అందరి ముందు ఓపెన్‌గా చెప్పేసింది.. ఢీ కంటెస్టెంట్‌ను పెళ్లి చేసుకుంటానంటోన్న శ్రీముఖి
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి సంచలన కామెంట్స్ చేసింది. ఇంకో రెండేళ్లలో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీలోంచి వెళ్లిపోతానంటోంది. అయితే తాను మనసు పడిన వాడి గురించి కూడా చెప్పేసింది. అక్కడే అందరి ముందు అడిగిసేంది కూడా. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇక ఇదంతా జరిగింది సుమ హోస్ట్ వచ్చే క్యాష్ షోలో. ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా విడుదలైంది. వచ్చే వారం ఎపిసోడ్‌లో గెటప్ శ్రీను, విష్ణు ప్రియ, ఢీ కంటెస్టెంట్ పండు, శ్రీముఖి గెస్ట్‌లుగా విచ్చేశారు.

షోలో రచ్చ..
ఢీ కంటెస్టెంట్ పండు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. పలాస సినిమాలో నక్కిలీసు గొలుసు పాటకు దుర్గారావ్ స్టెప్పులు వేయడం, ఆ లేడీ గెటప్ అతనికి బాగా సూట్ అయ్యాయి. ఇక పండు ఎక్కడికి వెళ్లినా అదో సిగ్నేచర్ స్టెప్ అయింది. పాట వేయడం, డ్యాన్సులు చేయడం కామన్ అయిపోయింది.

అతడినే చేసుకుంటా..
శ్రీముఖి తన మనసులో మాటను బయటపెట్టి.. మామూలుగా పండును పెళ్లి చేసుకుందామని అనుకున్నాను.. ఆ లేడీ గెటప్ వేసుకోకపోతే.. అని చెప్పుకొచ్చింది. నీకు ఇష్టమేనా? నువ్ ఓకే అంటే చేసుకుందాం అని ఏకంగా పండును అడిగేసింది. దీంతో సుమ షాక్ అయింది.

తొమ్మిది నెలలు..
ఇక మరో సందర్భంలో సుమ ఓ ప్రశ్నకు సంబంధించిన కొన్ని ఆప్షన్స్ చెప్పింది. అందులో తొమ్మిది నెలలు లేవేంటి? అని శ్రీముఖి అడిగింది. దానికి పండు సెటైర్ వేస్తూ.. అది మనం తరువాత చూసుకుందాం అని అనేశాడు. దీంతో శ్రీముఖి అవాక్కైంది.

అలాంటి ప్రశ్న..
సుమ క్యాష్‌లో బాస్కెట్ బాల్ ఆట ఆడిస్తుందన్న సంగతి తెలిసిందే. బాస్కెట్ బాల్ కరెక్ట్‌గా వేయాలి లేదంటే.. ఆన్సర్ చెప్పాలి.. అందులో పడితే ఆన్సర్ చెప్పనక్కర్లేదు. రెండేళ్ల తరువాత సుమ స్థానాన్ని భర్తీ చేస్తాను.. అసలు సుమ నాకు పోటీయే కాదు అనే ఈ రెండు ప్రశ్నలను శ్రీముఖికి సంధించింది సుమ.
Recommended Video

రెండేళ్లలో పెళ్లి..
రెండేళ్లలో నాకు పెళ్లి అవుతుంది.. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా.. సుమక్క ఎప్పుడూ అదే స్థానంలో ఉండాలి అని అసలు విషయాన్ని చెప్పింది. ఇక రెండేళ్లలో శ్రీముఖి పెళ్లి అని మాత్రం ప్రకటించేసింది. అయితే ఆ సమయంలో పండు ముందుకు వచ్చి గెటప్ శ్రీనుతో ఎక్స్ ట్రాలు చేస్తుండటంతో ఆమె రెండేళ్లలో పెళ్లి అంది కానీ అది నీతో కాదు.. నువ్ తోడు పెళ్లి కొడుకువి అని కౌంటర్ వేశాడు


Click it and Unblock the Notifications











