శ్రీముఖిపై హాట్ హాట్ చర్చలు.. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటూనే! ఆ రకమైన పనులు

శ్రీముఖి.. మొన్నటిదాకా హాట్ యాంకర్. పటాస్ అంటూ జోకులు పేల్చిన ముద్దుగుమ్మ. కానీ ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌‌మెట్. బిగ్ బాస్‌లో ఉన్న 15 మంది పార్టిసిపెంట్లలో శ్రీముఖికి స్పెషల్ క్రేజ్ ఉంది. నిజానికి ఎప్పటినుంచో శ్రీముఖి బిగ్ బాస్ హౌస్‌మెట్ కాబోతోందని వార్తలు వచ్చినా, వాటి పట్ల స్పందించకుండా సీక్రెట్‌గా ఉంచి స్పెషల్ హైప్ క్రియేట్ చేసుకుంది ఈ హాట్ యాంకర్. పైగా బిగ్ బాస్‌కి కొన్ని రోజుల ముందు నుంచే ప్లాన్డ్‌గా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక కూడా ఆమె ఖాతా నుంచి ట్విట్టర్ అప్‌డేట్స్ వస్తుండటం హాట్ హాట్ చర్చలకు దారితీస్తోంది.

సోషల్ మీడియాలో శ్రీముఖి

సోషల్ మీడియాలో శ్రీముఖి

నిజానికి నేటితరం టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో శ్రీముఖి చాలా యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది. యాంకర్‌‌గా బిజీగా ఉంటూనే ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో తన ఫొటోలు పెడుతూ నెటిజన్లను టచ్‌లో ఉంచుకుంటుంది. కానీ ఇప్పుడామె బిగ్ బాస్ హౌస్‌మెట్ కాబట్టి ఇక ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కనిపించదని అనుకున్నారంతా.

 ట్విట్టర్ అప్‌డేట్స్ చూసి షాకవుతున్న జనం

ట్విట్టర్ అప్‌డేట్స్ చూసి షాకవుతున్న జనం

సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లోకి సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించరు. కాబట్టి శ్రీముఖి సోషల్ మీడియా అప్‌డేట్స్ ఆగిపోతాయనుకుంటే.. అలా జరగలేదు. ఇప్పుడు కూడా ఆమె ట్విట్టర్ ఖాతా నుంచి అప్‌డేట్స్ యాక్టివ్‌గా వస్తున్నాయి. దీంతో జనం షాక్ అవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే శ్రీముఖి తన ట్విట్టర్ అకౌంట్‌ని వేరే వాళ్ళతో ఆపరేట్ చేయిస్తూ సోషల్ మీడియా టచ్ మిస్ కాకుండా చూసుకుంటోందని తెలుస్తోంది.

ఇప్పటికే శ్రీముఖి ఆర్మీ

ఇప్పటికే శ్రీముఖి ఆర్మీ

శ్రీముఖి ‘బిగ్ బాస్'కు రాకముందే ఆమె పేరిట ఒక ఆర్మీ వెలిసింది. సోషల్ మీడియాలో కొందరు ‘శ్రీముఖి ఆర్మీ' అని ఒక గ్రూపును క్రియేట్ చేశారు. ఇందులో భాగస్వాములు అయిన సభ్యులందరూ ఆమెను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో ఆమెకు వ్యతిరేకంగా ఉన్న వారిని విమర్శిస్తున్నారు. ఈ రకంగా సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ శ్రీముఖికి బాగా ప్లస్ అవుతున్నాయి.

గత సీజన్‌లో కౌశల్.. ఇప్పుడు శ్రీముఖి

బిగ్ బాస్ గత సీజన్‌లో ఇలాగే కౌశల్‌ని సోషల్ మీడియానే గట్టెక్కించింది. అదే ఫార్ములా శ్రీముఖి అప్లై చేస్తుందని క్లియర్‌గా అర్థమవుతోంది. అందుకే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నా కూడా వేరొకరి ద్వారా తన అఫీషియల్ ఖాతా నుంచి అప్‌డేట్స్ ఇస్తోంది. ఇక శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ హౌజ్‌ తగల బెడతాం అని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్నింగ్‌లు మొదలయ్యాయంటేనే తెలుస్తోంది శ్రీముఖి సోషల్ మీడియా ఎఫెక్ట్.

అందరి దృష్టి శ్రీముఖి పైనే.. మొత్తానికి తప్పించుకుంది

అందరి దృష్టి శ్రీముఖి పైనే.. మొత్తానికి తప్పించుకుంది

మరోవైపు ఎలిమినేషన్ మొదటి జాబితాలో శ్రీముఖి పేరు ఉన్నప్పటికీ.. హిమజను నామినేట్ చేసి తప్పించుకుంది శ్రీముఖి. ఆమె చెప్పిన కారణాలు నచ్చడంతో మానిటర్ హేమ.. ఆమె బదులు హిజను నామినేట్ చేసింది. ఆ సమయంలో హేమకు హిమజకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. చూడాలి మరి కౌశల్ లాగే శ్రీముఖి కూడా చివరి వరకూ పోరాడి గెలుస్తుందేమో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X