నీ ముఖానికి 500 విలువ లేదు.. ఐ ఫోన్ కావాలా? నోరుపారేసుకొన్న కమెడియన్ నరేష్

Photo Courtesy: ETV Telugu

ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. వారం వారం డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వినోదాన్ని పంచుతోంది. ఈ షోలో వచ్చే స్పూఫ్స్ కూడా కామెడీని పంచుతాయి. ఏదో ఒక కరెంట్ టాపిక్ లేదంటే.. సినిమాలపై కంటెస్టెంట్స్‌ చేసే అల్లరి నవ్వులు పూయిస్తుంది. మధ్యలో హైపర్ ఆది వంటి వారు ఎంట్రీ ఇచ్చి దీనిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఈ షోకి గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా పొట్టి నరేష్, పంచ్ ప్రసాద్ అతని టీమ్ చేసిన బిచ్చగాడు స్పూఫ్ నవ్వులు పూయించింది. ఈ వివరాల్లోకి వెళితే..

తొలుత పొట్టి నరేష్ పెద్ద బిజినెస్‌మెన్‌లా ఎంట్రీ ఇస్తాడు. అతనికి అసిస్టెంట్‌గా పంచ్ ప్రసాద్ నవ్విస్తారు. ఫోన్ల మీద ఫోన్లు రావడంతో అన్నింటినీ మాట్లాడి కిందపడేస్తాడు నరేష్. ఇంతలోనే మూడు కోట్ల రూపాయలకు ఓటీపీ రావడంతో ఏ ఫోన్‌లో ఉందో అర్ధం కావడం లేదని అన్ని ఫోన్లు వెతుకుతాడు. ఆ తర్వాత సీరియల్ బ్యూటీస్‌కి లైన్ వేస్తాడు. ఒక ముద్దు ఇవ్వవా అంటూ సీరియల్ నటి శిరీష దగ్గరికి వెళ్లగా.. ఈ జన్మలోనే కాదు నీకు ఏ జన్మలోనూ ఎవరూ ముద్దుపెట్టరని శాపం పెడుతుంది ఓ నటి. నా జీవితం మారాలంటే నేను ఒక స్వామిజీని కలవాలని చెబుతాడు నరేష్.

Sridevi Drama Company Bichagadu Spoof With Vijay Antony Leaves Audience in Splits

Photo Courtesy: ETV Telugu

స్వామిజీ వేషంలో రాంప్రసాద్ వచ్చి ఏం కావాలని అడుగుతాడు. నాకు అమ్మాయి ముద్దు పెట్టనని చెప్పిందని అంటాడు నరేష్. ఒక అమ్మాయి ముద్దు కావాలంటే చాలా యాగాలు చేయాలి, 30 రోజులు నీ డబ్బంతా వదిలేసి బిచ్చగాడిగా యాక్ట్ చేయాలి అప్పుడే ఆ అమ్మాయి నీకు ముద్దు పెడుతుందని అంటాడు. దాంతో బిచ్చగాడిగా మారిపోవాలని చెప్పి బట్టలన్నీ విప్పేసి అందరి దగ్గరికి వెళ్లి అడుక్కుంటాడు. నాన్నగారు క్వార్టర్‌లోకి వాటర్ అయిపోయింది ఓ 10 రూపాయలు ఇవ్వమన్నాడని పంచ్ ప్రసాద్ చెబుతాడు. పంజాగుట్ట సిగ్నల్ దగ్గరికి వెళ్తున్నా.. అరగంటలో కవర్ చేసి చెబుతానని చెప్పమని అంటాడు పొట్టి నరేష్.

పొట్టి నరేష్ అడుక్కుంటూ ఉండగా.. ఓ కుర్రాడు, ఓ అమ్మాయి వెంట పడుతూ ఐ లవ్ యూ అని చెబుతాడు. నీ దగ్గర ఐ ఫోన్ అయినా ఉందా అని అబ్బాయిని అమ్మాయి అడుగుతుంది. ఐ ఫోన్ లేదు .. కానీ ఐ లవ్ యూ అంటాడు కుర్రాడు. ఇదంతా చూసి ఏమైంది అని అడుగుతాడు నరేష్. ఐ ఫోన్ ఇస్తేనే లవ్ చేస్తానని అంటోందని జరిగినదంతా చెబుతాడు. ఆ వెంటనే బొచ్చె విసిరేసి.. అమ్మాయిని కింద నుంచి పైకి చూసిన నరేష్.. డ్రెస్ చూస్తే 230 రూపాయలు, కమ్మలు చూస్తే 10 రూపాయలు, స్టిక్కర్ 5 రూపాయలు, హెయిర్ క్లిప్ 10 రూపాయలు, నెక్లెస్ 15 రూపాయలు, కాళ్ల చెప్పులు 120 రూపాయలు దీని ముఖానికి ఐ ఫోన్ కావాలా? 500 రూపాయల సామానున లేదు దీన దగ్గర అని నరేష్ చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

తనకు న్యాయం చేయాలంటూ హీరో విజయ్ ఆంటోనీ దగ్గరకి వెళ్లి నాకు ఏ అమ్మాయి ముద్దు పెట్టడం లేదని చెబుతాడు. దాంతో హీరోయిన్లు ఇద్దరినీ ముద్దు పెట్టమని విజయ్ అంటాడు. దాంతో నరేష్‌కి ముద్దు పెడతారు హీరోయిన్లు. స్కిట్ చివరిలో మన ఆస్తి మొత్తం పోయిందని నరేష్‌కి చెబుతాడు పంచ్ ప్రసాద్. ఎందుకు? ఏం జరిగిందని నరేష్ అడగ్గా.. మీ నాన్నగారు తాగి తాగి పైకి పోయారు.. వెళ్తూ వెళ్తూ ఆస్తి మొత్తం ప్రొడక్షన్ మంగమ్మకి ఇచ్చాడని చెప్పడంతో అంతా నవ్వేస్తారు. అయితే ఇక నుంచి రియల్ బెగ్గర్‌ని అవుతానని నరేష్ చెబుతాడు. ప్రస్తుతం ఈ స్కిట్ నవ్వులు పూయిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X