Bigg Bossలో హగ్గుల రచ్చ రేపిన సిరి తల్లి.. ఆమెకు తెలియదు, నేను సారీ చెబుతున్నా అంటూ శ్రీహన్ షాకింగ్ పోస్ట్!

తెలుగు బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ ఎంట్రీ రౌండ్ కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల రాకతో బిగ్ బాస్ హౌస్‌లో సందడి వాతావరణం నెలకొందనే చెప్పాలి నవంబర్ 24వ తేదీ ఎపిసోడ్‌లో కాజల్ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి రాగా.. 25వ తేదీన శ్రీరామ్, మానస్, సిరి ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. శ్రీరామ్, మానస్‌లు తమ కుటుంబసభ్యులను చూసి తెగ సంతోషపడగా.. సిరికి మాత్రం ఆమె తల్లి నుంచి చివాట్లు పడ్డాయి. మరో పక్క షన్ను ఏడుపు మొదలు పెట్టాడు. అయితే ఈ అంశాల మీద సిరి కాబోయే భర్త శ్రీ హాన్ స్పందించాడు. ఆ వివరాలలోకి వెళితే..

Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

హగ్గులు నచ్చలేదు

హగ్గులు నచ్చలేదు

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి తల్లి శ్రీదేవి.. వచ్చీ రాగానే కూతురుకు చివాట్లు పెట్టి 'షణ్ముఖ్‌ను హాగ్ చేసుకోవడం నచ్చలేదని' ముక్కు సూటిగా అందరి ముందే కుండ బద్దలు కొట్టేసింది. దగ్గరవ్వడం మంచిదే గానీ హద్దులు దాటి హగ్గులు చేసుకోవడం నచ్చడం లేదంటూ శ్రీదేవి ముఖం మీదే చెప్పగా ఆ టాపిక్ డైవర్ట్ చేస్తూ తల్లిని సిరి పక్కకి తీసుకెళ్తుంది. హగ్ చేసుకోవడం నచ్చలేదంటే నన్ను పక్కకి పిలిచి పర్సనల్‌గా చెప్పొచ్చుగా.. ఇలా చెబితే వాళ్లు ఏమనుకుంటారు అని సిరి తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నేను చెప్పాలంతే

నేను చెప్పాలంతే

అయితే ఆమె కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా 'తల్లిగా ఈ విషయాలు చెప్పడం నా బాధ్యత. అందుకే చెప్పాను' అని మళ్లీ స్ట్రాంగ్ గానే చెప్పింది. "మీరిద్దరూ అలా హగ్ చేసుకోవడం బాలేదు" అని అన్నారు. "ఒక తండ్రిలా, అన్నలా సిరికి హెల్ప్ చేస్తున్నాడు. తనకి బాగా దగ్గరైపోతున్నాడు. అది నచ్చట్లేదు" అని అన్నారు. అయితే నువ్వు ఆ హగ్ గురించి ఎందుకు మాట్లాడావ్. రోజులో ఉన్న 24 గంటల్లో కేవలం గంట మాత్రమే మీరు చూస్తారు" అని సిరి అమ్మకు చెప్పుకుంది.

షాకయిన షన్ను

షాకయిన షన్ను

ఆ తర్వాత తన కష్టాలు చెప్పుకుని బాధపడిన ఆమె.. కూతురును ఎలాగైనా కప్పు పట్టుకుని ఇంటికి రమ్మని ధైర్యం నూరి పోసింది. షణ్ముఖ్ కూడా ఈ మాటలు విన్న వెంటనే కొంచెం డల్ అయినట్టు కనిపించగా సిరి తల్లి హౌస్ నుండి వెళ్తూ షణ్ముఖ్ డల్ అవ్వడం చూసి, "డల్ అయిపోయావ్. హుషారుగా ఉండు" అని చెప్పి వెళ్ళింది. అయితే ఆమె అటు వెళ్ళగానే సిరి వచ్చి షణ్ముఖ్‌ను హాగ్ చేసుకుని ఏడవగా.. షణ్నూ మాత్రం ఆమెను మనసారా హత్తుకుని ఓదార్చలేకపోయాడనే చెప్పాలి. ఈ హగ్గులు నచ్చడం లేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. హౌస్‌లో ఉండేందుకు తాను అర్హుడిని కాదని అనుకుంటూ కుమిలిపోయాడు.

కరెక్ట్ కాదంటున్న షన్ను ఫ్యాన్స్

కరెక్ట్ కాదంటున్న షన్ను ఫ్యాన్స్

దీంతో షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్స్ అందరూ సిరి తల్లి అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అంటూ పెద్దఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఇలా అందరి ముందు మాట్లాడటం కరెక్ట్ కాదని వాళ్ళు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. షణ్ముఖ్ - సిరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండగా దానిని బయట వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే సరే కానీ కుటుంబ సభ్యులు కూడా తప్పుగా అర్థం చేసుకోవడం కరెక్టు కాదని వారు వాదిస్తున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Siri తల్లి ఇచ్చిన వార్నింగ్ కి కంటతడి పెట్టుకున్న Shanmukh || Filmibeat Telugu
ఆమె తరపున సారీ చెబుతున్నా

ఆమె తరపున సారీ చెబుతున్నా

తాజాగా ఈ అంశంమీద సిరి కాబోయే భర్త శ్రీహాన్ స్పందించాడు. తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టిన శ్రీహాన్ ఆమెకు విషయాన్ని ఎలా స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పాలో తెలియదు అని అన్నారు. వాళ్ల వాతావరణం అలాగే ఉంటుందని, ఒక తల్లిగా తన కూతురు బ్యాడ్ అవుతుంటే బయట జనాలందరూ తప్పుగా మాట్లాడుతుంటే దాన్ని తీసుకోలేక అలా అనేశారు అని, ఆమె అంటారు అని నేను కూడా ఊహించలేదు అని చెప్పుకొచ్చాడు. ఆ కారణంగా ఆమెను ద్వేషించే వద్దు అని పేర్కొన్న శ్రీహాన్ ఆమె బదులు నేను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. నేను సిరి షణ్ముఖ రిలేషన్ను గౌరవిస్తున్నామని శ్రీ అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X