జబర్ధస్త్ కమెడియన్‌తో యాంకర్ విష్ణు ప్రియ పెళ్లి.. బతుకు బలైపోయిందంటున్న శ్రీముఖి.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో కొందరు మాత్రమే సూపర్ సక్సెస్ అవగా... చాలా మంది మధ్యలోనే కెరీర్‌ను వదిలి పెట్టేశారు. సక్సెస్ అవడంతో పాటు తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తున్న యాంకర్లలో గ్లామరస్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. కొన్నేళ్లుగా తనదైన శైలితో ఎంతో మంచి గుర్తింపు దక్కించుకున్న రాములమ్మ.. తాజాగా జబర్ధస్త్ కమెడియన్‌తో యాంకర్ విష్ణు ప్రియకు పెళ్లి చేసేసింది. అంతేకాదు, బతుకు బలైపోయిందంటూ వీడియో వదిలింది. ఆ వివరాలు మీకోసం.!

గుడ్ నేమ్‌తో పాటు బ్యాడ్ నేమ్ కూడా సొంతం

గుడ్ నేమ్‌తో పాటు బ్యాడ్ నేమ్ కూడా సొంతం

ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరన్న విషయం తెలిసిందే. మాస్ యాటిట్యూడ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ అమ్మాయి. అదే సమయంలో వివాదాస్పద వ్యవహార శైలితో చెడ్డ పేరు కూడా తెచ్చుకుంది. ఫలితంగా శ్రీముఖి ఏం చేసినా వాళ్లంతా విమర్శిస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఎన్నో రూమర్లు క్రియేట్ చేశారు.

ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత మొత్తం మారిపోయింది

ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత మొత్తం మారిపోయింది

బుల్లితెరపై వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలోనే శ్రీముఖికి బిగ్ బాస్ రియాలిటీ షోలో ఆఫర్ వచ్చింది. ఆ షోలో ఫైనల్ వరకు వెళ్లిన ఆమె.. తృటిలో టైటిల్‌ను మిస్ అయింది. అయినప్పటికీ ప్రేక్షకుల హృదయాలను మాత్రం గెలుపొందింది. అంతేకాదు, అప్పటి వరకు ఆమెను ట్రోల్ చేసిన వారు సైతం అభినందించేలా ప్రవర్తించిందామె.

మంచి మంచి రోల్స్.. ఘాటు సీన్ల వల్ల మానేసింది

మంచి మంచి రోల్స్.. ఘాటు సీన్ల వల్ల మానేసింది

యాంకర్‌గా అందరికీ సుపరిచితురాలైన శ్రీముఖి... బుల్లితెరపైకి అడుగు పెట్టడానికి ముందే సినిమాల్లోకి ఎంటర్ అయింది. అల్లు అర్జున్ నటించిన ‘జులాయి'తో ఆమె కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత ‘నేను శైలజ', ‘జెంటిల్‌మన్', ‘బాబు బాగా బిజీ' సహా ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది. ఘాటు సీన్లు చేయమంటున్నారన్న కారణంగా సినిమాలకు దూరమైనట్లు ఆ మధ్య చెప్పుకొచ్చింది.

హాట్ హాట్ ఫొటోలతో షాకిచ్చిన రాములమ్మ

హాట్ హాట్ ఫొటోలతో షాకిచ్చిన రాములమ్మ

ఇప్పటి వరకు స్కిన్ షోకు దూరంగా గడిపింది శ్రీముఖి. అయితే, ఇటీవల ఆమె హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసి షాకిచ్చింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఆమె.. తన ఫొటోలు, వీడియోలు, కెరీర్‌కు సంబంధించిన విషయాలను మాత్రమే పంచుకునేది. కానీ, కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా బోల్డ్ గెటప్‌లో దర్శనిచ్చే సరికి అందరూ ఆశ్చర్యపోయారు.

జబర్ధస్త్ కమెడియన్‌తో యాంకర్ విష్ణు ప్రియ పెళ్లి

బిగ్ బాస్ హౌస్‌లో నుంచి వచ్చిన తర్వాత శ్రీముఖికి చాలా ఆఫర్లు వస్తాయని అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన స్నేహితులైన జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, యాంకర్ విష్ణు ప్రియకు ఆమె పెళ్లి చేసింది. అంతేకాదు, దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీముఖి.

Recommended Video

Chiranjeevi & Allu Arjun To Unite For Lucifer Remake
వాళ్ల బతుకు బలైపోయిందంటున్న శ్రీముఖి.!

వాళ్ల బతుకు బలైపోయిందంటున్న శ్రీముఖి.!

అవినాష్‌ - విష్ణు ప్రియకు పెళ్లి చేసింది రియల్‌గా కాదు... ‘బతుకు బలైపోయిన బండి' అనే కామెడీ స్కిట్‌లో. ‘రచ్చబండ', ‘బతుకు జట్కా బండి' వంటి ప్రోగ్రామ్‌లకు స్ఫూఫ్‌గా వచ్చిన ఈ వీడియోలో శ్రీముఖి యాంకర్‌గా కనిపించింది. కరోనా కారణంగా ఇంట్లో ఉంటున్న భార్య భర్తలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఇందులో హాస్యభరితంగా చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X