For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Winner: షో చరిత్రలోనే చెత్త నిర్ణయం.. బిగ్ బాస్ పెద్ద పొరపాటు.. రేవంత్‌, శ్రీహాన్‌కు షాక్

  |

  ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. అంతలా ఇది ఐదేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. దీంతో ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఎంతో రంజుగా సాగుతూ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో విజేత ఎవరో తేలిపోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బిగ్ బాస్ పెద్ద మిస్టేక్ చేశాడు. దీంతో టైటిల్ రేసులో ముందున్న రేవంత్, శ్రీహాన్‌లకు బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే...

   ఫినాలేకు ఏకంగా ఆరుగురు

  ఫినాలేకు ఏకంగా ఆరుగురు

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి రికార్డులు క్రియేట్ చేస్తూ 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే 14వ వారంలో ఇనాయా సుల్తానా ఎలిమినేట్ అయిపోయింది. ఫలితంగా షో చరిత్రలోనే తొలిసారి ఆరుగురు సభ్యులు ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్‌లు ఉన్నారు.

  డెలివరీ తర్వాత తెగించిన హీరోయిన్: ఎద అందాలు హైలైట్ చేస్తూ ఘోరంగా!

  మిడ్ వీక్ ఎలిమినేషన్‌తోనే

  మిడ్ వీక్ ఎలిమినేషన్‌తోనే


  గత సీజన్ల కంటే ఆరో దానికి ఆశించిన రీతిలో స్పందన రాలేదు. దీంతో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేసి ఆసక్తికరంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫినాలేకు ఏకంగా ఆరుగురిని పంపించారు. అయితే, ఇందులో ఒకరిని మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తామని చెప్పారు. ఫలితంగా ఫినాలేకు ఐదుగురు సభ్యులను మాత్రమే పంపిస్తామని వెల్లడించారు.

  ఉదయాన్నే లేపి టాస్కుతో

  ఉదయాన్నే లేపి టాస్కుతో


  ఫినాలే వీక్‌లో ముందుగా కంటెస్టెంట్ల జర్నీ వీడియోలను చూపించారు. ఆ తర్వాత ఓట్స్ అప్పీల్ చేసుకోడానికి కొన్ని టాస్కులను ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్లను ఉదయాన్నే నిద్ర లేపిన బిగ్ బాస్.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని, మీ ఆరుగురిలో టాప్ 5లో ఉండడానికి ఎవరు అనర్హులో చెప్పి, కారణాలు వివరించాలని టాస్క్ ఇచ్చాడు.

  హీరోయిన్ శ్రీయ అందాల ఊచకోత: బట్టలున్నా లేనట్లే యమ ఘోరంగా!

  కీర్తి భట్‌కే ఎక్కువగా ఓట్లు

  కీర్తి భట్‌కే ఎక్కువగా ఓట్లు


  బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో భాగంగా ఎగ్జిట్ అని ఉన్న ఒక ప్రదేశం దగ్గర తాము అనుకున్న కంటెస్టెంట్‌ను నిలబెట్టి కారణాలు చెప్పాల్సి ఉంటుంది. ఇందులో శ్రీహాన్.. రోహిత్‌కు ఓట్ వేశాడు. ఆ తర్వాత కీర్తి.. ఆది రెడ్డికి, శ్రీ సత్య.. కీర్తికి, రోహిత్.. శ్రీహాన్‌కు, రేవంత్.. కీర్తికి, ఆది రెడ్డి కీర్తికి ఓట్లు వేశారు. అంటే కంటెస్టెంట్ల దృష్టిలో కీర్తి భట్ టాప్ 5లో ఉండకూడదని ఓ అవగాహన వచ్చింది.

  ట్విస్ట్ ఇచ్చి.. ఆమెకు షాక్

  ట్విస్ట్ ఇచ్చి.. ఆమెకు షాక్


  ఈ టాస్కు ముగిసిన తర్వాత బిగ్ బాస్ 'ఈ హౌస్‌లోని మెజారిటీ కంటెస్టెంట్లు కీర్తి భట్‌ను బయటకు పంపేందుకు ఓట్లు వేశారు. కానీ, బయట ఉన్న ప్రేక్షకులు మాత్రం మీ నిర్ణయానికి విరుద్ధంగా ఓట్లు వేశారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే.. శ్రీ సత్య. మీరు మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చేయండి' అని చెప్పి ఆమెకు షాక్ ఇచ్చాడు.

  బీచ్‌లో రెచ్చిపోయిన దీపికా పిల్లి: టాప్ కిందకు జరిపి హీటు పెంచేలా!

  బుధవారం అని శుక్రవారం

  బుధవారం అని శుక్రవారం


  ఆరో సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్లను నిర్ణయించే చివరి (మిడ్ వీక్) ఎలిమినేషన్ ప్రక్రియ బుధవారం రాత్రి జరగబోతుందని హోస్ట్ అక్కినేని నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో ప్రకటించాడు. కానీ, శ్రీ సత్యను మాత్రం శుక్రవారం చివర్లో బయటకు పంపించారు. దీనిపై సర్వాత్రా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, ఆమె ఫ్యాన్స్ RIPBiggBoss అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

  శ్రీహాన్, రేవంత్‌కు బిగ్ షాక్

  శ్రీహాన్, రేవంత్‌కు బిగ్ షాక్


  ముందుగా చెప్పినట్లు శ్రీ సత్యను బుధవారమే ఎలిమినేట్ చేసుంటారు. కానీ, శుక్రవారం దాన్ని ప్రసారం చేశారు. అంతేకాదు, ఈ ఎపిసోడ్ ముగిసే వరకూ శ్రీ సత్యకు కూడా ఓట్ వేసే సదుపాయం కల్పించారు. తద్వారా ప్రేక్షకులను మోసం చేయడంతో పాటు ఆమె ఓట్లు శ్రీహాన్, రేవంత్‌కు పడకుండా ప్లాన్ చేసి షాకిచ్చారు. అందుకే ఇది షో చరిత్రలోనే చెత్త నిర్ణయం అని చెప్పొచ్చు.

  English summary
  Bigg Boss Telugu 6th Season Running Successfully. Sri Satya Eliminated From From The Show in 15th Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X