డబ్బిస్తే హీరో, ఇవ్వకపోతే వెధవ... నాగార్జునపై శ్రీరెడ్డి కామెంట్!

తెలుగులో బిగ్ బాస్ మూడో సీజన్ నాగార్జున హోస్‌గా జులై 21న ప్రారంభమై మంచి రేటింగుతో దూసుకెళుతోంది. ఈ సారి హౌస్‌లోకి అందరూ సెలబ్రిటీలే ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత ఆసక్తిగా సాగుతోంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌తో పోలిస్తే... నాగార్జున మూడో సీజన్ పూర్తి భిన్నంగా, స్టైలిష్‌గా సాగుతోంది.

వివాదాలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ షో ఎలాంటి ఆటంకం లేకుండా ప్రారంభం అయింది. కంటెస్టెంట్లుగా వి6 సావిత్రి(శివజ్యోతి), రవికృష్ణ, అషురెడ్డి, జాఫర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీరెజా, మహేష్ విట్టా, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షేరు ఎంటరయ్యారు.

నాగార్జునపై శ్రీరెడ్డి సంచలన కామెంట్

నాగార్జునపై శ్రీరెడ్డి సంచలన కామెంట్

తాజాగా బిగ్ బాస్ షో విషయంలో నాగార్జునపై శ్రీరెడ్డి సంచలన కామెంట్ చేశారు. ‘నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలియవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో... ఇవ్వకపోతే బిగ్ బాస్ ఒక వెధవ' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

నాగార్జున గతంలో ఏమన్నారంటే...

నాగార్జున గతంలో ఏమన్నారంటే...

బిగ్ బాస్ షోపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ గతంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ... ‘బిగ్ బాస్ షో కాన్సెప్టు తనకు ఇష్టం ఉండదని, పక్కింటివాడి జీవితంలోకి తొంగిచూడటం ఏం గేమ్' అంటూ వ్యాఖ్యానించారు. అపుడు అలా అన్న వ్యక్తి ఇపుడు అదే షోను హోస్ట్ చేస్తున్న నేపథ్యంలో... శ్రీరెడ్డి ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఇపుడు ఎలా సమర్దించుకున్నారంటే...

ఇపుడు ఎలా సమర్దించుకున్నారంటే...

‘చల్లటి గాలి.. నీలాకాశం.. చుట్టూ మంచుకొండలు.. ఇలా నేచర్ మధ్యలో బ్రతకడం నాకు చాలా ఇష్టం. అసలు ఆ బిగ్ బాస్ హౌస్‌లో వారు అన్ని రోజులు, అన్ని కెమెరాల మధ్య ఎలా బ్రతుకుతున్నారు? నన్ను బ్రతకమంటే నా వల్ల కాదు. అందుకే ఆ షో అంటే ఇష్టం లేదు. కానీ మనసు కోతి లాంటిది, ఆ షో మీ అందరికీ ఎందుకు ఇష్టమో తెలుసుకోవాలని ఉంది, అందుకే ఈ సారి రంగంలోకి నేను దిగుతున్నాను.' అంటూ నాగార్జున గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.

తొలివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు?

తొలివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు?

నేటితో(జూన్ 28)తో బిగ్ బాస్ తెలుగు తొలి వారం పూర్తి అవుతోంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షోలో ఈ విషయంలో క్లారిటీ రానుంది. హేమ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X