తమన్నా చింపాజాద్రి.... బిగ్ బాస్ కంటెస్టెంటుపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్!

నాగార్జున హోస్ట్‌గా తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3లోకి ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఎంటరయ్యాక షో ఎవరూ ఊహించని విధంగా ముందుకు సాగుతోంది. మొదటి వారం హేమ ఎలిమినేట్ అయిన తర్వాత తమన్నాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి పంపిన సంగతి తెలిసిందే.

తమన్నా వచ్చాక హౌస్‌లో గొడవలు కూడా ఎక్కువయ్యాయి. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా... మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తమన్నా సింహాద్రి సైతం తనకు నచ్చని వారిని టార్గెట్ చేస్తూ రివేంజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది. మంగళవారం జరిగిన షోలో రవికృష్ణను టార్గెట్ చేస్తూ 'పప్పు.. పవర్ లేని పప్పూ' అంటూ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

తమన్నా చింపాజాద్రి

తమన్నా చింపాజాద్రి

కాగా... తమన్నాను టార్గెట్ చేస్తూ నటి శ్రీరెడ్డి ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు. ఆమెను ‘తమన్నా చింపాజాద్రి' అని పేర్కొంటూ తన కోపాన్ని వెల్లగక్కారు. ‘‘గతంలో కొందరు తమన్నా చింపాంజాద్రిని ఇష్టపడ్డారు... బిగ్ బాస్ ఇంట్లో ఆమెను చూసిన తర్వాత ఇపుడు ఎలా ఫీలవుతున్నారో?'' అంటూ కామెంట్ పోస్ట్ చేశారు.

అప్పటి నుంచి శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మారిన తమన్నా

అప్పటి నుంచి శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మారిన తమన్నా

గతంలో శ్రీరెడ్డి, తమన్నా సింహాద్రి మధ్య మంచి సంబంధాలే ఉండేవి. శ్రీరెడ్డి చేపట్టిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి, ఆందోళన కార్యక్రమాలకు తమన్నా తన మద్దతు కూడా ప్రకటించారు. అయితే శ్రీరెడ్డి ఎప్పుడైతే వపన్ కళ్యాణ్‌తో గొడవ పడటం మొదలు పెట్టిందో అప్పటి నుంచి తమన్నా ఆమెకు వ్యతిరేకం అయ్యారు.

మరో పోస్టులో ఆ హీరోను టార్గెట్ చేస్తూ...

మరో పోస్టులో ఆ హీరోను టార్గెట్ చేస్తూ...

ఇటీవల విడుదలైన ‘లయన్ కింగ్' సినిమాపై కూడా శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా ఇంగ్లిష్ వెర్షన్ తను ఎంతో నచ్చిందని, హకునా మటాటా అనే డైలాగ్ బాగా నవ్వించిందని చెప్పుకొచ్చారు. అయితే తెలుగు వెర్షన్లో ఈగ నాయిస్ తనకు చిరాకు తెప్పించిందని పేర్కొన్నారు. ‘ఈగ' అని వ్యాఖ్యానించడం ద్వారా ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ చెప్పిన ఓ యువ హీరోను టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఆ హీరోపై గతంలో కూడా శ్రీరెడ్డి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఎంపీ నవనీత్ కౌర్ ఎంతో మందికి ఆదర్శం

ఎంపీ నవనీత్ కౌర్ ఎంతో మందికి ఆదర్శం

ఒకప్పుడు తెలుగులో హీరోయిన్‌గా రాణించిన నవీనీత్ కౌర్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టడంపై శ్రీరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. నవనీత్ గురించి శ్రీరెడ్డి ప్రస్తావిస్తూ....‘నవనీత్ జీ మీకు సరైన దారిలో వెళుతున్నారు... మీరు ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శం' అని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X