ఆస్తి కోసం బుల్లితెర నటికి టార్చర్... నూడిల్స్ ఫోర్క్‌ని కాల్చి దారుణంగా..

ఎంతో శ్రమించి మనల్ని అలరించే నటీనటుల జీవితాలు .. నిజ జీవితంలో విషాదాలుగా మారుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల చేతిలో మోసిపోయిన వారెందరో. కొందరు ఈ మోసాన్ని తట్టుకోలేక జీవితాలను వదిలేస్తుండగా.. మరికొందరు బాధను భరిస్తూనే నెట్టుకొస్తున్నారు. ఎంతోమంది సినీ ప్రముఖులు తమకు జరిగిన దారఉణాలను బయటపెడుతున్నారు. తాజాగా తెలుగు బుల్లితెర నటి, యాంకర్ శ్రీవాణి తనకు జరిగివ అన్యాయాన్ని వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌కు చెందిన శ్రీవాణి తొలుత సినిమాలతోనే తన అదృష్టం పరీక్షించుకున్నారు. సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఆయన కుమారుడు వైభవ్ హీరోగా వచ్చిన గొడవ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. తర్వాత ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన సినీరంజనీ కార్యక్రమానికి యాంకర్‌‌గా వ్యవహరించారు. ఈ షో కారణంగా వచ్చిన గుర్తింపుతో శ్రీవాణికి సీరియల్స్‌‌లో అవకాశాలు దక్కాయి. సంఘర్షణ, కాంచన గంగ, చంద్రముఖి ధారావాహికల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. వీటితో పాటు మావిచిగురు, కలవారి కోడళ్లు, ఘర్షణ ది డ్యాన్స్ బాటిల్, ఎగిరే పావురమా, అథీరా, రాములమ్మ, తిరు మాంగళ్యం అనే సీరియల్స్‌లో నటించారు.

Sreevani Clarifies Ongoing Property Dispute Controversy with her sister in law in a Kissik Talks with jabardasth Varsha

17 ఏళ్ల వయసులోనే నటుడు, కొరియోగ్రాఫర్ విక్రమాదిత్యతో ప్రేమలో పడ్డారు శ్రీవాణి. అయితే ఇంట్లో పెళ్లికి ఒప్పుకునే పరిస్ధితులు లేకపోవడంతో ప్రియుడి కోసం ఇంట్లోంచి పారిపోయారు. హైదరాబాద్ నునంచి అమలాపురం దగ్గర ఓ గ్రామానికి పారిపోయి అక్కడే కొన్నాళ్లు ఉన్నారు. లీగల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే 18 సంవత్సరాలు నిండాలని చెప్పడంతో మైనారిటీ తీరే వరకు వెయిట్ చేసి తర్వాత విక్రమ్ - శ్రీవాణిలు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు రాజనందిని సంతానం. ప్రస్తుతం ఈ దంపతులు సినిమాలు, సీరియల్స్, ఈవెంట్స్‌తో పాటు ఇతర వ్యాపారాలతో దూసుకెళ్తున్నారు. కొద్దిరోజుల క్రితం జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్ షో ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవాణి తన కెరీర్‌తో పాటు కుటుంబంలో ఆస్తి గొడవలపై కీలక విషయాలు పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

శ్రీవాణికి కేజీల కొద్దీ బంగారం ఉందని అనుకుంటున్నారు. కానీ సీరియల్స్‌లో ఉన్నది చూసి నిజమని అనుకోవద్దు. అదంతా గిల్ట్. నాకున్న ఆస్తులన్నీ లోన్స్‌లో పెట్టి కొన్నవే. లోన్ లేకుండా ఒక్కటైనా ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. మా మావయ్య గారికి రెండెకరాల ల్యాండ్ ఉంది, అందులో మాకు 300 గజాల వాటా ఉంది. కానీ దాని పేరు రాజనందిని గార్డెన్స్ అని ఉంటుంది. లోన్ ఉండకూడదని రూపాయి రూపాయి జమ చేసుకుని కట్టుకుంటున్నానని శ్రీవాణి తెలిపారు.

ఆస్తి విషయంలో మా వదిన పెట్టిన కేసు ఇంకా రన్ అవుతోంది. మా అన్నయ్య చనిపోయినప్పుడు నేను ఒక తమిళ్ సీరియల్‌లో చేస్తున్నాను. పొద్దున్నే మా అన్నయ్య వాళ్లని చూసి కార్యక్రమం అయ్యే వరకు లేము.. వెళ్లిపోయాం. మా ఆయన తీసుకెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో దించారు.. అది డైలీ సీరియల్ కాబట్టి టెలికాస్ట్ ఆగదు. షెడ్యూల్ అయిపోయిన తర్వాత పలకరిద్దామని పోయిన పాపానికి, అప్పటికే మా ఇల్లు 2014 నాటికే కూలిపోయింది. కానీ 2016లో బుల్డోజర్ తీసుకెళ్లి నేనే కూలగొట్టి.. ఆవిడ సామాన్లు బయటికి విసిరేసి, ఆమెను కొట్టానని వరకట్న వేధింపుల కింద కేసు పెట్టింది సింపుల్‌గా అంటూ శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు.

కొట్టడం ఏంటీ? ఇల్లు కూలగొట్టడం ఏంటీ? బయటివాళ్లు ఏమైనా చేస్తారేమో కానీ ఇండస్ట్రీలో ఉండి, ప్రెస్‌వాళ్లు ఉంటారని తెలిసి, నేను షోలు చేసుకుంటూ, నేను అంత గుడ్డిగా ఎందుకు బిహేవ్ చేస్తానని అనుకుంటారు. చుట్టూ సాక్షుల్ని పెట్టి మేమే చేయించామని చెప్పించడంతో షాకయ్యా. తెలుగులో మూడు డైలీ సీరియల్స్, తమిళ్‌లో రెండు సీరియల్స్ చేస్తున్నా.. ఏ డేట్‌లో ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. అలాంటి మేము వెళ్లి ఆవిడను హింసిస్తున్నానట. నేను స్క్రీన్ మీద కనిపిస్తున్నాను కాబట్టి నా పేరే కనిపిస్తోంది.. కానీ మా అమ్మనాన్న, మా నలుగురు అక్కలు, మా పెద్దబావ, మా అక్క కూతురు మీద కేసులు పెట్టింది. మా అందరితో రిలేషన్ కట్ చేయించుకుందామని పెట్టినట్లుందని శ్రీవాణి తెలిపారు.

ఆవిడతో మాకు అంత క్లోజ్‌నెస్ లేదు. వాళ్లకు పెళ్లియినప్పుడు నాకు ఏడేళ్లు. నేను పుట్టి పెరిగినదంతా సిటీలోనే. నా పని నేను చేసుకుంటుంటే సొంత వదిన కొట్టింది, మ్యాగీ తింటూ మ్యాగీ స్పూన్‌తో కాల్చింది, ఆవిడ దగ్గరున్న బియ్యం బస్తా తీసుకెళ్లిపోయిందని ప్రచారం చేసింది. కారు వేసుకుని వెళ్లి ఆవిడ దగ్గరున్న ఒక బియ్యం బస్తా తెచ్చుకుంటానా నేను? ఇలాంటి ఎవరు రాస్తారా అని ఒక్క సెకను నవ్వు వచ్చింది. తప్పు చేసినవాడు భయపడాలి, నేను తప్పు చేసినట్లయితే మా అమ్మనాన్న, అక్కలు, మా అత్తమ్మ మావయ్య, నా భర్త అందరూ నాతో ఉండరు కదా.. నేను అలాంటి దానిని అని తిడతారు కదా? వాళ్లందరూ నాకు సపోర్ట్ ఉన్నారంటే నేనేం చేయలేదు కదా. నేను హింసించినట్లు సాక్ష్యం ఉంటే చెప్పండి, చేయని తప్పుని చేశానంటే నీకు ఏమనిపిస్తుంది. అక్కడ ఎంత ఆస్తి ఉందో నాకేం తెలియదు, మేం క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం.. మా అమ్మ ఏం చెప్పలేదు. ఈ కేసు ఎప్పటికి ముగుస్తుందో.. శిక్ష మాకు వేస్తారో? ఆవిడకు వేస్తారో? అంటూ శ్రీవాణి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: Sreevani jabardasth varsha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X