Just In
- 1 hr ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
'కుట్ర'కు కారణమదే.. జేసీని టార్గెట్ చేసిన తరహాలో స్కెచ్.. ఆ ఇద్దరిపై రఘురామ ఎటాక్,జగన్‌కూ హెచ్చరిక...
- Sports
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్‌లో కూడా మ్యాచులు!!
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అతడితో రిలేషన్ స్టార్ట్ చేసిన శ్రీముఖి.. హగ్ చేసుకున్న ఫొటో షేర్ చేసి ప్రకటించింది.!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ - 3 ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మొదటి నుంచీ హాట్ ఫేవరెట్‌గా ఉన్న శ్రీముఖి చివరి మెట్టుపై బోల్తా పడింది. దీంతో అనూహ్యంగా రేసులోకి వచ్చిన రాహుల్ సిప్లీగంజ్ బిగ్ బాస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ సీజన్ మొత్తం టామ్ అండ్ జెర్రీలా కొట్టుకున్న ఈ ఇద్దరి మధ్యే హోరోహోరీ పోరు జరగడం ప్రేక్షకులకు మజాను పంచింది. జీవితంలో ఇంకెప్పుడూ కలవం అన్నట్లు గొడవలు పెట్టుకున్న రాహుల్ - శ్రీముఖి.. తమ రిలేషన్ గురించి ఓ నిర్ణయానికి వచ్చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రాహుల్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు
బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత నుంచి విజేతగా నిలిచిన రాహుల్ సిప్లీగంజ్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. కొన్ని ఫంక్షన్లకు గెస్ట్‌గా వెళ్లడం.. లైవ్ షో ఏర్పాటు చేయడం తదితర వాటి వల్ల అతడు తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. రాహుల్ క్రేజును తమకు అనుకూలంగా మలచుకోడానికి కూడా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.

టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు
ఇప్పటికే సింగర్‌గా ఎంతో పేరు సంపాదించుకున్న రాహుల్.. యాక్టర్‌గానూ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ' అనే సినిమాలో రాహుల్ ఛాన్స్ పట్టేశాడు. ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ, అలీ రేజా తదితరులు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు.

శ్రీముఖి మాత్రం స్టార్ట్ చేయలేదు
బిగ్ బాస్ సీజన్ - 3లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి.. అది ముగిసిన వెంటనే మాల్దీవులు పర్యటనకు వెళ్లింది. అది ముగిసిన వెంటనే షూటింగ్‌లకు సమయం కేటాయిస్తోంది. అయితే, రాహుల్‌లా ఇప్పటి వరకు ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఈ మధ్య ఆమె షో ఒకటి ప్రారంభం కాబోతుంది. దీంతో శ్రీముఖి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

రాహుల్ పిలిస్తే రెస్పాండ్ కాలేదు
ఇటీవల రాహుల్ ‘లైవ్ కాన్సర్ట్' పేరిట ఓ షో నిర్వహించాడు. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు చాలా మంది వచ్చారు. కానీ, శ్రీముఖి మాత్రం హాజరు కాలేదు. అంతేకాదు, ఈవెంట్‌కు రావాలని ఫోన్ చేసినా అంతగా పట్టించుకోలేదని, మళ్లీ తిరిగి ఫోన్ చేయలేదని రాహుల్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లాయని ప్రచారం జరిగింది.
ఇద్దరూ కలిసి రచ్చ రచ్చ చేశారు
శుక్రవారం రాత్రి బిగ్ బాస్ కంటెస్టెంట్లు వరుణ్ సందేశ్, వితిక షేరు తమ ఇంట్లో ఓ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి రాహుల్ సిప్లీగంజ్, శ్రీముఖి, తమన్నా సింహాద్రి హాజరయ్యారు. ఈ పార్టీలో శ్రీముఖి, రాహుల్ కలిసి డ్యాన్స్‌లు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను వితిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకోవడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
|
అతడితో రిలేషన్ స్టార్ట్ చేసిన శ్రీముఖి
ఇప్పటి వరకు రాహుల్‌తో జరిగిన వివాదాలను మరిచిపోవాలని శ్రీముఖి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె.. రాహుల్‌ను హగ్ చేసుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘గతం గత: అసలు రిలేషన్ ఇప్పుడు మొదలైంది' అని క్యాప్షన్ ఇచ్చింది. అచ్చం అలాగే రాహుల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఇద్దరి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.