Don't Miss!
- Sports
అందుకే రోహిత్, కోహ్లీలను టీ20లకు దూరం పెట్టాం: రాహుల్ ద్రవిడ్
- News
Viral Video: హైదరాబాద్ విమానంలో మహిళా సిబ్బంది పట్ల దౌర్జన్యం..!!
- Lifestyle
మీ భర్త మీతో కంటే ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ టైం గడుపుతున్నారా?
- Finance
కన్నీళ్లవుతున్న టెక్కీల ఆశల మేడలు..! అంత కష్టపడ్డా చివరికి స్వదేశానికి ప్రయాణం..
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
శ్రీకాంత్ కొడుకు బుల్లితెరపై కూడా హిట్టే.. మెగా హీరో కంటే ఎక్కువ రేంజ్ లో పెళ్లి సందD టీఆర్పీ
శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందD సినిమా గత ఏడాది దసరా సమయం లో విడుదలైన విషయం తెలిసిందే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరపైకి వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు వరకు కూడా పెద్దగా హైప్ క్రియేట్ అయితే చేయలేదు. కానీ విడుదల తర్వాత పండగ సీజన్ లో సినిమాకు మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చాయి. పెట్టిన పెట్టుబడికి మొత్తానికి సినిమా అయితే నిర్మాతకు మంచి లాభాలు అందించింది.
ఇక సినిమా చాలా ఆలస్యంగా టీవీలో టెలికాస్ట్ కావడంతో పెద్దగా ఎవరు చూడకపోవచ్చు అని అనుకున్నారు. ఇక సినిమా విడుదలకు ముందు శాటిలైట్ హక్కులు రూపంలో పెద్దగా మంచి డీల్స్ రాకపోవడంతో చిత్రయూనిట్ సభ్యులు నిర్మాతలు కొంతకాలం పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. విడుదల తరువాత మరింత ఆశపడి వచ్చిన ఆఫర్స్ కూడా రిజెక్ట్ చేశారు. ఇక తప్పకుండా మంచి ప్రాఫిట్ వచ్చేలా డీల్ సెట్ చేసుకోవాలని అనుకున్నారు.

కానీ అప్పటికే చాలా ఆలస్యం కావడంతో సినిమా పాతబడిపోయింది. అలాగే ఏ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కూడా ఆసక్తి చూపలేదు. ఇక చివరికి జీ తెలుగు ఈ సినిమా తక్కువ ధరకు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఇటీవల మొదటిసారి టెలివిజన్ లో సినిమా ప్రీమియర్స్ కు ఊహించని విధంగా రేటింగ్స్ అందుకోవడం విశేషం. ఇంత చిన్న సినిమా మా 8.62 టిఆర్పీ అందుకోవడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది.
ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని సినిమా కూడా జెమినీ టీవీలో టెలికాస్ట్ అవ్వగా అక్కడ పెద్దగా రెస్పాన్స్ ఏమీ రాలేదు. ఆ సినిమాకు కేవలం 2.66 టిఆర్పి మాత్రమే వచ్చింది. కానీ అంతకంటే ఎక్కువగా రోషన్ సినిమా పెళ్లి సందD సినిమాకి మంచి టీఆర్పీ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడటానికి ఇష్టపడ్డారు. అలాగే ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. సినిమా స్క్రీన్ పై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా మంచి రేటింగ్ అందుకోవడంతో రోషన్ భవిష్యత్తుకు మంచి హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు.