ఏడుపులు, పెడబెబ్బలతో చిరాకు పెట్టించిన శ్రీముఖి, శివ జ్యోతి

ఏ ఎమోషన్ అయినా.. ఒక పరిధి వరకు చూపిస్తేనే బాగుంటుంది. అతి చేస్తే ఎవరికైనా చిరాకు వస్తుంది. అది నిజమైన ఫీలింగ్ అయినా సరే.. ఎంతవరకు నవ్వాలో అంతవరకే నవ్వాలి. ఎంతవరకు ఏడ్వాలో అంతవరకే ఏడ్వాలి. చావు ఇంట్లో వచ్చే ఏడ్పుల్లా ఉండకూడదు. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే.. ఎవరైనా చచ్చిపోయారా అని అనుమానం వస్తుంది.

అలి రెజా ఎలిమినేట్ అయినప్పుడు అలానే..

అలి రెజా ఎలిమినేట్ అయినప్పుడు అలానే..

అనూహ్యంగా నామినాటే అయి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ అలి ని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. ఇక ఆ రోజు చూడాల్సింది.. వారి ఏడ్పులు. చావు ఇంట్లో కూడా అలాంటివి చూసి ఉండరేమో అనేంతగా ఏడ్చి.. వీక్షకులకు విసుగు పుట్టించాడు. మళ్ళీ ఇన్ని రోజుల తరువాత నిన్నటి ఎపిసోడ్లో.. మళ్ళీ విరక్తి పుట్టించారు.

Recommended Video

Bigg Boss Telugu 3 : Bigg Boss 3 Telugu Contestants Remunerations
ఒక్కసారి కలవనివ్వనండంటూ శ్రీముఖి భోరున ఏడ్చింది

ఒక్కసారి కలవనివ్వనండంటూ శ్రీముఖి భోరున ఏడ్చింది

తమ ఫ్యామిలీ మెంబర్స్ ను కలుసుకోవడానికి.. లక్కీ చాన్సులు ఇచ్చిన బిగ్ బాస్ పై శ్రీముఖి ఆగ్రహించింది. ఇలా అదృష్టం అంటూ అనడం ఏంటి? ఇస్తే అందరికి కలిసే అవకాశం ఇవ్వాలంటూ తెలిపింది. తన తమ్ముడికి జోకర్ బాక్స్ రావడంతో.. వెనుదిరిగి వెళ్ల వలిసి వచ్చింది. ఇక ఒక్కసారి తన తమ్ముడిని కలిసే అవకాశం ఇవ్వడంటూ ఏడుస్తూ బిగ్ బాస్ను ప్రాధేయ పడింది.

 చిన్న విషయానికి సైతం ఏడ్చే శివ జ్యోతి...

చిన్న విషయానికి సైతం ఏడ్చే శివ జ్యోతి...

బిగ్ బాస్ హౌస్ లో పాతాళ గంగా అనే పేరు తెచ్చుకున్న శివ జ్యోతి.. సందర్భం ఏదైనా సరే ఏడవడం ఒక్కటే పనిగా పెట్టుకుంటుంది. ఎప్పుడూ ఏడుపు మొహంతో ఉంటూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ఒకప్పుడు శివ జ్యోతి అంటే నవ్వులు గుర్తొచ్చేవి.. కానీ ఇప్పుడు మాత్రం ఎడుపులే గుర్తొస్తున్నాయి. శుక్రవారం ఎపిసోడ్‌లో సైతం తన సోదరుడు మాట్లాడుతూ ఉంటే.. ఏడుస్తూనే ఉంది. టాస్క్ సమయానికి వచ్చినప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటున్నా.. కొంచెం ఏడుపులు తగ్గిస్తే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎలిమినేషన్ భయం..

ఎలిమినేషన్ భయం..

ఇక శనివారం ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ కీలకం కానున్నది. నామినేషన్‌లో ఉన్న వారికి ఎలిమినేషన్ భయం వెంటాడుతున్నది. నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ వేదికపైకి వచ్చి ఎలాంటి సందడి చేస్తాడోనని బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇంటి సభ్యులను హోస్ నాగార్జున క్లాస్ పీకుతాడా? లేదా వినోదాన్ని నింపుతాడా అనేది చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X