శ్రీముఖి పెద్ద పిసినారి... స్టార్ యాంకర్‌పై బుల్లితెర నటుడు షాకింగ్ కామెంట్స్

యాంకర్ శ్రీముఖి.. ఆమె గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు. ఎలాంటి షో అయినా అలవోకగా చేసుకుంటూ ముందుకు సాగుతోంది. సినిమాలు, టెలివిజన్ షోలు, ఈవెంట్స్‌లో దుమ్మురేపుతున్నారు శ్రీముఖి. ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వు, అందం, చలాకీతనంతో చుట్టూ ఉన్న వాతావరణంలో జోష్ తీసుకొస్తారు శ్రీముఖి. తాజాగా ఈ స్టార్ యాంకర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు బుల్లితెర నటుడు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'నేనేమీ బ్రేక్ తీసుకోలేదు.. అలా సినిమాలకు దూరమయ్యా’
'నేనేమీ బ్రేక్ తీసుకోలేదు.. అలా సినిమాలకు దూరమయ్యా’

స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఆదివారం సరికొత్త థీమ్‌తో బుల్లితెర సెలబ్రిటీలతో శ్రీముఖి పాటలు పాడిస్తూ, ఆటలు ఆడిస్తూ చేసే సందడి ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వీక్ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా పొదరిల్లు సీరియల్ 100 రోజుల వేడుకల్ని నిర్వహించారు. మీరు మీ షూటింగ్‌లో ఎలా ఉంటారో అని చెప్పేది ఈ షూటింగ్ చేసి చెప్పాలని జాతరలో మాదిరిగా కర్టెన్‌కి బెల్లూన్లు కట్టి.. గన్‌తో షూట్ చేయమని పొదరిల్లు టీమ్‌ని పిలిచింది శ్రీముఖి.

Sreemukhi Trolled on Aadivaram With Star Maa Parivaaram Actor s Funny Comments Go Viral

ముందుగా పొదరిల్లు టీమ్ నుంచి ఓ నటుడు వచ్చి పర్ఫెక్ట్‌గా బెలూన్‌ని కాలుస్తాడు. అందులో ఉన్న చీటిని శ్రీముఖి చదువుతుంది. పొదరిల్లు సీరియల్‌లో డ్రామా క్వీన్ ఎవరు? డ్రామా కింగ్? ఎవరు అని అతనిని అడుగుతుంది. మహాలక్ష్మీ డ్రామా క్వీన్ అని అతను చెప్పడంతో .. నువ్వు ఇన్నిరోజులు సీరియల్ చేస్తున్నా అనుకున్నా, నువ్వు డ్రామా చేస్తున్నావా అంటూ శ్రీముఖి సెటైర్లు వేస్తుంది. మరి డ్రామా కింగ్ ఎవరని అడగ్గా.. చక్రీ అని అతను చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ఎందుకు అని శ్రీముఖి అడగ్గా.. నైట్ మొత్తం పడుకునే ఉంటాడు అయినా సరే షూట్‌కి వచ్చినప్పుడు మళ్లీ పడుకుంటాడు అని ఆ నటుడు ఆన్సర్ ఇచ్చాడు. అయితే నైట్ పడుకున్నాడా? లేడా? అని నువ్వు చూస్తున్నావా అని శ్రీముఖి పంచ్ పేల్చడంతో అంతా నవ్వేస్తారు.

Recommended For You
'వాళ్లతో కొట్లాడేంత డబ్బు లేదు.. నేను చనిపోయినా ఆ ఫోటోలు షేర్ చేయొద్దు’
'వాళ్లతో కొట్లాడేంత డబ్బు లేదు.. నేను చనిపోయినా ఆ ఫోటోలు షేర్ చేయొద్దు’

తర్వాత మరో నటిని పిలిచి గన్‌తో బెలూన్ కాల్పిస్తుంది శ్రీముఖి. ఆమె కూడా పర్ఫెక్ట్‌గా బెలూన్‌ని పేల్చడంతో అక్కడున్న చీటిని చదవగా.. ఈ సీరియల్‌లో పిసినారి ఎవరు? అని అడుగుతుంది శ్రీముఖి. బర్త్ డే‌లకు పార్టీలు ఇవ్వరు.. ఫంక్షన్లకు పిలవరు, కొత్త ఇల్లు కొన్నా పార్టీలు ఇవ్వరు అని ఎక్స్‌ప్రెస్ హరి అనడంతో శ్రీముఖి అతనిని కోపంగా చూసి నవ్వుతుంది. ఎక్స్‌ప్రెస్ హరి అలా అనడం వెనుక కారణం లేకపోలేదు.. ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా శ్రీముఖి కొత్తింటిలో గృహ ప్రవేశం చేశారు. తన సోదరుడితో కలిసి ఇంట్లో అడుగుపెట్టి పాలు పొంగించారు.

You May Also Like
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సుడిగాలి సుధీర్? కాబోయే భార్య ఎవరంటే?
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సుడిగాలి సుధీర్? కాబోయే భార్య ఎవరంటే?

ఇప్పటికే తన సొంతూరు నిజామాబాద్‌లో ఇల్లు కట్టుకున్న శ్రీముఖి.. హైదరాబాద్‌లో నాలుగేళ్ల క్రితం మరో ఇంటిని నిర్మించింది. తాజాగా ఇప్పుడు మరో ఇంటిని కూడా నిర్మించుకుని గృహ ప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ. కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైన ఈ కార్యక్రమంలో స్నేహితులు, ఇతర బంధువుల్ని శ్రీముఖి ఆహ్వానించలేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే తమను గృహ ప్రవేశానికి పిలవలేదంటూ శ్రీముఖిపై పంచ్‌లు విసిరాడు ఎక్స్‌ప్రెస్ హరి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more about: sreemukhi express hari
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X