శ్రీదేవి ఆస్తులకోసమే ఆ కుట్ర.. తెరవెనుక ఆమె మొహంలో సంతోషమే లేదు: శ్రీదేవి మేనమామ

వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. మూడు తరాల ఆడియెన్స్ ని తన నటనతో ఆకట్టుకున్న దివంగత హీరోయిన్ జీవితంలో కూడా ఎన్నో చేదు అనుభవాలు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి మేనమామ ఎవరు ఊహించని విధంగా కొన్ని విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా శ్రీదేవి మరణం గురించి అలాగే ఆమె ఆస్తుల కోసం జరిపిన కుట్రలపై కామెంట్స్ చేశారు.

 అనుమానాలు ఉన్నాయి..

అనుమానాలు ఉన్నాయి..

శ్రీదేవి మేనమామ వేణుగోపాల్ రెడ్డి గతంలోనే శ్రీదేవి మరణంపై అనుమానాలు ఉన్నట్లు మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్ గా కామెంట్ చేశారు. ఆమె భర్త బోనీ కపూర్, అలాగే బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ పై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం అప్పట్లో అందరిని షాక్ కి గురి చేసింది. మరోసారి ఆయన బోణి కపూర్ గురించి వివరణ ఇచ్చారు.

 చాలా ఇబ్బందులు ఎదుర్కొంది..

చాలా ఇబ్బందులు ఎదుర్కొంది..

వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీదేవి చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది. నిజానికి ఆమె స్కూల్ కి వెళ్లింది కూడా లేదు. ఒక మాస్టారు ప్రత్యేకంగా ఇంటికి వచ్చి శ్రీదేవికి పాఠాలు చెప్పేవారు. హీరోయిన్ గా ఎదగడానికి శ్రీదేవి కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె తల్లి శ్రీదేవి అన్ని విధాలుగా సహాయం చేసి సపోర్ట్ గా నిలిచేది.

ఆస్తులను చూసే..

ఆస్తులను చూసే..

స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత ఆమెపై బోనీ కపూర్ కన్నుపడిందని రెడ్డి తెలియజేశారు. నిజానికి అతను ఆమెను పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఆమె ఆస్తులను చూసే. శ్రీదేవి ఆస్తులు ఎక్కువగా కూడబెట్టుకోవడంతో బోనీ కపూర్ కి ఆశ ఎక్కువైంది. పక్కా ప్లాన్ తో శ్రీదేవిని వలలో వేసుకున్నట్లు రెడ్డి తెలిపారు.

బోనీ కపూర్ అమ్మేశాడు..

బోనీ కపూర్ అమ్మేశాడు..

బోనీ కపూర్ అప్పట్లో కొన్ని పనికిమాలిన సినిమాలు తీసి తీవ్రంగా నష్టపోయారు. తన అప్పులన్ని తీర్చాలి అంటే శ్రీదేవిని పెళ్లి చేసుకోవడమే అసలైన దారి అనుకున్నాడు. పెళ్లి తరువాత శ్రీదేవి ఆస్తులను చాలావరకు బోనీ కపూర్ అమ్మేశాడు. అప్పుల నుంచి బయటపడిన తరువాత కూడా అనవసరంగా మళ్ళీ సినిమాలు చేసి నష్టపోయాడు.

Recommended Video

Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
రోడ్డున పడకూడదని..

రోడ్డున పడకూడదని..

కుటుంబం రోడ్డున పడకూడదనే బాధతోనే శ్రీదేవి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అందంగా కనిపించాలని ఆమె మొహానికి సర్జరీ చేయించుకుంది. శ్రీదేవి తన జీవితంలో పైకి సంతోషంగా కనిపించినా కూడా తెర వెనుక బోనీ కపూర్ వల్ల చాలా మనోవేదనకు లోనయ్యిందని ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండానే శ్రీదేవిని బోనీ కపూర్ బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు శ్రీదేవి మేనమామ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X