అవినాష్‌కు శ్రీముఖి గ్రాండ్ పార్టీ.. గ్రేట్ ఎంటర్‌టైనర్.. బ్యాక్ ఈజ్ బ్యాక్ అంటూ.. తమన్నా రచ్చ రచ్చ

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 13 వారాలపాటు తనదైన శైలిలో వినోదాన్ని అందించిన ముక్కు అవినాష్‌కు బిగ్‌బాస్ తెలుగు 3 రన్నరప్, టాప్ యాంకర్ శ్రీముఖి ఘనంగా స్వాగతం పలికారు. తన టీమ్‌తో కలిసి ముక్కు అవినాష్‌ను సగౌరవంగా సత్కరించారు. ఆనందోత్సవాల మధ్య జరిగిన సంబురాల గురించి మరింత వివరంగా..

 జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్‌

జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్‌

జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్న ముక్కు అవినాష్ దాదాపు 13 వారాలపాటు బిగ్‌బాస్ ఇంటిలో సందడి చేశాడు. ఇంటి సభ్యులనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నారు. టాప్ 5లో చేరుకొంటాడని భావించిన ప్రేక్షకులకు నిరాశను పంచుతూ బిగ్‌బాస్ ఇంటిని వదిలి సొంత ఇంటికి చేరాడు.బిగ్‌బాస్ ఇంటిలో ప్రశంసలు, అవమానాలు ఎదుర్కొన్న ముక్కు అవినాష్ తనకు తాను ఎంటర్‌టైనర్ ఆఫ్ ది హౌస్‌గా ప్రకటించుకొన్నారు. అంతేకాకుండా గ్రేట్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది బిగ్‌బాస్ తెలుగు 4 అంటూ హోస్ట్ నాగార్జునతో కూడా ప్రశంసలు అందుకొన్నారు.

అవినాష్‌కు శ్రీముఖి ఘనంగా వెల్‌కమ్

అవినాష్‌కు శ్రీముఖి ఘనంగా వెల్‌కమ్

అలా బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అవినాష్‌కు శ్రీముఖి బృందం ఘనంగా వెల్‌కమ్ చెప్పింది.ఇంటిని అందంగా అలకరించిన శ్రీముఖి బృందం.. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ గ్రాండ్ పార్టీని అరెంజ్ చేసింది. ఈ వేడుకలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి కూడా పాల్గొన్నారు. పూలవాన కురిపిస్తూ ఇంటిలోకి ఆహ్వానించారు. ఎంటర్‌టైనర్ అంటూ ముక్కు అవినాష్‌కు వెల్‌కమ్ అంటూ బోర్డులు పెట్టి ఆహ్వానించారు.అలా అందరి చేత ఆహ్వానాలు అందుకొంటూ ఇంటిలోకి అడుగుపెట్టిన అవినాష్‌తో కేక్ కట్ చేయించారు. అవినాష్‌కు శ్రీముఖి, తమన్నాతోపాటు ఇతర సభ్యులు కూడా కేక్ తినిపించారు.

Recommended Video

Chiranjeevi Helps His Fan Financially For His Daughter's Wedding
నామినేట్ అయిన ప్రతీసారి

నామినేట్ అయిన ప్రతీసారి

అలా ఆనందోత్సవాలను చూసి అవినాష్ సంతోషంలో మునిగిపోయాడు. ఇలా స్వాగతం పలుకుతారని ఊహించలేదు అంటూ ముక్కు అవినాష్ కామెంట్ చేశాడు.బిగ్‌బాస్ నుంచి వచ్చిన నాకు శ్రీముఖి బ్యాచ్ నాకు సర్‌ప్రైజ్ పార్టీ ఇచ్చారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నిజంగా ఇలాంటి పార్టీని ఊహించలేదు. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. 13 వారాల నా జర్నీలో నామినేట్ అయిన ప్రతీసారి నాకు సపోర్ట్ నన్ను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇంటిలో ఉన్న ప్రతీ ఒక్కరికి నా పాదాభి వందనాలు అని ముక్కు అవినాష్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X