చమ్మక్ చంద్రను ఫోన్ నెంబర్ అడిగిన శ్రీదేవి: ఏకంగా హీరోయిన్ అంత మాట అనడంతో అంతా షాక్!
చమ్మక్ చంద్ర.. ఈ పేరుతో పరచయం అవసరం లేదనే చెప్పాలి. అంతలా దాదాపు ఏడేళ్లుగా ఈ కమెడియన్ తెలుగు బుల్లితెరపై తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. జబర్ధస్త్ అనే షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. తద్వారా వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకెళ్తున్నాడు. దీంతో ఫాలోయింగ్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు. ఇలాంటి సమయంలో చమ్మక్ చంద్రను హీరోయిన్ శ్రీదేవి ఫోన్ నెంబర్ అడిగేసింది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు. ఆ వివరాలు మీకోసం!

అదే చంద్ర పాపులారిటీకి ప్రధాన కారణం
జబర్ధస్త్ షోలో ప్రతి టీమ్ లీడర్‌కు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అలాగే చమ్మక్ చంద్రకు ఫ్యామిలీ స్కిట్ల స్పెషలిస్టుగా పేరొచ్చింది. దీనికి కారణం అతడు ప్రతి దానిని అదే శైలిలో చేస్తుండడమే. మొదట్లో లేడీ గెటప్‌లు వేస్తూ రచ్చ చేసిన అతడు.. అలా కూడా సత్తా చాటాడు. మేనరిజంలోనూ మెరిసేవాడు. మొత్తానికి తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని బెస్ట్ టీమ్ లీడర్ అయ్యాడు.

అందులోనూ సత్తా.. వరుస ఆఫర్లతో బిజీ
బుల్లితెరపై తన మార్క్ చూపిస్తూ మెప్పించిన చమ్మక్ చంద్ర.. షోలకే పరిమితం కాలేదు. సుదీర్ఘమైన ప్రయాణంలో పలు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు. వాటిలో 'అఆ', 'అరవింద సమేత', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ', 'రాజా ది గ్రేట్', 'టాక్సీవాలా' సహా ఎన్నో సినిమాల్లో మంచి నటనను కనబరిచాడు. వెంకీ నటించిన 'బాబు బంగారం'లో అతడి లేడీ గెటప్ హైలైట్ అయింది.

జబర్ధస్త్‌కు షాకిస్తూ.. అలా మరో ప్రయాణం
దాదాపు ఏడేళ్ల పాటు జబర్ధస్త్ షోలో పని చేసిన చమ్మక్ చంద్ర.. గత ఏడాది దాని నుంచి తప్పుకున్నాడు. జడ్జ్ నాగబాబు ఈ షోకు గుడ్‌బై చెప్పిన సమయంలోనే చమ్మక్ చంద్ర కూడా తప్పుకున్నాడు. కొత్తదనం కోసం మాత్రమే బ్రేక్ తీసుకున్నానని అప్పుడు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారం అయిన 'అదిరింది', 'బొమ్మ అదిరింది'లో టీమ్ లీడర్‌గా చేశాడు.

అక్కడ నిరాశే ఎదురైంది.. ఇక్కడ మరోలా
నాగబాబుతో కలిసి వెళ్లి చేసిన 'అదిరింది' రెండు సీజన్లు మాత్రమే వచ్చి ఆ తర్వాత ఆగిపోయింది. దీంతో చమ్మక్ చంద్ర స్టార్ మాలో ప్రారంభం అయిన 'కామెడీ స్టార్స్' అనే షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. చంద్ర పాటు అవినాష్ కూడా ఉన్నాడు.

ఆ స్కిట్‌తో చమ్మక్ చంద్రపై విమర్శల వర్షం
'కామెడీ స్టార్స్'లో చమ్మక్ చంద్ర స్కిట్లు పరిధిని దాటి ఉంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం కొద్ది రోజులుగా అతడి స్కిట్లలో మసాలా ఎక్కువ అవుతుండడమే. డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు వెగటు పుట్టించేలా మేనరిజం చూపించడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత వారం అతడు చేసిన స్కిట్‌తో విమర్శలు వచ్చాయి.

చమ్మక్ చంద్రను ఫోన్ నెంబర్ అడిగిన శ్రీదేవి
వచ్చే వారం ప్రసారం కానున్న 'కామెడీ స్టార్స్' ఎపిసోడ్ ప్రోమో రెండు రోజుల క్రితం విడుదలైంది. ఇందులో కూడా చమ్మక్ చంద్ర ఫ్యామిలీ స్కిట్‌నే చేశాడు. రావడం రావడమే అదిరిపోయే సాంగ్‌తో సందడి చేసిన అతడు.. ఆ వెంటనే తన పంథాలో సాగే ఓ కుటుంబ నేపథ్యం ఉన్న స్కిట్‌ను ప్రారంభించాడు. ఇలాంటి సమయంలోనే జడ్జ్ శ్రీదేవి విజయ్‌కుమార్ చంద్రను ఫోన్ నెంబర్ అడిగింది.
Recommended Video

ఏకంగా హీరోయిన్ అంత మాట అనడంతో
ఎప్పటి లాగే చమ్మక్ చంద్ర.. భర్తల కష్టాల గురించి ఈ స్కిట్‌లో చెప్పుకొస్తున్నాడు. ఇంతలో అతడి కొడుకు క్యారెక్టర్ వచ్చి 'నాన్న ప్రపంచంలో నీరు మూడు శాతం, భూమి ఒక శాతం ఉందంట నిజమేనా' అనగా 'అది కూడా లేదురా. భర్తల కన్నీళ్లతో నీరుగా మారింది' అని బదులిచ్చాడు. దీంతో వెంటనే శ్రీదేవి కలగజేసుకుని 'చంద్ర ఒకసారి మీ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి' అంటూ అడిగేసింది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు.


Click it and Unblock the Notifications











