బ్రేకప్ దిశగా సిరి, శ్రీహాన్.. శ్రీహాన్ చేసిన పనికి అర్ధం అదేనా?

బుల్లితెరపై బిగ్‏ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో కారణంగా ఓ జంట తమ ఐదు సంవత్సరాల ప్రేమకు బ్రేకప్ చెప్పుకోగా.. ఇప్పుడు మరో జంట కూడా విడిపోయే పరిస్థితికి చేరుకుందని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

నెగిటివిటి మూటగట్టుకుని

నెగిటివిటి మూటగట్టుకుని

బిగ్‏బాస్ సీజన్ 5లో అందరికంటే ఎక్కువగా నెగిటివిటి మూటగట్టుకున్నారు షణ్ముఖ్, సిరి. బిగ్‏బాస్ షో కంటే ముందు షన్ను ఒక యూట్యూబ్ స్టార్. తన వీడియోలతో మిలియన్స్ ఫాలోవర్స్‏తో సహా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఎప్పుడో ఐదేళ్ల క్రితం దీప్తి సునైనాతో ప్రేమ మొదలు పెట్టిన అతను బిగ్‏బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి తన ప్రవర్తన కారణంగా తనకు తానే నెగిటివిటి మూటగట్టుకున్నాడు.

చీదరించుకునే పరిస్థితి

చీదరించుకునే పరిస్థితి

హౌస్ లో ప్రతి రోజూ సిరి, షణ్ముఖ్ హగ్గులు, ముద్దులు చూసి చూసి ప్రేక్షకులు చీదరించుకునే పరిస్థితి. సిరి మొదటి నుంచి కూడా షణ్ముఖ్ జస్వంత్ తో ఎక్కువగా ఫ్రెండ్లిగా ఉంటూ వచ్చింది. సిరి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే చాలా అందమైన అమ్మాయి ఈసారి హైలెట్ కాబోతోంది అని అనేక రకాల ప్రశంసలు అందుకుంది. కానీ ఆమె క్యారెక్టర్ ను చూసిన తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ విషయంలో సిరి హద్దులు దాటుతుంది అనే కామెంట్స్ ముందు నుంచి చాలా వచ్చాయి.

ఆమెకు బాగా హెల్ప్ అయి

ఆమెకు బాగా హెల్ప్ అయి

ఏకంగా సిరి తల్లి లోపలికి వచ్చి ఈ దరిద్రం ఆపండి అని హెచ్చరిక చేసే వరకు వచ్చింది. షణ్ముఖ్ జస్వంత్ తో సిరి కొనసాగించిన ప్రత్యేకమైన కెమిస్ట్రీ ఆమెకు బాగా హెల్ప్ అయింది. అయితే షణ్ముఖ్ పై మాత్రం తీవ్ర స్థాయిలో నెగిటివ్ అయింది. సిరి మధ్యలో ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ చాలా తెలివిగా టాస్క్ లను పూర్తి చేస్తూ టాప్ 5కి చేరింది.

బ్రేకప్ చెప్పి

బ్రేకప్ చెప్పి

షో ముగిసిన తర్వాత ఐదేళ్ల నుంచి షన్ను వెన్నంటే ఉండి ముందు నుంచి సపోర్ట్ చేసిన ప్రియురాలు దీప్తి న్యూ ఇయర్‌కు ఒక్క రోజు ముందు సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేసి తన బాధను వెల్లడించి బ్రేకప్ చెప్పింది. ఇప్పుడు ఇదే బాటలో సిరి, శ్రీహాన్ లు.. త్వరలోనే బ్రేకప్ చెప్పుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

పుట్టిన రోజు విషెస్

పుట్టిన రోజు విషెస్

సిరి పుట్టిన రోజు వేళ తన సోషల్ మీడియా ఖాతాలో ఆమెకు పుట్టిన రోజు విషెస్ చెప్పాడు శ్రీహాన్. కానీ ఇందుకు సిరి నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీంతో వీరిద్దరి నిజంగానే విడిపోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ రూమర్స్ కు బలం చేకూరేలా తాజాగా శ్రీహాన్ తన ఇన్‏స్టా ఖాతా నుంచి సిరి ఫోటోస్.. డిలీట్ చేశాడని టాక్ వినిపిస్తోంది.

ఈ ఇద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్‏లకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో శ్రీహాన్, సిరి మధ్య బ్రేకప్ జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X