For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అతడితో రిలేషన్ స్టార్ట్ చేసిన శ్రీముఖి.. హగ్ చేసుకున్న ఫొటో షేర్ చేసి ప్రకటించింది.!

  By Manoj
  |

  తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ - 3 ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మొదటి నుంచీ హాట్ ఫేవరెట్‌గా ఉన్న శ్రీముఖి చివరి మెట్టుపై బోల్తా పడింది. దీంతో అనూహ్యంగా రేసులోకి వచ్చిన రాహుల్ సిప్లీగంజ్ బిగ్ బాస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ సీజన్ మొత్తం టామ్ అండ్ జెర్రీలా కొట్టుకున్న ఈ ఇద్దరి మధ్యే హోరోహోరీ పోరు జరగడం ప్రేక్షకులకు మజాను పంచింది. జీవితంలో ఇంకెప్పుడూ కలవం అన్నట్లు గొడవలు పెట్టుకున్న రాహుల్ - శ్రీముఖి.. తమ రిలేషన్ గురించి ఓ నిర్ణయానికి వచ్చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  రాహుల్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు

  రాహుల్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు

  బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత నుంచి విజేతగా నిలిచిన రాహుల్ సిప్లీగంజ్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. కొన్ని ఫంక్షన్లకు గెస్ట్‌గా వెళ్లడం.. లైవ్ షో ఏర్పాటు చేయడం తదితర వాటి వల్ల అతడు తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. రాహుల్ క్రేజును తమకు అనుకూలంగా మలచుకోడానికి కూడా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.

   టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు

  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు

  ఇప్పటికే సింగర్‌గా ఎంతో పేరు సంపాదించుకున్న రాహుల్.. యాక్టర్‌గానూ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ' అనే సినిమాలో రాహుల్ ఛాన్స్ పట్టేశాడు. ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ, అలీ రేజా తదితరులు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు.

  శ్రీముఖి మాత్రం స్టార్ట్ చేయలేదు

  శ్రీముఖి మాత్రం స్టార్ట్ చేయలేదు

  బిగ్ బాస్ సీజన్ - 3లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి.. అది ముగిసిన వెంటనే మాల్దీవులు పర్యటనకు వెళ్లింది. అది ముగిసిన వెంటనే షూటింగ్‌లకు సమయం కేటాయిస్తోంది. అయితే, రాహుల్‌లా ఇప్పటి వరకు ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఈ మధ్య ఆమె షో ఒకటి ప్రారంభం కాబోతుంది. దీంతో శ్రీముఖి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

  రాహుల్ పిలిస్తే రెస్పాండ్ కాలేదు

  రాహుల్ పిలిస్తే రెస్పాండ్ కాలేదు

  ఇటీవల రాహుల్ ‘లైవ్ కాన్సర్ట్' పేరిట ఓ షో నిర్వహించాడు. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్లు చాలా మంది వచ్చారు. కానీ, శ్రీముఖి మాత్రం హాజరు కాలేదు. అంతేకాదు, ఈవెంట్‌కు రావాలని ఫోన్ చేసినా అంతగా పట్టించుకోలేదని, మళ్లీ తిరిగి ఫోన్ చేయలేదని రాహుల్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లాయని ప్రచారం జరిగింది.

  ఇద్దరూ కలిసి రచ్చ రచ్చ చేశారు

  శుక్రవారం రాత్రి బిగ్ బాస్ కంటెస్టెంట్లు వరుణ్ సందేశ్, వితిక షేరు తమ ఇంట్లో ఓ పార్టీ ఏర్పాటు చేశారు. దీనికి రాహుల్ సిప్లీగంజ్, శ్రీముఖి, తమన్నా సింహాద్రి హాజరయ్యారు. ఈ పార్టీలో శ్రీముఖి, రాహుల్ కలిసి డ్యాన్స్‌లు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను వితిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకోవడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

  #CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?

  అతడితో రిలేషన్ స్టార్ట్ చేసిన శ్రీముఖి

  ఇప్పటి వరకు రాహుల్‌తో జరిగిన వివాదాలను మరిచిపోవాలని శ్రీముఖి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె.. రాహుల్‌ను హగ్ చేసుకుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘గతం గత: అసలు రిలేషన్ ఇప్పుడు మొదలైంది' అని క్యాప్షన్ ఇచ్చింది. అచ్చం అలాగే రాహుల్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఇద్దరి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

  English summary
  Sreemukhi is an Indian television anchor, who appeared on the series Adhurs. Sreemukhi started her career as a supporting actor in the 2012 film Julai. She made her debut as a lead actress in Prema Ishq Kaadhal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more