For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెలబ్రిటీల మధ్యలో ముద్దుల పోటీ పెట్టిన రష్మి, హైపర్ ఆది.. ఫైనల్ గా రష్మి కాబోయే భర్తపై క్లారిటీ!

  |

  ఇటీవల కాలంలో టెలివిజన్ షోలలో కూడా రొమాన్స్ డోస్ ఎక్కువవుతోందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కామెడీతో పాటు కొంతమంది సెలబ్రెటీలు రియాలిటీ షోలలో ఊహించని విధంగా వారి కెమిస్ట్రీతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. కొన్నిసార్లు వాటిపై పాజిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే మరి కొన్నిసార్లు ఊహించిన విధంగా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అలాంటి సన్నివేశాలు ఈ మధ్య ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ఇక వారిపై హైపర్ ఆది వేసిన పంచ్ లు కూడా మరింత ట్రెండ్ అవుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోలో హైలైట్ అయిన కొన్ని సన్నివేశాల వివరాల్లోకి వెళితే..

  హనీమూన్ కాంటెస్ట్..

  హనీమూన్ కాంటెస్ట్..

  కొంతమంది రియల్ కపుల్ సెలబ్రిటీలను కంటెస్టెంట్స్ గా తీసుకువచ్చిన నిర్వాహకులు వారితో డ్యాన్సులు పాటలు అలాగే కామెడీ స్కిట్స్ చేయిస్తూ మంచి టిఆర్పిని అందుకుంటున్నారు. ఇక ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో వింటర్ స్పెషల్ గా కపుల్స్ హనీమూన్ కాంటెస్ట్ అంటూ మరొక ఎపిసోడ్ ను మొదలుపెట్టారు. కపుల్స్ గా ఉన్న సెలెబ్రిటీలు అందరూ కూడా వారి కెమిస్ట్రీ ని హైలెట్ చేస్తూ అప్పుడప్పుడు రొమాంటిక్ టచ్ కూడా ఇస్తున్నారు.

   అమ్మా రాజశేఖర్ రొమాంటిక్ పంచ్

  అమ్మా రాజశేఖర్ రొమాంటిక్ పంచ్

  ఇక కపుల్స్ పై హైపర్ ఆది వేసే కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ముందుగా అమ్మా రాజశేఖర్ జోడిని ప్రశ్నించిన హైపర్ ఆది హనీమూన్ ని ఎలా ప్లాన్ చేశారు అని అడిగాడు. అందుకు అమ్మ రాజశేఖర్ నా వైఫ్ కు 106 నాకు 107 రూమ్ అని సమాధానం ఇచ్చాడు. హనీమూన్ అంటే ఇద్దరు కలిసి ఉండాలి కదా అని హైపర్ ఆది అడిగాడు. అంతే కాకుండా మీరు ఒక్కరే ఉంటారా 106 రూమ్లో అని అడిగాడు. దీంతో రాజశేఖర్ నేను ఒక్కడినే ఉంటాను అని ఎవరు చెప్పారు అని కౌంటర్ ఇచ్చాడు.

  మలయాళం అమ్మాయిలా నరేష్ గెటప్

  మలయాళం అమ్మాయిలా నరేష్ గెటప్

  ఇక జబర్దస్త్ పొట్టి నరేష్ అయితే ఈసారి కేరళ అమ్మాయిల తరహాలో ఊహించిన విధంగా కనిపించి కామెడీ చేశాడు. ఇక పంచ ప్రసాద్ హనీమూన్ గురించి అడిగాడు. ఇక అతన్ని మీ హనీమూన్ ఏ వార్డులో జరిగిందని కూడా హైపర్ ఆది కామెంట్ చేసిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి డాన్స్ మూమెంట్స్ తో ఎంతగానో హైలైట్ అయ్యే విధంగా జడ్జిలను అట్రాక్ట్ చేశారు.

  రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరప్పా..

  రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరప్పా..

  ఇక రియల్ కపుల్స్ రొమాన్స్ చేస్తూ ఉండడంతో జడ్జ్ గా ఉన్న ఇంద్రజ రియల్ కపుల్ రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరప్పా.. అంటూ కామెంట్ చేసింది. ఇక రాజశేఖర్ మాస్టర్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో కి రావడంతో ఇంద్రజ ఆల్ ఆయనకు వెల్కమ్ చెప్పారు ఇక అంతేకాకుండా వింటర్ స్పెషల్ స్కిట్స్ తో పాటు సెలబ్రెటీలు వారి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

  రగిలిపోతున్నా అంటూ ఆది కామెంట్

  రగిలిపోతున్నా అంటూ ఆది కామెంట్

  ఇక హైపర్ ఆది లేడీ కమెడియన్ తో చేసిన స్కిట్ కూడా హైలెట్గా నిలిచింది. ఇక ఈ చలిలో నాకు పెదాలు పగిలిపోతున్నాయి చేతులు పగిలిపోతున్నాయి అంటూ సమాధానం ఇవ్వడంతో నువ్వు పగిలిపోవడం గురించి ఆలోచిస్తున్నావు.. కానీ నేను రగిలిపోవడం గురించి నువ్వు ఆలోచించడం లేదు అంటూ హైపర్ ఆది పెద్ద మాట అనేసాడు. దీంతో అందరూ కూడా మళ్లీ నవ్వేశారు. ఇక సింగర్ గణేష్ కూడా తన గాత్రంతో ఎంతగానో మెప్పించాడు.

   కపుల్స్ మధ్యలో రొమాన్స్ పోటీ

  కపుల్స్ మధ్యలో రొమాన్స్ పోటీ

  ఇక కపుల్స్ మధ్యలో యాంకర్ రష్మి అలాగే హైపర్ ఆది ఇద్దరు కూడా ఒక పేపర్ వేసి పెదాలతో ఆ పేపర్ను పట్టుకోమని పోటీ పెట్టారు. ఇక సెలబ్రిటీ జంటలు గేమ్ ఆడుతూ ఉంటే మధ్యలో పేపర్ ఆగినా నువ్వు ఆగేలా లేవు అంటే హైపర్ ఆది పంచ్ వేసాడు. ఈ క్రమంలో ఒకరినొకరు ముద్దులు కూడా పెట్టుకున్నారు. ఇక అమ్మారాశేఖర్ కూడా అదే తరహాలో కనిపించారు.

   రష్మి పెళ్లి సంగతి

  రష్మి పెళ్లి సంగతి

  ఇక రష్మీ పెళ్లి సంగతి కూడా మరోసారి వైరల్ గా మారింది. రష్మీ పెళ్లికి సంబంధించిన ఒక ఫోటోను స్క్రీన్ ముందు చూపించారు. ఇక అందులో పక్కనే పెళ్లి కొడుకు తరహాలో ఒక వ్యక్తి మొహం కనిపించకుండా చుట్టూ పూలు పెట్టుకున్నాడు. ఇక ప్లేస్లో మీ పక్కన ఎవరిని ఎప్పుడు తీసుకువస్తున్నారు అని అడగ్గానే.. అందుకు రష్మీ ఎవరు ఎప్పుడు వస్తున్నారు అంటే? అని సస్పెన్స్ క్రియేట్ చేసింది. మరి ఈసారైన రష్మీ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

  English summary
  Sridevi drama company anchor Rashmi Gautam about feature husband
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X