Bigg Boss Telugu : తొక్కేస్తారు , K బ్యాచ్ ట్రాప్‌లో పడొద్దు .. గౌతమ్ కళ్లు తెరిపించిన శ్రీముఖి
మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ప్రతిసారి 10వ వారం నాటికే విజేత ఎవరో తేలిపోతుంది. కానీ ఈ సీజన్‌లో 13వ వారం వచ్చినా బిగ్‌బాస్ టైటిల్ ఎవరిదో చెప్పలేకపోతున్నారు. వారానికొకరు తమ హవా చూపిస్తూ ఉండటంతో ప్రేక్షకులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. టికెట్ టూ ఫినాలే టాస్క్‌లలో భాగంగా నిన్న హౌస్‌లోకి వచ్చిన బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ కొందరు కంటెస్టెంట్స్‌కి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఈ సీజన్‌లో గౌతమ్, నిఖిల్ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోందని టాక్. సీజన్ మొదలైనప్పటి నుంచి హౌస్‌ను నడిపిస్తూ టాస్క్‌ల్లోనూ , మైండ్ గేమ్‌లోనూ తన హవా చూపిస్తున్నాడు. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ మొత్తానికి నాయకుడిగా నడిపిస్తున్నాడు. నామినేషన్స్, టాస్క్‌లు ఇతర అంశాల్లో నిఖిల్ చెప్పినట్లే వాళ్లు చేస్తున్నారు. గ్రూప్ గేమ్ అనే విమర్శలు వస్తున్నా, ఆడవాళ్ల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నాడని అంటున్నా నిఖిల్ మాత్రం తగ్గడం లేదు. అయితే గత కొంతకాలంగా నిఖిల్ గ్రాఫ్ స్వల్పంగా తగ్గింది. ఎప్పుడు నామినేషన్స్‌లోకి వచ్చినా ఖచ్చితంగా టాప్‌లో ఉండే నిఖిల్.. కొద్దిరోజులుగా వెనుకబడిపోతున్నాడు.

ఇదిలాఉండగా.. ఈసారి విజేత గౌతమ్ కృష్ణే అంటున్నారు బిగ్‌బాస్ లవర్స్. 7వ సీజన్‌లో స్పై బ్యాచ్‌కి చుక్కలు చూపించిన గౌతమ్.. తుది పోరులో వెనుదిరిగాడు. బిగ్‌బాస్ తెలుగు 8లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. తనకు దక్కిన మరో అవకాశాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ వేస్ట్ చేసుకోనని చెప్పాడు. అందుకు తగినట్టుగానే మనోడు కష్టపడుతున్నాడు. గత కొద్దివారాలుగా నామినేషన్స్‌లో నిలిచిన ప్రతిసారి గౌతమ్ టాప్‌లో ఉంటున్నాడు. కోపంతో ఊగిపోయే గౌతమ్‌కి అది మైనస్.. కానీ టాస్క్‌ల్లో ఇతను విజృంభించి ఆడతాడు.
ఫ్యామిలీ మెంబర్స్ వీక్ తర్వాత గౌతమ్‌కి ఎక్కడా లేని హైప్ వచ్చింది. వచ్చినవాళ్లంతా గౌతమ్‌ని ఖచ్చితంగా టాప్ 5లో పెట్టడంతో పాటు చాలా మంది నెంబర్ వన్ ప్లేస్ ఇవ్వడంతో కన్నడ బ్యాచ్ తట్టుకోలేకపోతుంది. మనకు ఎదురేలేదు అన్నట్లుగా సాగుతున్న దశలో గౌతమ్ పోటీకి రావడంతో మనోడిని కే బ్యాచ్ టార్గెట్ చేసింది. దీనిని పసిగట్టిన గౌతమ్.. కొందరు నాతో అబద్ధపు ప్రేమలు చూపిస్తున్నారని.. కొందరైతే నేను టాప్ 5లో ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నారని వ్యాఖ్యానించాడు.
Sreemukhi is also telling matallatho rechagodtaru rechipoku ..
— Bigg Buzz (@TeluguBBBuzz) November 30, 2024
Everyone knows that k batch wanted ga trigger chestunaru gautham ni ...#BiggBossTelugu8 #GauthamKrishna
pic.twitter.com/NTOFUtaNhf
టికెట్ టూ ఫినాలే టాస్క్‌ల కోసం హౌస్‌లోకి వచ్చిన ప్రియాంక జైన్, ఆట సందీప్‌లు ఖచ్చితంగా గౌతమే విన్నర్ అవుతారని చెప్పారు. ఇదే సమయంలో స్టార్ యాంకర్ శ్రీముఖి కూడా ఇంట్లోకి వచ్చి గౌతమ్‌తో విడిగా మాట్లాడింది. జాగ్రత్తగా ఆడాలని.. కన్నడ బ్యాచ్ రెచ్చగొట్టాలని చూస్తుందని, రెచ్చిపోవద్దని సలహాలు ఇచ్చింది. నీలో సెల్ఫ్ కంట్రోల్ ఉందని తాను అనుకుంటున్నానని ... ఆల్ ది బెస్ట్ అంటూ గౌతమ్‌ని ఎంకరేజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. గౌతమ్‌కి నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











