యాంకర్ రష్మితో ప్రేమ కావాలి... కోరిక తీరాలంటూ అమ్మవారి ముందు అలా...

Photo Courtesy: ETV Telugu India

జబర్దస్త్ యాంకర్‌గా తెలుగునాట ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రష్మి గౌతమ్. విశాఖపట్నానికి చెందిన ఈ బ్యూటీ తనకు వచ్చి రానీ తెలుగులోనే యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు. జబర్దస్త్‌కు ఎంతోమంది యాంకర్లు, కమెడియన్లు, జడ్జిలు వచ్చారు? వెళ్లారు.. కానీ రష్మి మాత్రం ఇంకా జబర్దస్త్‌నే అంటిపెట్టుకుని ఉన్నారు. నాటి నుంచి నేటి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మి తన ప్రేమను యాక్సెప్ట్ చేయాలంటూ ఓ నటుడు అమ్మవారికి మొక్కుకున్నాడు. ఈ వివరాల్లోకి వెళితే..

ఈటీవీలో ప్రసారమవుతున్న మరో కామెడీ షో.. శ్రీదేవి డ్రామా కంపెనీ. దాదాపుగా జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్లే దీనిలోనూ పాల్గొంటున్నారు, దీనికి కూడా రష్మి గౌతమ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సినీ ప్రముఖులు, బుల్లితెర ప్రముఖులు ఈ షోకు గెస్టులుగా వస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు. తాజాగా ఈ వారం కూడా ఓ స్పెషల్ థీమ్‌తో సిద్ధమైపోయింది ఈ కార్యక్రమం. మరికొద్దిరోజుల్లో ఆషాడ మాసం ప్రారంభం కానుండటంతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి చిహ్నంగా ఉన్న బోనాల పండుగ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బోనాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ రెడీ అయ్యింది. దీనికి సంబంధించి ఈటీవీ ప్రోమోను రిలీజ్ చేసింది.

Sridevi Drama Company Promo Rashmi Gautam s Emotional Prayer for Pandu Master and Naresh Seeks Her Love

Photo Courtesy: ETV Telugu India

బుల్లితెర యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ శివజ్యోతి తన భర్త గంగూలీ దంపతులు తన బిడ్డ వెన్నెలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మన బోనాలు మంచిగా, స్పెషల్‌గా ధూమ్‌ధామ్‌గా చేస్తాం. మరి ఈసారి వెన్నెల వచ్చిందంటే ఇంకెంత జోర్దార్‌గా చేయాలని భర్తను శివజ్యోతి అడుగుతుంది. ఈ వారం స్పెషల్ గెస్ట్‌గా అలనాటి నటి ప్రేమ హాజరయ్యారు. రష్మీ మనిద్దరం స్టేజ్ మీదుంటే ఇద్దరం దేవకన్యల్లా లేదు అని అడుగుతుంది ప్రేమ. దానికి రష్మి సిగ్గుపడుతుండగా.. జోక్ అంటే తెలియదా అని రాంప్రసాద్‌ను అడగటంతో రష్మి షాక్ అవుతుంది.

ఆ తర్వాత ఎల్ఈడీ మీద ఒక ఫ్రేమ్ వేస్తాం.. సౌండ్స్ ద్వారానే ఎక్స్‌ప్రెస్ చేయాలని టాస్క్ ఇస్తుంది రష్మి. తొలుత టేస్టీ తేజ- జోర్దార్ సుజాతను పిలిపించి తేజ కళ్లకు గంతలు కట్టి వర్షం బొమ్మను సుజాతకు చూపించడంతో ఆమె చిత్రమైన సౌండ్ చేస్తుంది. కుక్కర్ విజిల్‌లా ఉందని తేజ చెప్పడంతో ఎప్పుడు చూసినా తిండేనా అని మండిపడుతుంది. ఆ తర్వాత పంది బొమ్మను చూపించి దానిలా సౌండ్ చేస్తుంది రష్మి. ఆ వెంటనే బోనాల పండుగను తెలియజేస్తూ అమ్మవారి విగ్రహంతో పాటు సింగర్స్ చేత పాటలు పాడించి సందడి చేశారు.

అమ్మవారి ముందు రోలు, రోకలి పెట్టి.. ఆ రోకలిని రోల్‌లో 2 సెకన్లు కరెక్ట్‌గా నిలబడితే మీ కోరిత తీరినట్లు అని చెబుతుంది రష్మి. ఆ వెంటనే పొట్టి నరేష్‌ను పిలిచి మనసులో ఉన్న కోరికను బయటకు చెప్పు అని అంటుంది. దాంతో రష్మి నా లవ్ ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాలంటూ రోలులో రోకలిని నిలబెట్టగా అది నిలబడదు. దాంతో అంతా నవ్వేస్తారు. అనంతరం ఓ పెద్దావిడని పిలిపించగా ఆమె బోనాల గొప్పదనం గురించి చెబుతూ రోకలి నిలబెట్టగా అది సరిగ్గా నిలబడటంతో అంతా షాక్ అవుతారు.

తర్వాత జోర్దార్ సుజాత, శివజ్యోతిలు తమ బిడ్డల గురించి కోరుకుని కంటతడి పెడతారు. అలాగే బిడ్డల కోసం తల్లిదండ్రులు పడే బాధ, అబార్షన్స్‌పై చేసిన స్కిట్‌కు అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక చివరిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఢీ షో ఫేమ్ పండు మాస్టర్‌ త్వరగా కోలుకోవాలని అమ్మవారిని కోరుకుని రోకలి నిలబెట్టి తన మంచి మనసును చాటుకున్నారు రష్మి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల జాతర చూడాలంటే జూలై 5వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X