అనుమానంతో భార్య అలాంటి నిఘా... ఇంద్రజ దెబ్బకు అమ్మ రాజశేఖర్ గప్‌చుప్
Photo Courtesy: ETV Telugu India
ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రేక్షకులను నవ్విస్తోంది. వారం వారం పలువురు సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీలు చేసే అల్లరితో సందడి నెలకొంటోంది. హోస్ట్‌గా రష్మి గౌతమ్.. జడ్జిగా ఇంద్రజలు ఈ షోను నడిపిస్తున్నారు. మధ్యలో హైపర్ ఆది పంచ్‌లతో శ్రీదేవి డ్రామా కంపెనీ అలరిస్తోంది. కొద్దిరోజుల క్రితం ప్రసారమైన ఎపిసోడ్‌లో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్‌తో వదిలిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
కొత్తగా పెళ్లయిన జంటలు, సీనియర్ జంటలు అంటూ స్పెషల్ కాన్సెప్ట్‌తో థీమ్‌ను రూపొందించారు. అందులో ఒక వ్యక్తి బట్టలు పిండుతూ ఉండగా ఆటో రాంప్రసాద్ వచ్చి ఒక మగాడివి అయ్యుండి బట్టలు ఉతుకుతున్నావా? తనను ఇంట్లో ఉంచుకుని నవ్వు ఉతకడం ఏంటీ అని మండిపడతాడు. తను అలిసిపోయిందని ఆ వ్యక్తి చెప్పగా.. ముందు వాళ్లు అలిసిపోయామని చెబుతారు, తర్వాత మనం అలుసైపోతామని అంటాడు రాంప్రసాద్. ఆ వెంటనే వద్దురా సోదరా? పెళ్లంటూ నూరేళ్ల మంటరా అంటూ సీనియర్స్ వచ్చి క్లాస్ పీకుతారు.

Photo Courtesy: ETV Telugu India
సీనియర్స్ బ్యాచ్‌లో రాకెట్ రాఘవ, నటుడు సాయి కిరణ్, డైరెక్టర్ అమ్మా రాజశేఖర్, సీరియల్ నటుడు సిద్ధూ, రాంప్రసాద్‌లు ఉంటారు. పెళ్లి చేసుకుని ఇంట్లో బట్టలు ఉతుకుతున్నాడని రాంప్రసాద్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇతనిని మగాళ్ల జాబితాలో నుంచి బ్యాన్ చేసేయండి అంటాడు సాయికిరణ్. దాంతో ఆ వ్యక్తి తన భార్యను కోపంగా పిలవగా.. ఆమె వచ్చి పిలుపులో తేడా కనిపిస్తోందని అంటుంది. ఆదివారం ఎవరికి సెలవు కావాలి అంటూ భార్యాభర్తలు గొడవ పడతారు.
తర్వాత జంటలను యాంకర్ రష్మి ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు లేనప్పుడు మీ మొబైల్ చెక్ చేసే భార్య అని ప్రశ్నిస్తుంది. రాఘవ గారు మీ మొబైల్‌లో ఏం సీక్రెట్స్ ఉన్నాయని అడగ్గా.. నాకు కూడా తెలియదని పంచ్ విసురుతాడు రాఘవ. అమ్మా రాజశేఖర్ మాట్లాడుతూ.. మ్యారేజ్ టైంలో ఫోన్ చెక్ చేసేదని చెప్పడంతో ఇంద్రజ జోక్యం చేసుకుంటూ మీకు పెళ్లయినప్పుడు మొబైల్స్ ఉన్నాయా అని పంచ్ వేస్తుంది. ఇప్పుడేం లేదంటూ ఆయన కవర్ చేస్తుండగా.. ఇప్పుడంతా చల్లారిపోయిందని రాజశేఖర్ భార్య అనడంతో అంతా నవ్వేస్తారు.
తర్వాత భార్యాలంతా తమ భర్తల గురక టార్చర్ గురించి చెప్పి నవ్విస్తారు. భార్యల నుంచి భర్తలను కాపాడతానంటూ లెజెండ్‌లో బాలయ్యలా పొట్టి నరేష్ పవర్‌ఫుల్ డైలాగ్స్ చెబుతూ అలరించాడు. తర్వాత నోటితో కొన్ని శబ్ధాలను చేయగా వాటిని గుర్తుపట్టే టాస్క్ ఇవ్వగా.. రకరకాల విన్యాసాలతో కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా రౌడీ రోహిణికి కడుపు నొప్పి అని చెప్పేందుకు అపసోపాలు పడటం, ఐస్ తినే శబ్ధం చేయడానికి రాంప్రసాద్ చేసిన విన్యాసాలతో అంతా పగలబడి నవ్వారు. ఇదే సమయంలో రాకాస మూవీ యూనిట్ నుంచి నిర్మాత నిహారిక కొణిదెల, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారికలు వచ్చి కంటెస్టెంట్స్‌పై సెటైర్లు వేశారు. చివరిలో సింగర్స్ తమ మధురమైన గాత్రంతో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications


