Sreenivasa Sayee Elimination: బిగ్‌బాస్ నుంచి శ్రీనివాస్ సాయి ఎలిమినేట్.. బతికిపోతాడనుకుంటే బలయ్యాడుగా!
బిగ్‌బాస్ తెలుగు 9లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరో 5 వారాల్లో బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కి ఎండ్ కార్డ్ పడనుండగా.. వీరిలో ఎవరు విజేత కానున్నారు అన్నది ఉత్కంఠగా మారింది. ఐదు వారాల సమయం ఉండటంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు? ఫైనల్ నాటికి ఎంతమంది హౌస్‌లో నిలుస్తారోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక 9వ వారంలో ఇప్పటికే రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ కాగా.. ఆదివారం మరో కంటెస్టెంట్ శ్రీనివాస్ సాయి కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఈ వివరాల్లోకి వెళితే..
9వ వారం నామినేషన్స్‌లో ఎవరంటే?
15 మందితో బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభం కాగా.. మధ్యలో దివ్య నిఖిత, ఆ తర్వాత 6గురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ, ఆయేషా జీనత్, రమ్య మోక్ష కంచర్ల, దివ్వెల మాధురి, రాము రాథోడ్‌లు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, భరణి శంకర్, దివ్య నిఖిత, గౌరవ్ గుప్తా, పడాల పవన్ కళ్యాణ్, నిఖిల్ నాయర్, పవన్ డిమోన్, సుమన్ శెట్టి, శ్రీనివాస్ సాయి ఉన్నారు. 9వ వారం సుమన్ శెట్టి, భరణి శంకర్, సంజన గల్రానీ, పవన్ కళ్యాణ్ పడాల, రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, తనూజ పుట్టస్వామిలు నామినేషన్స్‌లో ఉన్నారు.

రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్
బిగ్‌బాస్ తెలుగు 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లలో ఒకరిగా నిలిచిన రాము రాథోడ్.. తను ఎలిమినేట్ చేసేయాల్సిందిగా నాగార్జునను కోరారు. తనకు ఇల్లు గుర్తొస్తోందని, ఇక అమ్మానాన్నలకు దూరంగా ఉండలేనని చెప్పాడు. మరోసారి ఆలోచించుకోమ్మని నాగార్జున, ఇతర హౌస్‌మెట్స్ చెప్పినప్పటికీ తాను వెళ్లిపోతానని రాము పట్టుబట్టడంతో అతనిని సెల్ఫ్ ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగ్ ప్రకటించారు. 5 వారాల వరకు ఆటలో ఫైర్ చూపించిన రాముకి హోమ్ సిక్ పట్టుకుంది. దాంతో తాను వెళ్లిపోతానంటూ గత కొద్దిరోజులుగా చెబుతూ వస్తున్నాడు. అయినప్పటికీ మెరుగైన ఓటింగ్ సాధిస్తూ ఫైనల్‌లో ఉంటాడని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ చివరికి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు రాము రాథోడ్.
డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్
రాము హౌస్‌ను వీడటంతో ఆదివారం ఎలిమినేట్ ఉండదని అనుకున్నారు.. కానీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్‌బాస్ టీమ్ ఆల్రెడీ లీకులు ఇచ్చేసింది. దీని ప్రకారం సాయి శ్రీనివాస్ ఆదివారం ఎలిమినేట్ అయ్యాడట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓటింగ్ పరిశీలిస్తే.. పవన్ కళ్యాణ్ పడాల (21.5 శాతం), తనూజ పుట్టస్వామి (16.87 శాతం), రాము రాథోడ్ (15.9 శాతం), భరణి (15.06 శాతం), సంజన గల్రానీ (13.05 శాతం), సుమన్ శెట్టి (8.99 శాతం), శ్రీనివాస్ సాయి ( 8.63 శాతం) చొప్పున ఓటింగ్ నమోదైంది. అయితే అధికారిక ఓటింగ్ ప్రకారం భరణి శంకర్, సాయి శ్రీనివాస్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నవారు. వీరిద్దరిలో సాయికి అతి తక్కువ ఓటింగ్ రావడంతో హౌస్‌ను వీడక తప్పలేదు. రాము సెల్ఫ్ ఎలిమినేషన్ కాగా.. ఈ వారం తాను బతికిపోయినట్లేనని సాయి భావించాడు. కానీ అతని ఆశలపై బిగ్‌బాస్ టీమ్ నీళ్లు చల్లింది.
వెనుకబడ్డ శ్రీనివాస్ సాయి
వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సాయి శ్రీనివాస్ తన మార్క్ చూపించలేకపోయాడు. టాస్క్‌లు, మైండ్ గేమ్, స్క్రీన్ స్పేస్ విషయంలోనూ అతను వెనుకబడిపోయాడు. ఇదే సమయంలో పలు విషయాల్లో తనది కన్నింగ్ మైండ్ సెట్ అని జనాల్లోకి సంకేతాలు రావడంతో ఓటింగ్‌పై ప్రభావం చూపింది. దాంతో సాయిని బయటకు పంపడమే కరెక్ట్ అని బిగ్‌బాస్ టీమ్ భావించింది. అయితే బిగ్‌బాస్ వల్ల శ్రీనివాస్ సాయికి పాపులారిటీ లభించిందని చెప్పొచ్చు. గతంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఇతని గురించి బయట జనాలకి తెలియదు.. ఎప్పుడైతే బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడో నాటి నుంచి ప్రేక్షకులకు నోటెడ్ అయ్యాడు. ఇకపై శ్రీనివాస్ నటించే సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కే అవకాశం ఉంది.
శ్రీనివాస్ సాయి రెమ్యునరేషన్ ఎంత?
ఇదిలాఉండగా.. శ్రీనివాస్ సాయి బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత రెమ్యునరేషన్ అందుకున్నాడనేది ఆసక్తిగా మారింది. ఇతను బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నందుకు వారానికి 2 లక్షల రూపాయల చొప్పున 4 వారాలకు గాను 8 లక్షల రూపాయలను పారితోషికంగా చెల్లించినట్లుగా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











