ఆంటీలతో కూడా అలాంటివి.. చూడటానికే వికారంగా ఉంది.. బిగ్‌బాస్‌పై శ్రీరెడ్డి ఫైర్
బిగ్‌బాస్ షోకు, శ్రీరెడ్డికి ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్ ఇంట్లోకి శ్రీరెడ్డిని రప్పించాలనే ప్రయత్నం జరుగుతున్నా అదెందుకో సఫలం కావడం లేదు. అయితే ఒకవేళ శ్రీరెడ్డి బిగ్‌బాస్ హౌస్‌లో ప్రత్యక్షమైతే టీఆర్పీలు బద్దలవ్వడం ఖాయం. అయితే తాజాగా బిగ్‌బాస్ షోపై, సెకండ్ సీజన్‌లో తనను తీసుకోవడానికి పెట్టిన కండీషన్స్ గురించి తాజాగా చెబుతూ సంచలనం కామెంట్స్ చేసింది.

మితిమీరుతున్న ఎక్స్‌పోజింగ్..
బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లు హద్దులు మీరుతున్నారని, పొట్టి పొట్టి బట్టలేసుకుని మరీ రెచ్చిపోతున్నారని అందరికీ తెలిసిందే. ఈ విషయంపై సోషల్ మీడియాలో నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇక రీసెంట్‌గా హారిక వేసుకున్న ఆ స్కర్ట్.. వేసిన స్టెప్పులపై సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ట్రోల్ అయిందో అందరికీ తెలిసిందే.

అలా అడిగారు..
తాజాగా శ్రీరెడ్డి బిగ్ బాస్ షో, అందులోని ఎక్స్ పోజింగ్‌పై మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. బిగ్ బాస్ సెకండ్ సీజన్‌లో నన్ను తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్లు అడిగిన ప్రశ్నల్లో ఒకటి.. ఎక్స్‌పోజింగ్ డ్రెస్‌లు వేసుకుంటారా? అంటే.. బిగ్ బాస్‌కు పెళ్లాం, పిల్లలు లేరా, లేకపోతే పిల్లల గురించి బిగ్ బాస్ ఆలోచించడా? నాకైతే అర్థం కావడంలేదు. అంటూ శ్రీరెడ్డి నాటి విషయాలను గుర్తుకు చేసింది.

ఆంటీలతో కూడా...
బాలీవుడ్‌లో వాళ్లతో బట్టలు ఎలా వేయిస్తున్నారు? ఆఖరికి కోలీవుడ్‌లో పెద్ద పెద్ద ఆంటీలతో కూడా షార్ట్స్, త్రీఫోర్త్‌లు, టైటు బట్టలు.. అసహ్యంగా చూడటానికే వికారంగా ఉంటోంది. వాళ్లకున్న మంచి పేరును కూడా చెడగొట్టేసింది బిగ్ బాస్. మంచి పేరు ఏమో కానీ కంటెస్టెంట్లకు చెడ్డపేరు అయితే చాలా బాగా తీసుకొస్తుంది బిగ్ బాస్ షో అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయింది.
Recommended Video

అది కుదరదు..
మేం సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేస్తున్నామంటే ఒక అర్థముంది. ఒక ఫొటో షూట్ చేస్తున్నామంటే అర్థముంది. పిల్లల్ని ఇంటర్నెట్‌కైనా కాస్త దూరంగా ఉంచడం జరుగుతుంది.. కానీ, టీవీకి దూరంగా ఉంచడం కుదరదు. దయచేసి బిగ్ బాస్‌లో ఎక్స్‌పోజింగ్‌లు తగ్గించండి అంటూ శ్రీరెడ్డి కోరింది.


Click it and Unblock the Notifications











