వాసంతి పాదాలు నాకిన అర్జున్ కల్యాణ్.. కుక్క అన్న సదా.. ఏడ్చేసిన శ్రీ సత్య!
బుల్లితెరపై వచ్చిన రియాలిటీ షోలలో ఎక్కుగా పాపులారిటీ సంపాందించుకుంది బిగ్ బాస్. ఈ షోలో పలువురి కంటెస్టెంట్స్ మధ్య ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు కొంతమందిని ఆకట్టుకుంటే మరికొంతమందికి చిరాకు తెప్పించాయి. ప్రతి సీజన్ లో ఏదో ఒక జంట కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఇటీవల ముగిసిన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో బ్యూటిఫుల్ శ్రీసత్య వెంట అర్జున్ కల్యాణ్ పడిన విషయం తెలిసిందే.
అసలు ఆమె కోసమే బిగ్ బాస్ కు వచ్చిన అర్జున్ కల్యాణ్ పెద్దగా ఎంటర్టైన్ చేయలేక తీవ్ర నెగెటివిటీని సంపాదించుకున్నాడు. ఇక బిగ్ బాస్ అనంతరం మరో గ్లామర్ బ్యూటీ వాసంతి కృష్ణన్ తో జతకట్టి బీబీ జోడీ డ్యాన్స్ షోలో పార్టిస్ పేట్ చేస్తూ అదరగొడుతున్నాడు.

పట్టించుకోకపోవడం..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో 21 మంది కంటెస్టెంట్స్ లో శ్రీసత్య, అర్జున్ కల్యాణ్ ఒకరు. సీజన్ ప్రారంభంలో సైలెంట్ గా ఉన్న శ్రీసత్య తర్వాత తనదైన ఆట తీరుతో కొంత ఆకట్టుకున్న తర్వాత విమర్శలపాలైంది. ఇక ఆమె వెంట పడిన అర్జున్ కల్యాణ్ పరిస్థితి కూడా అలాగే తయారైంది.
శ్రీ సత్య వెంట అర్జున్ ఎంతగా పడిన ఆమె పట్టించుకోకపోవడంతో అర్జున్ కు నెగెటివిటీ ఏర్పడింది. తర్వాత ఎలిమినేట్ అయిన అర్జున్ తాను బీబీకి వచ్చింది శ్రీ సత్య కోసమే అని చెప్పి షాక్ ఇచ్చాడు.

వేరు వేరు పార్ట్ నర్స్ తో..
శ్రీసత్య వెంట పడటం తప్పా బిగ్ బాస్ హౌజ్ లో పెద్దగా ఆట తీరు చూపించని అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. అనంతరం కొద్దిరోజులు మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద శ్రీసత్య కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు వీళ్లిద్దరు బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. అయితే ఇరువురు వేరే వేరే పార్టనర్స్ తో జత కట్టి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ అలరిస్తున్నారు.

అర్జున్-వాసంతి జోడీ..
బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, మెహబూబ్-శ్రీ సత్య, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, ఆర్జే చైతూ-ఆర్జే కాజల్, కౌశల్-అభినయ శ్రీ, కమెడియన్ అవినాష్-యాంకర్ అరియానా గ్లోరి ఇలా మొత్తంగా 8 జోడీలు పాల్గొంటున్నాయి. ఈ షోకి బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించగా.. అలనాటి స్టార్ హీరోయిన్ రాధ, గ్లామరస్ బ్యూటి సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు.

ఎమోషనల్ పర్ఫామెన్స్..
ఈ బీబీ జోడీ షోలో అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్ ఇస్తున్న పర్ఫామెన్సెస్ పీక్స్ గా ఉంటున్నాయి. ఒక్కటి కాదు.. ప్రతిసారి చూసేకొద్ది అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్సులతో ఇరగదీస్తున్నారు. బీబీ జోడీ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో కనెక్షన్ రౌండ్ లో భాగంగా డ్యాన్స్ లతో ఆకట్టుకున్నాయి జోడీలు. వారిలో అర్జున్ కల్యాణ్-వాసంతి బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ పర్ఫామెన్స్ ఇచ్చి అదరగొట్టారు.

రాధ ప్రశంసలు..
ఆశా పాశం అనే పాటకు వాసంతి మనిషిగా, క్యాన్సర్ పేషంట్ గా చేయగా.. అర్జున్ కల్యాణ్ కుక్కల నటించి మెస్మరైజ్ చేశాడు. వీళ్ల ఎమోషనల్ డ్యాన్స్ పర్ఫామెన్స్ కు జడ్జస్ ఫిదా అయ్యారు. "ఈ పర్ఫామెన్స్ లో నేను నమ్మాను నిజంగా మీరు కుక్క అని" అర్జున్ ని సదా ప్రశంసించింది. ఒక కుక్క మనపై ప్రేమను చూపించడానికి ఏమేం చేస్తుందో అవన్నీ చేసి చూపించావురా అంటూ పొగిడింది బ్యూటిఫుల్ హీరోయిన్ రాధ.

ఇలాంటి సాంగ్ చూడలేదు..
ఈ పాటలో వాసంతి కృష్ణన్ చనిపోయినట్లుగా చూపించిన తర్వాత కుక్కల నటిస్తున్న అర్జున్ కల్యామ్ ఆమె పాదాలను నాకాడు. అది చూసిన శ్రీసత్య తెగ ఏడ్చేసింది. తను మాత్రమే కాకుండా జడ్జస్ కూడా ఫుల్ ఎమోషనల్ అయి కంటతడి పెట్టారు. నా లైఫ్ లో ఎన్నో సాంగ్స్ కి జడ్జ్ గా కూర్చున్నాను. కానీ ఇటువంటి సాంగ్ నేను చూడలేదు అని కాంప్లిమెంట్ ఇచ్చారు తరుణ్ మాస్టర్. ఇలా బిగ్ బాస్ లో ప్రూవ్ చేసుకోలేని అర్జున్ కల్యాణ్ బీబీ జోడీతో తానేంటో నిరూపించుకున్నాడు.


Click it and Unblock the Notifications











