బిగ్ బాస్ 6లో శ్రీహాన్.. వాళ్లకు కూడా పిలుపు.. కానీ?

బిగ్‌బాస్ సీజ‌న్ 6కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఇటీవ‌ల విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. గతంలో లాగా కాకుండా ఈ సారి సామాన్యుల‌కు ప్ర‌వేశాన్ని క‌ల్పిస్తూ గోల్డెన్ ఆఫ‌ర్ ఇస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే తాజా సీజ‌న్ ని ప్రారంభించ‌బోతున్నామంటూ కింగ్ నాగార్జున ఒక కామన్ మ్యాన్ స్పెషల్ ప్రోమోలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజ‌న్ లో హౌస్ లోకి ఎవ‌రు ఎంట్రీ ఇస్తున్నార‌నే చ‌ర్చ మొదలైంది. అయితే ఈ షోలో పాల్గొనబోయే వారు ఎవరు అనే విషయం మీద చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

 ఇప్పటికే ఫైనల్

ఇప్పటికే ఫైనల్

బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించిన లోగో ప్రోమో విడుదల అవడంతో కొత్త కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి ఎవరు వస్తారన్నదానిపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇక ఇప్పటికే పలువురు యూట్యూబర్స్, సోషల్ మీడియాల సెలబ్రిటీలతో పాటు టీవీ-సినీ ఆర్టిస్ట్‌లను ఫైనల్ చేశారనే టాక్ నడుస్తోంది. వీరితో పాటుగా కామన్ మ్యాన్ కోటాలో ఒకరిద్దరికి అవకాశం కల్పించబోతున్నారని కూడా అంటున్నారు.

వెయిట్ చేసి మరీ

వెయిట్ చేసి మరీ

దీనికి సంబంధించిన ప్రాసెస్ మొదటి స్టేజ్ పూర్తయిందని, భారీ సంఖ్యలో వచ్చిన అప్లికేషన్స్ ను వెరిఫై చేసి ఒకరిద్దరిని తీసుకోబోతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే శ్రీహాన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్‌లోనే శ్రీహాన్ కంటెస్టెంట్‌గా రాబోతున్నాడనే ప్రచారం నడిచింది కానీ ఎందుకో అది వర్కౌట్ కాలేదు. శ్రీహాన్‌కు బిగ్ బాస్ ఓటీటీ అవకాశం వచ్చినా సీజన్ 6పై గురిపెట్టిన శ్రీహాన్.. వెయిట్ చేసి మరీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అనూహ్యంగా షాకిస్తూ

అనూహ్యంగా షాకిస్తూ

ఇక ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వెళ్తే గతంలో పెంపొందించుకున్న పాజిటివిటీ దృష్ట్యా టైటిల్ రేస్‌లో ముందు ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక శ్రీహాన్‌తో పాటు మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఓటీటీలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా సత్తా చాటి అనూహ్యంగా షాకిస్తూ ఎలిమినేట్ అయిన ఆర్జే చైతుకి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ 6లో బెర్త్ కన్ఫర్మ్

బిగ్ బాస్ 6లో బెర్త్ కన్ఫర్మ్

చైతుతో పాటుగా ఓటీటీలో టాప్ 3లో నిలిచిన యాంకర్ శివకి.. ఐదో స్థానంలో నిలిచిన మిత్రా శర్మకి కూడా బిగ్ బాస్ సీజన్ 6లో అవకాశం కల్పించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ ముగ్గురికీ లోపలి ఎంట్రీ ఉంటుందని ఒక టాక్ నడుస్తుండగా లేదు, ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే బిగ్ బాస్ 6లో బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని మరో టాక్ నడుస్తోంది.

వారికి కూడా

వారికి కూడా

తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దీపిక పిల్లి, జబర్దస్త్ హైపర్ ఆది, సీరియల్ నటి చైత్ర రాయ్ వంటి వారికి బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఆఫర్ లు వచ్చాయని తెలుస్తోంది. అయితే వీరిలో ఎవరు ఆ ఆఫర్ దక్కించుకుంటారు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.. హైపర్ ఆది మల్లెమాల వారి అగ్రిమెంట్ లో ఉంటే కనుక వెళ్ళే సాహసం చేయకపోవచ్చు. ఇక ఈ సీజన్లో కూడా ఒక ట్రాన్స్ జెండర్ ఎంట్రీ కన్ఫర్మ్ గా ఉంటుందని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X