twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైపర్ ఆది వివాదం, రంగంలోకి శ్రీరెడ్డి బూతులతో... అసలేం జరిగింది?

    |

    Recommended Video

    Actress Sri Reddy Fires On Hyper Aadi || Filmibeat Telugu

    జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది ఈ షోలో తాను చేసే స్కిట్ల ద్వారా తనకు నచ్చని వారిని టార్గెట్ చేస్తుంటారని, వారిపై కావాలనే సెటైర్లు వేస్తుంటారనే వాదన ఉంది. ఇటీవలో ఓ స్కిట్లో కాట సుబ్బరావు అనే మీడియా, రాజకీయ విశ్లేషకుడిని తీట సుబ్బరావు అంటూ ఆది పంచులు కురిపించాడు.

    పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అంటే అభిమానించే హైపర్ ఆది... వారిని విమర్శించే వారిపై సమయం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతుంటారు. మా నాయకుడికి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి ప్రకటన చేసినా ఊరుకునేది లేదంటూ పలు సందర్భాల్లో ఆది స్టేట్మెంట్స్ సైతం ఇచ్చారు.

    పబ్లిక్ లైఫ్‌లోకి వస్తే అంతే...

    పబ్లిక్ లైఫ్‌లోకి వస్తే అంతే...

    రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే పబ్లిక్ లైఫ్‌లోకి రావడమే. అలా వచ్చిన వారిని జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు... ఆ నాయకులు అనుసరించే విధానాలు బేరీజు వేస్తూ అవసరమైనపుడు ప్రశంసించడం, విమర్శించడం చేస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్ లాంటి వారిని విమర్శించినపుడు ఆది లాంటి అభిమానులు వారి టార్గెట్ చేయడం, కించ పరిచే విధంగా అభ్యంతర వ్యాఖ్యలు చేస్తుండటంతో వివాదం మొదలైంది.

    శ్రీరెడ్డి ఫైర్

    శ్రీరెడ్డి ఫైర్

    ఈ వ్యవహారంపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీ ద్వారా స్పందిస్తూ... ఆది మీద బూతుల వర్షం కురిపించారు. అరేయ్ ఆది.. నీది కోసేస్తా అంటూ తనదైన శైలిలో ఆమె కామెంట్స్ చేశారు. శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    బిగ్‌బాస్3 హోస్ట్‌గా ఆ హీరో.. పేరు బయటపెట్టిన శ్రీరెడ్డి.. లీక్‌తో ఫ్యాన్స్..బిగ్‌బాస్3 హోస్ట్‌గా ఆ హీరో.. పేరు బయటపెట్టిన శ్రీరెడ్డి.. లీక్‌తో ఫ్యాన్స్..

    హైపర్ ఆది అభిమానం

    హైపర్ ఆది అభిమానం

    పవన్ కళ్యాణ్ అభిమాని అయిన ఆది... జబర్దస్త్ షోలోకి వచ్చిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబుకు మరింత దగ్గరయ్యారు. పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఆది నుంచి కౌంటర్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అవుతుంది. అలా పవన్ అభిమానిగా తనదైన ముద్ర వేసుకున్నాడు ఈ బుల్లితెర కమెడియన్.

    జనసేన పార్టీకి ప్రచారం

    జనసేన పార్టీకి ప్రచారం

    ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం తన శక్తి మేర హైపర్ ఆది కష్టపడ్డాడు. ఏపీలోని వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రచారం నిర్వహించడంతో పాటు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలతో భేటీ అయి వారిని ఎన్నికల ప్రచార పర్వంలో మరింత చురుకుగా పాల్గొనేలా చేశాడు.

    English summary
    Sri Reddy comment on Hyper Aadi and Kata Subbarao issue. Recently Senior journalist Kata Subrata was criticized by Hyper Aadi. Regarding this, Sri Reddy attacks Hyper Aadi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X