దీప్తి సునైనాపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆ వ్యక్తితో క్లోజ్‌గా లేవా? అది తప్పుకాదా? అని కామెంట్

ఎక్కడ విన్నా ఇప్పుడు యూట్యూబ్‌ స్టార్స్‌ షణ్ముఖ్‌-దీప్తి సునైనాల బ్రేకప్‌ విషయం గురించే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం మీద నెట్టింట అనేక చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా వీరి బ్రేకప్ వ్యవహారం మీద శ్రీ రెడ్డి స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..

 నెంబర్ బ్లాక్ చేసి

నెంబర్ బ్లాక్ చేసి

బిగ్ బాస్ షో కారణంగానే వీళ్లు విడిపోయారని కొందరు భావిస్తున్నారు. బిగ్ బాస్ షోలో సిరి-షణ్ముఖ్ ల మధ్య జరిగిన వ్యవహారం ముద్దులు-హగ్గులు నచ్చకే ఆమె బ్రేకప్ చెప్పిందని భావిస్తున్నారు. కనీసం దీప్తి షణ్ముఖ్ చెప్పేది కూడా వినకుండానే అతని నెంబర్ బ్లాక్ చేసిందని, ఐదేళ్లుగా కలిసి ఉన్న అతని మాట కూడా వినకుండా ఏకపక్షంగా బ్రేకప్ చెప్పిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నన్ను కూడా కలచివేసింది

నన్ను కూడా కలచివేసింది

తాజాగా వీరి బ్రేకప్‌ అంశం మీద వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. ఆమె మాట్లాడుతూ బిగ్‌ బాస్‌ షోలో సిరితో షణ్ముఖ్‌ క్లోజ్‌గా ఉండడం వల్లే బ్రేకప్‌ చెబితే.. మరి అదే షోలో నువ్వు కూడా ఒక పర్సన్‌(తనీష్)తో క్లోజ్‌గా ఉన్నావు, నీ వరకు వచ్చేసరికి అది తప్పు కాదా? అని దీప్తిని ప్రశ్నించింది శ్రీరెడ్డి. 'షణ్ముఖ్‌-దీప్తిలది చూడచక్కని జంట. అలాంటి వారు బ్రేకప్‌ చెప్పుకోడం అందిరితో పాటు నన్ను కూడా కలచివేసిందని ఆమె పేర్కొంది.

సెన్సిటివ్‌ అయిపోతున్నారు

సెన్సిటివ్‌ అయిపోతున్నారు

ఇక మనం ఎన్ని చేసినా భారతీయులమని మరిచిపోవద్దన్న ఆమె జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోకూడదని ఆమె చెప్పుకొచ్చింది. టెక్నాలజీ పరంగా మీరు డెవలప్‌ అవ్వండి. కానీ కొన్ని విషయాల్లో చాలా సెన్సిటివ్‌ అయిపోతున్నారు, తట్టుకునే గుణం ఈ కాలం పిల్లలకు చాలా తక్కువగా ఉందని శ్రీ రెడ్డి పేర్కొంది.

 ఒక పర్సన్‌తో ఎంత క్లోజ్‌గా

ఒక పర్సన్‌తో ఎంత క్లోజ్‌గా


మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం అని పేర్కొన్న ఆమె ''దీప్తి షణ్ముఖ్‌తో ఐదేళ్లు రిలేషన్‌ షిప్‌ లో ఉన్నావు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశామని నువ్వే చెప్పావు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ లో జరిగినదానికి షణ్ముఖ్‌ కి బ్రేకప్ చెప్పావని క్లియర్‌గా అర్ధం అవుతుంది, మరి నువ్వు బిగ్ బాస్‌ కి వెళ్లినప్పుడు ఒక పర్సన్‌తో ఎంత క్లోజ్‌గా ఉన్నావో.. మీ రిలేషన్ షిప్ ఏంటో అందరం చూశాం'' అని శ్రీ రెడ్డి పేర్కొంది.

అనుమానం వచ్చేట్టు

అనుమానం వచ్చేట్టు

''మీ ఇద్దరి మధ్య లవ్ ఏమో అని జనానికి అనుమానం వచ్చేట్టుగా ప్రవర్తించావు. నీ వరకు వచ్చేసరికి అది తప్పుగా అనిపించలేదా? అని ప్రశ్నించింది. షణ్ముఖ్‌ తో పెళ్లి కాలేదు కాబట్టి.. బ్రేకప్ చెప్పింది, అదే పెళ్లై ఉంటే షణ్ముఖ్‌ ని ఆలా వదిలేసేదా? అని శ్రీ రెడ్డి ప్రశ్నించింది. మనిషి అన్నాక తప్పులు చేస్తుంటారని, ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడు ఒకరి తప్పులను మరొకరు క్షమించుకోవాలని పేర్కొంది.

పెళ్లైన తర్వాత వంద వేషాలు

పెళ్లైన తర్వాత వంద వేషాలు

ఓపికతో ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పుకొచ్చిన శ్రీరెడ్డి టాటూల గురించి కూడా ప్రస్తావించింది. 'పెళ్లికి ముందు టాటూలు వేయించుకున్న చాలా మంది విడిపోయారని చెప్పుకొచ్చిన ఆమె పెళ్లైన తర్వాత వంద వేషాలు వేయండి మీపై మీకు నమ్మకం లేకపోతే టాటూలు చేయించుకోండి అని ఆమె చెప్పుకొచ్చింది. దీప్తి సునయన కూడా టాటూలు వేయించుకుంది.. ఇప్పుడు అది రిమూవ్ చేయించుకోవాలని అనుకుంటుందని చెప్పుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X