బిగ్‌బాస్ సీజన్ 5లో శ్రీరెడ్డి.. కంటెస్టెంట్లకు భారీగా ఆఫర్లు.. శరవేగంగా ఏర్పాట్లు..
కరోనావైరస్ కారణంగా పలు భాషల్లో బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ 4 ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ.. భారీ రేటింగ్‌ను క్రేజ్‌ను మూటగట్టుకొన్నది. తెలుగు, తమిళ భాషల్లో కనీవినీ ఎరుగని ప్రేక్షకదారణతో బిగ్‌బాస్ ముగిసింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో బిగ్‌బాస్ సీజన్ 5ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన న్యూస్ మీడియా హల్‌చల్ చేస్తున్నది. అదేమిటంటే..

తెలుగు, తమిళంలో బిగ్‌బాస్ 5
బిగ్‌బాస్ తెలుగు, తమిళ 5కి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అయితే పలువురు సెలబ్రిటీ జాబితా అంటూ ఓ లిస్టు వైరల్ అవుతున్నది.

వైరల్ అవుతున్న సెలబ్రిటీల పేర్లు
తాజా సమాచారం ప్రకారం.. తమిళ బిగ్‌బాస్ సీజన్ 5లో కూకూ విత్ కోమలి కంటెస్టెంట్ దర్శ గుప్తా, పవిత్ర లక్షమీ, శివానీ, అశ్విన్, యాక్టర్ అజీమ్‌ల పేర్లు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది.

రాయ్ లక్ష్మీ లాంటి టాప్ హీరోయిన్లతో చర్చలు
రానున్న బిగ్‌బాస్ 5లో మోస్ట్ కాంట్రవర్సీ సెలబ్రిటీలు, హీరోయిన్లపై నిర్వాహకులు గురిపెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే చర్చలు జరుపుతున్న వారిలో హీరోయిన్ రాయ్ లక్ష్మీ, పూనమ్ బజ్వా, శ్రీరెడ్డి, కిరణ్, రాధారవి, పాండ్యన్ స్టోర్స్ ఫేమ్ హేమ లాంటి వారు ఉన్నట్టు సమాచారం. అయితే కంటెస్టెంట్లకు భారీగా ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తున్నది.

శ్రీ రెడ్డికి భారీ ఆఫర్?
ఇక తెలుగు సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమంతో సంచలనం రేపిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా తమిళ భాషను నేర్చుకొంటూ పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. బిగ్‌బాస్ చేరితే భారీగా ఆఫర్ ఇవ్వనున్నట్టు నిర్వాహకుల తెలిపినట్టు సమాచారం.

హోస్ట్‌గా కమల్ స్థానంలో స్టార్ హీరో
ఇక కమల్ హాసన్ రానున్న రోజుల్లో రాజకీయాల్లో బిజీగా మారుతున్న నేపథ్యంలో హెస్ట్‌గా కమల్ స్థానంలో మరొకరిని పెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. తమిళనాడు ఎన్నికలు వస్తుండటంతో కమల్ తప్పుకోవాలని అనుకొంటున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











