హైపర్ ఆదితో పెళ్లికి రెడీ... ఆ కండీషన్‌తో నటి మ్యారేజ్ డీల్!

తన పంచ్‌లు, ప్రాసలతో జబర్దస్త్‌లో కడుపుబ్బా నవ్వించారు హైపర్ ఆది. కేవలం ఆయన కోసమే జబర్దస్త్ చూసేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కామెడీ టైమింగ్, ఫన్నీ స్కిట్స్‌తో జబర్దస్త్‌కు భారీ వ్యూస్‌ని, టీఆర్పీని తెచ్చిపెట్టారు ఆది. సినిమాలు, ఇతర ఛానెల్స్‌లో అవకాశాల కారణంగా జబర్దస్త్ నుంచి ఆది తప్పుకున్నప్పటికీ అప్పుడప్పుడు షోలో అలరిస్తున్నారు. వయసు పెరుగుతున్నా ఆది ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన వివాహంపై పలు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆది పెళ్లికి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో వారం వారం ప్రేక్షకులను అలరిస్తోంది. రష్మి గౌతమ్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో ప్రతివారం బుల్లితెర సెలబ్రిటీలు పాల్గొని ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా ఈ వారం కూడా స్పెషల్ థీమ్‌తో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. ఈ వారం సీరియల్స్ మహోత్సవం పేరుతో ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ టీమ్‌లతో ఆటాపాటా నిర్వహించారు.

Sridevi Drama Company Latest Promo Hyper Aadi s Fun Banter with TV Beauties Steals the Show

సంధ్యారాగం, వేయి శుభములు కలుగు నీకు, వసుంధర, మెరుపు కలలు, ఆరో ప్రాణం సీరియల్స్‌కు చెందిన హీరో హీరోయిన్లు, ఇతర కీలక పాత్రధారులు స్టేజ్‌పై సందడి చేశారు. దాంతో ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో సీరియల్స్ పురం మూడొందల పండుగ అనే థీమ్‌తో నడుస్తుందని యాంకర్ రష్మి అనౌన్స్ చేసింది. బుల్లితెర బ్యూటీలకు సైట్ కొడుతూ ఆది ఫన్ క్రియేట్ చేశాడు. తొలుత సింధూర నా పేరు అరుంధతి అని పరిచయం చేసుకోగా.. నా పేరు పశుపతి అని అంటాడు ఆది. మీరు ఆ అరుంధతి కాకపోయినా నేను మాత్రం ఆ పశుపతి అని చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

ఆ వెంటనే నా పేరు అవంతిక అని బుల్లితెర నటి చెప్పగా.. అవంతిక, ఆది.. అఆ అని అంటాడు. మెరుపు కలలులో సంయుక్త దగ్గరికెళ్లగా మీ కళ్లలో కక్కుర్తి కనిపిస్తోందని ఆమె పంచ్ విసరడంతో ఆది షాక్ అవుతాడు. ఆరో ప్రాణం అనే సీరియల్ నటీ దగ్గరికెళ్లగా.. హీరోని పెళ్లి చేసుకుని ఆస్తి కొట్టేయడానికే వస్తానని చెబుతుంది. వాడి కోసం అంత కొట్టుకోకపోతే ఇక్కడ నేనొకడిని చచ్చాను కదా అని ఆది అంటాడు. అయితే మీకు ఆస్తి ఎంత ఉందని చెబితే మనం డిసైడ్ అవుదామని నటి ప్రపోజల్ పెడుతుంది. దాంతో తన పొట్టని చూపిస్తూ ఇదంతా ఆస్తి కాదా అని సెటైర్లు వేస్తాడు ఆది.

అనంతరం పొట్టి నరేష్‌, ఫైమాలు ఫన్ జనరేట్ చేయగా.. ఆది వాళ్లపై పంచ్‌లు విసురుతాడు. ఇక బుల్లితెర నటీనటులు డ్యాన్స్‌తో అందరినీ అలరించారు. తర్వాత ఈ సీరియల్స్ నుంచి బెస్ట్ ఎంటర్‌టైనర్, బెస్ట్ నెగిటివ్ రోల్, బెస్ట్ సపోర్టింగ్ రోల్, హుక్ స్టెప్ ఛాలెంజ్‌ల పేరుతో ప్రేక్షకులతో ఓటింగ్ నిర్వహిస్తారు. చివరిలో ఓటింగ్ రిజల్ట్స్ ప్రకటిస్తూ యాంకర్ రష్మి అందరినీ సస్పెన్స్‌లో పెట్టింది. మరి ఈ ఓటింగ్‌లో ఏ సీరియల్ వాళ్లు గెలిచారు? ఎవరికీ ఎంత ఓటింగ్ వచ్చింది? పెళ్లి కోసం బుల్లితెర నటి పెట్టిన కండీషన్‌కు హైపర్ ఆది ఒప్పుకున్నాడో లేదో తెలియాలంటే మార్చి 31న ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X