షాకింగ్.. శ్రీ సత్యకు మెహబూబ్ తో పెళ్లి.. ఏడ్చేసిన అర్జున్ కల్యాణ్.. ఎమోషనల్ గా వీడియో!

బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల తరహాలో ఎంటర్టైన్ మెంట్ దొరికే బిగ్ బాస్ షోకి అభిమానులు ఎక్కువే. ఈ షోలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఎలా ఉంటాయో లవ్ అండ్ రొమాన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని టాక్.

ఇక ఇటీవల అట్టర్ ఫ్లాప్ సీజన్ గా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగు 6లో శ్రీ సత్య వెంట అర్జున్ కల్యాణ్ వెంట పడిన విషయం తెలిసిందే. అసలు ఆమె కోసమే బిగ్ బాస్ కు వచ్చినట్లు కూడా అర్జున్ కల్యాణ్ ఎలిమినేట్ అయినప్పుడు చెప్పాడు. అయితే ఇప్పుడు షాకింగ్ గా మెహబూబ్ తో శ్రీ సత్య పెళ్లి చేయనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Pic Credits: Star Maa YouTube

ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే..

ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే..

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి 21 మంది కంటెస్టెంట్స్ లో శ్రీసత్య, అర్జున్ కల్యాణ్ ఒకరు. సీజన్ ప్రారంభంలో సైలెంట్ గా ఉన్న శ్రీసత్య తర్వాత తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆమె వెంట అర్జున్ కల్యాణ్ తెగ వెంటపడుతూ ఉండేవాడు. అదంతా పట్టించుకోకుండా శ్రీ సత్య తన గేమ్ ఆడేది. ఇక హౌజ్ లో టాస్క్ లో భాగంగా శ్రీ సత్య ఎవరితోనైనా క్లోజ్ గా ఉంటే అర్జున్ కల్యాణ్ కొంచెం తట్టుకోలేకపోయేవాడు.

వాసంతి కృష్ణన్ తో అర్జున్..

వాసంతి కృష్ణన్ తో అర్జున్..

హౌజ్ లో ఒకసారి శ్రీహాన్ తో శ్రీ సత్య డ్యాన్స్ చేస్తున్నప్పుడు పైకి నార్మల్ గా ఉన్నట్లు ప్రయత్నించినా లోపల తను ఎంత జలసీ ఫీలయ్యాడో అర్జున్ కల్యాణ్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే తెలుస్తోంది. ఇక అతను ఎలిమినేట్ అయినరోజు తను కేవలం శ్రీ సత్య బిగ్ బాస్ కు వస్తుందని తెలిసే ఆడిషన్ కు వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు అర్జున్ కల్యాణ్. ఇక అర్జున్ కల్యాణ్ బయటకు వచ్చాక బీబీ జోడీ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో వాసంతి కృష్ణన్ తో జత కట్టాడు.

మొదట్లో మెహబూబ్ కి..

మొదట్లో మెహబూబ్ కి..

అటువైపు శ్రీ సత్య కూడా బిగ్ బాస్ తెలుగు 6లో మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద ఎలిమినేట్ అయ్యాక మెహబూబ్ తో జోడీ కట్టింది. బిగ్ బాస్ అన్ని సీజన్ల కంటెస్టెంట్లను జోడీలుగా మార్చి బీబీ జోడీ అనే పేరుతో డ్యాన్స్ రియాలిటీ షో నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో మొదట్లో మెహబూబ్ కి బోల్డ్ బ్యూటి అషు రెడ్డి జోడిగా ఉండేది. అయితే పలు కారణాల వల్ల అషు రెడ్డి తప్పుకోవడంతో.. ఆ అవకాశం శ్రీసత్యకు లభించింది. దీంతో మెహబూబ్-శ్రీసత్య ఒక జోడీగా డ్యాన్స్ తో అలరిస్తున్నారు.

జోడీలుగా కంటెస్టెంట్స్..

జోడీలుగా కంటెస్టెంట్స్..

బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, మెహబూబ్-శ్రీ సత్యతోపాటుగా అరియానా గ్లోరి-అవినాష్, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-ఇనయా సుల్తానా, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్ ఉన్నారు. ఈ షోకి బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి హోస్ట్ చేస్తుండగా.. అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు.

సినిమా సినిమా రౌండ్ లో..

సినిమా సినిమా రౌండ్ లో..

బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ ఎపిసోడ్స్ పై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు షో నిర్వాహకులు. అందులో భాగంగానే తాజాగా తర్వాత వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో 'సినిమా సినిమా' రౌండ్ లో భాగంగా జోడీలంతా తమ డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు.

షాక్ లో శ్రీ సత్య-మెహబూబ్..

షాక్ లో శ్రీ సత్య-మెహబూబ్..

బీబీ జోడీ తాజా ప్రోమోలో.. ఈరోజు మెహబూబ్-శ్రీ సత్యకు పెళ్లి చేయబోతున్నామని అవినాష్ ప్రకటించాడు. దీంతో యాంకర్ శ్రీముఖితోపాటు శ్రీ సత్య, మెహబూబ్, రాధ షాక్ అయ్యారు. "మీరేదో ప్లాన్ తో వచ్చారు. పెళ్లి చేయాలంటే.. పెళ్లి పెద్దలు ఉండాలి. పంతులు ఉండాలి" అని శ్రీముఖి అంటే.. "తండ్రిగా మగపెళ్లి వారి తరఫున తరుణ్ మాస్టర్, ఆడపెళ్లి వారి తరఫున రాధమ్మ.. అదిగో సదా గారు నా తరఫున.. కాదు మా అందరి తరఫున" అని కమెడియన్ అవినాష్ పంతులు వాయిస్ తో తెలిపాడు.

ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న అర్జున్..

అనంతరం వాసంతిృ-అర్జున్ బ్యూటిఫుల్ అండ్ ఫీల్ గుడ్ లవ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు. వాళ్ల డ్యాన్సుకు జడ్జెస్ అందరూ మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అర్జున్ కల్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ట్రూ లవ్ అంటే ఇలా ఉంటుందని సదా అన్నారు. తర్వాత శ్రీ సత్య వచ్చి అర్జున్ కల్యాణ్ హగ్ చేసుకుంది. అయితే జడ్జెస్ అప్రిషియేషన్స్ ఇచ్చే సమయంలో వెనుకాల స్క్రీన్ పై దివంగత పునీత్ రాజ్ కుమార్ ఫొటో ఉంది. ఆయనకు నివాళిగా ఈ సాంగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ ప్రోమో ఎమోషనల్ గా సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X