కెరీర్ రిస్క్‌లో పెట్టి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టా.. చేతులారా..
తెలుగు బుల్లితెరపై అత్యంత క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షోల్లో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) ముందువరుసలో ఉంటుంది. ప్రతి సీజన్‌ను కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఈ షో భారీ ఆదరణ పొందుతోంది. అయితే అదే సమయంలో... షోపై అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా మాజీ కంటెస్టెంట్లు కొందరు చేసే ఆరోపణలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇక తాజాగా సీజన్ 9కి సంబంధించిన ఓ కంటెస్టెంట్ చేసిన షాకింగ్ కామెంట్స్ మరోసారి బిగ్‌బాస్‌పై చర్చను తెరపైకి తెచ్చాయి. షోలో జరుగుతున్న పరిణామాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు?
ఇటీవల బిగ్‌బాస్‌పై హాట్ కామెంట్స్ చేసిన మాజీ కంటెస్టెంట్ ఎవరో కాదు.. శ్రీజ దమ్ము (Srija Dammu). ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు. ఏపీ విశాఖపట్నానికి చెందిన శ్రీజ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి కామనర్స్ కోటాలో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టడం అప్పట్లోనే ఆసక్తి రేపింది. హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజునుంచే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆటతీరుతో ఆకట్టుకున్న శ్రీజ... "ఫినాలే వరకు వెళ్తుంది" అనే అంచనాల మధ్యే ఐదో వారంలో ఎలిమినేట్ కావడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఈ ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ తర్వాత భరణితో కలిసి రీ-ఎంట్రీ ఇచ్చినా, వారం రోజుల్లోనే మళ్లీ బయటకు రావాల్సి వచ్చింది. భరణిని కాపాడేందుకే శ్రీజను బలి చేశారంటూ అప్పట్లో నెటిజన్లు మండిపడ్డారు. బిగ్‌బాస్ తర్వాత కూడా శ్రీజ ఫుల్ బిజీగా ఉంటూ టీవీ షోలు, స్పెషల్ అపియరెన్సులు, రియాలిటీ ప్రోగ్రామ్స్‌తో సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీజ.. తన వ్యక్తిగత జీవితం, బిగ్‌బాస్ అనుభవాలు, కెరీర్ నిర్ణయాలపై ఓపెన్‌గా మాట్లాడి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
బిగ్‌బాస్‌లోకి వెళ్తానని ముందే డైరీలో రాసుకున్నా
అగ్నిపరీక్ష టాస్క్ గురించి మాట్లాడిన శ్రీజ.. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడతానన్న కాన్ఫిడెన్స్ తనకు మొదటి నుంచే ఉందని చెప్పింది. 'గత ఏడాదే నేను ప్లానింగ్స్ మొదలుపెట్టాను. ఈ ఏడాది కచ్చితంగా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెడతానని నా డైరీలో కూడా రాసుకున్నాను. మే నెల నుంచే ప్రిపేర్ అవుతున్నా. జూన్‌లో కామనర్స్ ఎంట్రీ ఉంటుందని తెలిసిన వెంటనే అప్లై చేశాను. సెలెక్ట్ అవుతానన్న నమ్మకం అప్పుడే ఫిక్స్ అయిపోయింది. ముందు అమ్మాయిలు హౌస్‌లోకి వెళ్లారు కదా... అలాగే నేనూ వెళ్తానని అనుకున్నా' అంటూ తన జర్నీని వివరించింది.
బిగ్‌బాస్ కోసం సాఫ్ట్‌వేర్ జాబ్‌కు రాజీనామా!
ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు శ్రీజ ఇచ్చిన సమాధానం మరింత షాక్ ఇచ్చింది. 'బిగ్‌బాస్‌లోకి వెళ్తానని ముందే ఊహించి... సెప్టెంబర్ 5న నా సాఫ్ట్‌వేర్ జాబ్‌కు రిజైన్ చేశాను. హౌస్‌లోకి అడుగు పెట్టే ముందు కెరీర్‌ని పక్కన పెట్టేశాను' అని స్పష్టంగా చెప్పింది. బిగ్‌బాస్ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరుతారా అన్న ప్రశ్నకు స్పందించిన శ్రీజ.. 'కచ్చితంగా మళ్లీ జాబ్‌లో జాయిన్ అవుతా. కానీ కొంచెం టైం తీసుకుంటాను. పక్కాగా మళ్లీ సాఫ్ట్‌వేర్ కెరీర్ కొనసాగిస్తా' అని వెల్లడించింది.
రెండింటినీ బ్యాలెన్స్ చేస్తా
ఇండస్ట్రీని ఎలా బ్యాలెన్స్ చేస్తావు అన్న ప్రశ్నకు శ్రీజ చాలా ప్రాక్టికల్‌గా స్పందించింది. 'అటు జాబ్‌ని... ఇటు ఇండస్ట్రీని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తా. నాకు మంత్లీ ఇన్‌కమ్ కావాలి. ఇండస్ట్రీలో ఎప్పుడు అవకాశాలు వస్తాయో చెప్పలేం. ఎంతవరకు సక్సెస్ వస్తుందో కూడా తెలియదు. ఆ రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే ఒకసారి రిస్క్ తీసుకుని నా కెరీర్‌ను పక్కన పెట్టి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టాను' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











