీ అని చెప్పింది. అయితే ఓ పాట పాడమని కోరితే.. గుసగుసలు పెట్టారు. అంతలోనే ఇవ్వాల పాడుతారా? లేదా అనగానే.. జయం సినిమాలో గాజువాక పిల్ల పాటను పాడారు.

    సన్నీలియోన్‌లా డ్యాన్స్ ఏంటీ

    సన్నీలియోన్‌లా డ్యాన్స్ ఏంటీ

    గాజువాక పిల్ల పాట తర్వాత డ్యాన్స్ చేయాలని, అంతేకాకుండా ఇద్దరు కలిసి ఒకే స్టెప్పు వేయాలని చెప్పారు. దాంతో వారిద్దరు ఇస్మార్ట్ శంకర్‌లోని జిలేలమ్మ జిట్టా పాటకు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తుంటే మీరిద్దరి పేర్లు సావిత్రి, వాణిశ్రీ.. కానీ మీ డ్యాన్స్ మాత్రం సన్నిలీయోన్‌ను మంచి ఉందే అంటూ దీర్గాలు తీశారు. ఆ తర్వాత బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? అంటే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ వితిక సమాధానం చెప్పింది.

    రవికృష్ణను ఉద్దేశించి బలుపా?

    రవికృష్ణను ఉద్దేశించి బలుపా?

    అంతటితో శ్రీముఖి ఆగకుండా రవికృష్ణను ఉద్దేశించి వాడికి భయం లేదు.. బలుపా అంటూ శివజ్యోతి ర్యాంగింగ్‌ను కొనసాగించింది. అంతలోనే చేతిలో బాటిల్ ఉంటే నీవేమైనా అర్జున్ రెడ్డివా అంటూ శ్రీముఖి ఝలక్ ఇచ్చింది. అంతలోనే ఏమిటీ మీ దౌర్జన్యం అంటూ బాబా భాస్కర్ అక్కడికి రాగానే.. పప్ప నన్ను ర్యాంగింగ్ చేస్తున్నారంటూ రవికృష్ణ కంప్లయింట్ చేశారు. ఇలా ఇంటిలో గొడవల మధ్య సరదాగా ఓ ఎపిసోడ్ సాగిపోయింది.

    Read more about: sreemukhi
    English summary
    Bigg Boss 3 Telugu reality show going with high emotional content. on 29th, 30th day funny moments registred in the house. Sreemukhi, Siva Jyothi ragged Vitika, Punarnavi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X