నా భార్య, కొడుకుపై దారుణంగా.. అందుకే ఆమెకు అలా షాకిచ్చా.. శ్రీశాంత్
హిందీ బిగ్‌బాస్ 12లో శ్రీశాంత్ ఫెర్ఫార్మెన్స్‌కు దేశవ్యాప్తంగా టీవీ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించినా టైటిల్ గెలుచుకోలేకపోయాడు. బిగ్‌బాస్ షోలో చివరి రోజు వరకు టైటిల్ విజేతను దీపికా కక్కర్‌తో ధీటుగా పోటీపడ్డారు. వారి మధ్య జరిగిన గొడవలు, చోటుచేసుకొన్న సంఘటనలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి. తాజాగా బిగ్‌బాస్ 12 టైటిల్ విన్నర్ దీపికాకు శ్రీశాంత్ ఝలక్ ఇవ్వడం మీడియాలో చర్చనీయాంశమైంది. వారి మధ్య ఏం జరిగిందంటే..

దీపిక కక్కర్‌పై శ్రీశాంత్ అసంతృప్తి
సోషల్ మీడియాలో దీపిక కక్కర్ వ్యవహారంతో మనస్తాపం చెందిన శ్రీశాంత్ కొద్దిరోజుల క్రితం అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నారు. దీపిక ట్విట్టర్ అకౌంట్ అన్ ఫాలో చేసి తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. అయితే శ్రీశాంత్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకొన్నారనే విషయంపై స్పష్టత లేకపోయింది. తాజాగా ఆ వ్యవహారంపై శ్రీశాంత్ స్పందించారు.

ట్రోల్స్ చేయవద్దని చెప్పితే..
బిగ్‌బాస్ 12 షో జరుగుతున్నప్పడు.. పూర్తయిన తర్వాత దీపికను నా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. దాంతో ఆమెను కించపరచడం బాగుండదనిపించింది. అలాంటి ట్రోల్స్ చేయవద్దని నేను చెప్పడంతో నా ఫ్యాన్స్ ఊరుకొన్నారు. కానీ ఆమె అభిమానులు నా భార్య, కొడుకుపై దారుణమైన కామెంట్లు చేయడం నాకు నచ్చలేదు అని శ్రీశాంత్ చెప్పారు.

నా భార్యను, కొడుకును దారుణంగా
నా భార్య, కొడుకు అంటే నాకు ఎనలేని ప్రేమ. నాకు పూర్తిబలం. అలాంటి నా భార్యను, కొడుకును అసభ్యమైన కామెంట్లతో టార్గెట్ చేయడం నాకు నచ్చలేదు. నేను నా ఫ్యాన్స్‌ను ఆపినప్పుడు.. ఆమె కూడా తన అభిమానులకు చెప్పుకోవాల్సింది. కానీ ఆమె అది చేయలేదు అని శ్రీశాంత్ ఆవేదన చెందాడు.

ఎందుకు చేశానో అని చెప్పాలని
దీపికా కక్కర్ నాకు సోదరి లాంటింది. ఎలాంటి విభేదాలు ఉన్నా బిగ్‌బాస్ షో వరకే. కానీ ఆమెతో ఉన్న రిలేషన్‌ను గౌరవిస్తాను. అయితే దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. కాబట్టి దీపికను ఎందుకు అన్‌ఫాలో చేశానో చెప్పాలనుకొని మీడియాకు వెల్లడించాను.


Click it and Unblock the Notifications











