ఫైనల్స్‌లో... శ్రీదేవి-మాధురి దీక్షిత్!

By Bojja Kumar

Madhuri Dixit-Sridevi
ముంబై: ఒకప్పుడు పోటా పోటీగా బాలీవుడ్‌ తెరపై రాణించిన హీరోయిన్స్ శ్రీదేవి, మాధురి దీక్షిత్. తాజాగా ఈ ఇద్దరు ఓ టీవీ రియాల్టీ డాన్స్ షోలో స్టేజీ పంచుకోబోతున్నారు. ఝలక్ ధిక్లా జా-5 ఫైనల్స్‌లో ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కలిసి పాల్గొన బోతున్నారు.

ఇప్పటికే ఝలక్ ధిక్లా జా-5 కార్యక్రమానికి మాధురి దీక్షిత్, కరణ్ జోహార్, రెమో డిసాజలు జడ్జిలుగా కొనసాగుతూ వస్తున్నారు. గ్రాండ్ ఫైనల్‌ల్లో శ్రీదేవి ఈ షోలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. ఈ నెల 30న కలర్స్ ఛానల్‌లో ఝలక్ ధిక్లా జా-5 గ్రాండ్ ఫైనల్ జరుగనుంది.

శ్రీదేవి నటించిన 'ఇంగ్లీష్-వింగ్లిష్' మూవీ అక్టోబర్ 5న విడుదలవుతున్న నేపథ్యంలో.... శ్రీదేవిని ఈ షోలో గెస్ట్ అప్పియరెన్స్ ఇప్పించడం ద్వారా సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుందని ఆశిస్తున్నారు. అమెరికాలో ఒక భారతీయ గృహిణి ఇంగ్లీష్ మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతూ ఎదుర్కొన్న అవమానాలు, ఆ తర్వాత ఆమె ఏం చేసింది అనే ఇతి వృత్తంతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

గతంలో మాధురి దీక్షిత్ చాలా గ్యాప్ తర్వాత 'ఆజా నచ్ లే' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వగా....ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దీంతో మాధురి దీక్షిత్ బుల్లితెర కార్యక్రమాల వైపు మళ్లింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా సెటిలైన శ్రీదేవి ఇంతకాలం తన ఇద్దరు కూతుర్ల బాగోగులు చూసుకుంటూ గడిపేసింది. మరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ఏమేరకు సక్సెస్ అవుతుందో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X