సినిమాలకు రష్మి గౌతమ్ గుడ్ బై? జబర్దస్త్ యాంకర్ రియాక్షన్ ఇదే..

రష్మి గౌతమ్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగునాట పాపులర్ కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా దూసుకెళ్తున్నాను. దాదాపు 13 ఏళ్లుగా ఈ షోకు యాంకర్‌గా కొనసాగుతున్నారు రష్మి. అనసూయ సహా పలువురు ఈ షోను వదిలేసినప్పటికీ రష్మి మాత్రం ఇప్పటికీ జబర్దస్త్‌ని అంటిపెట్టుకునే ఉన్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అందగత్తె అయినప్పటికీ రష్మి ఎందుకు సినిమాల్లో అంతగా కనిపించడం లేదనే కామెంట్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్‌గా వచ్చిన ఓ పెద్దాయన నువ్వు సినిమాలలో ఎందుకు కనిపించడం లేదు అని అడిగిన ప్రశ్నకు రష్మి సమాధానమిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

విశాఖపట్నానికి చెందిన రష్మి గౌతమ్ తొలుత సినీ రంగంలోనే అడుగుపెట్టారు. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోలీలో సునీల్‌కు గర్ల్ ఫ్రెండ్‌గా నటించారు. ఆ తర్వాత కరెంట్, ఎవరైనా ఎపుడైనా, గణేష్, బిందాస్, ప్రస్థానం తదితర చిత్రాలలో నటించారు. అవన్నీ కూడా చిన్నాచితకా పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లే. ఈ దశలో జబర్దస్త్ ప్రారంభం కావడంతో దానికి యాంకర్‌గా అడుగుపెట్టి దాదాపు 13 ఏళ్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మధ్యలో కొన్ని సినిమాలు నటిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో బుల్లితెరకు, జబర్దస్త్‌కే సమయం కేటాయిస్తున్నారు రష్మి. జబర్దస్త్‌తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు కూడా యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో రష్మి సినీ కెరీర్‌పై ఓ పెద్దాయన ఊహించని ప్రశ్న అడిగాడు.

Sridevi Drama Company Promo Rashmi Gautam Reveals Why She Is Not Seen Much in Films

మన్‌సూన్ స్పెషల్ థీమ్‌తో అందంగా రెడీ అయ్యింది శ్రీదేవి డ్రామా కంపెనీ. బుల్లితెర సెలబ్రిటీలతో పాటు అలనాటి హీరోయిన్ లైలా సందడి చేశారు. లైలాకు అసిస్టెంట్‌గా వచ్చిన నరేష్.. ఆమెకు గొడుగు పట్టలేకపోవడంతో అంతా నవ్వేస్తారు. ఇక అగధ మూవీ టీమ్ నుంచి ఎమ్మెస్ రాజు, కామాక్షి భాస్కర్ల తదితరులు సందడి చేశారు. పాన్ ఇండియా నెంబర్‌వన్ రాజుగారికి ఫస్ట్ హిట్ ఇచ్చింది ఎమ్మెస్ రాజుగారే అని చెబుతాడు ఆది. ఇప్పుడు ప్రభాస్ గారు, త్రిష గారు మీరు వర్షం మూవీ తీశారు. నాతో ఏ మూవీ తీస్తారని వర్ష అడగ్గా.. వర్షం 2 చేస్తానని ఎమ్మెస్ రాజు అన్నారు. ఆ అమ్మాయితో వర్షం 2 తీస్తే నిజంగానే కరువుస్తుందని ఆది పంచ్‌లు వేయడంతో అంతా నవ్వేస్తారు.

ఇంతలో ఆకాశవాణిలో దాదాపు 35 ఏళ్ల పాటు వాతావరణ విశేషాలు తెలియజేసిన రాజగోపాల్ వేదిక మీదకి వచ్చి అలరించారు. ఈ సందర్భంగా రష్మిని చూసి పలకరించిన ఆయన నిన్ను చూసినప్పుడల్లా అనుకుంటున్నాను.. నువ్వెందుకు సినిమాల్లో కనిపించడం లేదని అడిగారు. దీనికి రష్మి ఎమోషనల్ అవుతూ నవ్వేసింది. మరి ఆమె సినిమాలో నటిస్తున్నారా? లేక బ్రేక్ ఇచ్చారా? రష్మి సమాధానం మాత్రం ఫుల్ ఎపిసోడ్‌లో చూసేయాల్సిందే.

మన్‌సూన్ స్పెషల్ సందర్భంగా రైతుల కష్టాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. కొందరు రైతులను స్టేజ్ మీదకి పిలిపించి వారి గురించి చెప్పించారు. ఓ అమ్మాయి మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పించారు. ఈ సందర్భంగా బుల్లితెర నటుడు అనిల్ తన టీమ్‌తో కలిసి రైతుల కష్టాలపై చేసిన స్కిట్ అందరినీ ఏడుపు తెప్పించింది. వరదలకు పంటలు కొట్టుకుపోవడం, కౌలు ఇవ్వాలంటూ ఓనర్ వచ్చి బెదిరిస్తాడు. పంట మొత్తం కొట్టుకుపోవడంతో ఈసారి ఇవ్వలేనని చెప్పినా అతను వినిపించుకోడు. ఈ స్కిట్ చూసిన ఓ రైతు .. ఇదంతా నా నిజజీవితంలో జరిగిందని గుర్తుచేసుకుని బాధపడ్డాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. ఎమ్మెస్ రాజు అగధ సినిమా విశేషాలు, హైపర్ ఆది అల్లరి, రష్మి గౌతమ్ సినీ కెరీర్‌పై చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X