శ్రీముఖి, రాహుల్ మధ్య భగ్గుమన్న విభేదాలు.. తీట్టుకొన్న అలీ, మహేష్.. ఆ ఇద్దరికి జైలుశిక్ష

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో గురువారం ఎపిసోడ్ గొడవలతో దద్దరిల్లింది. అలీ రెజా-మహేష్ విట్ట, శ్రీముఖి-రాహుల్ మధ్య విభేదాలు భగ్గమన్నాయి. దాంతో వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను ఇంటి కెప్టెన్ శివజ్యోతికి అప్పగించారు. దాంతో మెయిన్ హాలులో పంచాయితీ మొదలైంది. వారి మధ్య విభేదాలకు కారణమైన అంశాలపై చర్చ జరిగింది. ఆ సమయంలో ఆ నలుగురి మధ్య మరోసారి వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది. ఇంతకు వారి మధ్య గొడవ ఎక్కడకు దారి తీసిందంటే..

రాజీ ప్రయత్నాలతో కెప్టెన్ శివజ్యోతి

రాజీ ప్రయత్నాలతో కెప్టెన్ శివజ్యోతి

గత కొద్దికాలంగా ఇంటి సభ్యుల మధ్య పరిష్కరించుకోలేని సమస్యలకు ముగింపు పలకాలని బిగ్‌బాస్ ప్రయత్నం చేశారు. ఇంటి సభ్యులపై సేకరించిన ఫిర్యాదుల ఆధారంగా ఎక్కువ ఎవరితో సమస్యలు తలెత్తాయనే విషయంపై చర్చ జరిగింది. రాహుల్, మహేష్ విట్ట మధ్య కెప్టెన్ శివజ్యోతి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. కానీ వారిద్దరి మధ్య సయోధ్య కుదిరే అవకాశం లేకపోయింది.

మితీమిరిన విభేదాలు

మితీమిరిన విభేదాలు

రాహుల్, మహేష్ విట్ట నుంచి వారి అభిప్రాయాలు, వాదనలు వినేందుకు శివజ్యోతి అవకాశం ఇచ్చింది. ఆ సందర్భంగా అలీ, మహేస్ మితిమీరిన మాటలు రువ్వుకొన్నారు. నీ ఇల్లు అనుకోకు అని మహేష్ అంటే.. నా ఇల్లే జారే జా అంటూ అలీ పొగరుగా సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య గట్టిగానే వాదనలు జరిగాయి. శివజ్యోతి వారిని వారించేందుకు ప్రయత్నించారు.

శ్రీముఖిపై రాహుల్ ఫైర్

శ్రీముఖిపై రాహుల్ ఫైర్

ఇక మహేష్, అలీ తర్వాత రాహుల్ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకొని శివజ్యోతి చదివారు. అందులో శ్రీముఖికి క్షమాపణ చెప్పినట్టు రాశారు. కానీ అంతలోనే రాహుల్ లేచి మరోసారి శ్రీముఖిపై విరుచుకుపడ్డారు. దాంతో శ్రీముఖి గట్టిగానే జవాబిచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో శ్రీముఖి, రాహుల్ మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి.

రాహుల్, మహేష్‌ను జైలుకు

రాహుల్, మహేష్‌ను జైలుకు

కెప్టెన్ సమక్షంలో వాదనలు జరిగిన తర్వాత శివజ్యోతిని బిగ్‌బాస్ తీర్పు చెప్పమన్నారు. దాంతో ఇంటిలో రాహుల్, మహేష్‌పై ఎక్కువ కంప్లయింట్స్ ఉన్నాయని చెప్పింది. దాంతో బిగ్‌బాస్ తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నారు. వారిద్దరి జైలులో బంధించాలని బిగ్‌బాస్ తీర్పు చెప్పారు. దాంతో వారిద్దరిని జైలు గదిలోకి పంపారు.

శివజ్యోతిని ఆటపట్టించిన

శివజ్యోతిని ఆటపట్టించిన

ఇక శివజ్యోతిపై ఇంటి సభ్యులు మజాక్‌లు ఆడారు. శివజ్యోతిని బాబా భాస్కర్, అలీ దిండులతో కొట్టి విసిగించారు. దాంతో కెప్టెన్ అంటే విలువ లేకుండా పోతుంది. కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదు. మీరు కెప్టెన్ అయినప్పుడు మీ సంగతి చూస్తా అని శివజ్యోతి సరదాగా హెచ్చరించింది. ఇంటిని చూస్తే అంగన్‌వాడి కేంద్రంగా మారింది అంటూ శివజ్యోతి వాపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X