Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రవి ఏం చేసినా ఓకే.. అక్కడ మాత్రం ఎవరూ పట్టుకోకూడదా? శ్రీముఖిని ఆడుకుంటున్నారుగా.!
'బిగ్ బాస్' రియాలిటీ షోలో రోజు రోజుకూ వివాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ షో ఆసక్తికరంగా సాగుతోంది. వాస్తవానికి గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈ సారి కంటెస్టెంట్లలో అంతగా పేరున్న వాళ్లు లేకపోయినా.. షో మాత్రం ప్రేక్షకాదరణను పొందుతోంది. దీనికి కారణం ఇంట్లో జరిగే రచ్చే. సీజన్ ప్రారంభమైన మొదటి వారంలోనే కంటెస్టెంట్లు గొడవలు పెట్టుకుని గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో ఏ టాస్క్ జరిగినా.. ఏ పోటీ జరిగినా యాంకర్ శ్రీముఖి హైలైట్ అవుతోంది. దీంతో ఆమె ట్రోలర్స్ బారిన పడుతోంది. తాజాగా ఆమె మరోసారి హాట్ టాపిక్ అయింది.
శ్రీముఖి గ్లామర్ షో
నామినేషన్.. ఎలిమినేషన్.. గొడవలు.. తిట్టుకోడాలు.. కొట్టుకోడాలు.. ఇవన్నీ పక్కనపెడితే.. ఈ షో ప్రారంభమైన మొదటి రోజు నుంచే ప్రముఖ యాంకర్ శ్రీముఖి గ్లామర్ షో వీక్షకులను ఆకట్టుకుంది. చిన్న షార్ట్ ధరించి ఆమె బయటకు రాగానే అంతా నోరెళ్లబెట్టేశారు. వచ్చీ రాగానే ఆమె డ్యాన్స్‌తో మెరిపించింది. దీంతో శ్రీముఖి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.
|
అదే సమయంలో ట్రోల్స్ కూడా..
శ్రీముఖికి బయట ఎంత పాపులారిటీ ఉందో అంతే వ్యతిరేకత ఉంది. అందుకే ఆమెను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. నిక్కరు విషయంలో ఎవరూ ఏమీ అనకపోయినా.. శ్రీముఖి వాయిస్‌ను మాత్రం బాగా ట్రోల్ చేశారు. ప్రతి దానికి లౌడ్ స్పీకర్ సౌండ్ వచ్చేలా మాట్లాడుతుండడంతో పలువురు ఆమెపై మీమ్స్ క్రియేట్ చేశారు. అంతేకాదు, సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు.
|
శ్రీముఖి కన్నింగ్ అంటూ
వారాలు గడుస్తున్న కొద్దీ ఎవరు ఎలాంటి వారో ప్రేక్షకుల అర్థం చేసుకోవడం మొదలు పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు ఇష్టం లేని వారిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీముఖినే చాలా మంది టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కన్నింగ్ అని, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని అంటున్నారు.
|
పట్టుకుంటానంటే టాస్క్ మానేస్తా
శ్రీముఖి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కొందరు ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ‘నువ్వు గానీ, రాహుల్ గానీ, వరుణ్ గానీ నన్ను ఇట్లా పట్టుకుంటే తీసుకోలేను. నేను దానికి టాస్క్ ఆడకుండా ఉండడానికైనా రెడీ' అంటూ ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ ఓ వీడియోను క్రియేట్ చేశారు కొందరు నెటిజన్లు. దీనితో పాటు మంగళవారం జరిగిన ఎపిసోడ్లో కూడా రాహుల్‌ను పట్టుకోవద్దని ఫైర్ అయింది శ్రీముఖి.
లేడీ కార్డ్ వాడుకోవద్దు
ఈ వీడియోలు, పోస్టులు మాత్రమే కాదు.. చాలా మంది ఆమెను ఆడుకుంటున్నారు. బిగ్ బాస్‌కు వచ్చే ముందు అక్కడ ఫిజికల్ టాస్కులు ఉంటాయని తెలియదా..? లేడీ కార్డ్ ఉపయోగించి ఆడుకుంటున్నావా..? ఇక్కడ మిగతా ఆడవాళ్లు ఆడడం లేదా..? అంటూ ఆమెపై ప్రశ్నలు సంధిస్తున్నారు.