Jathiratnalu: నూకరాజుపై శ్రీముఖి దారుణ కామెంట్.. పరువు తీసేసిందిగా!
మల్లెమాల సంస్థ చేసిన దాదాపు అన్ని షోలు హిట్ అవుతూ వస్తున్నాయి. షో సరిగా పెర్ఫార్మ్ చేయడం లేదు అని భావించిన సమయంలో దాని నిలిపివేయడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు మల్లెమాల సంస్థ. ఈ నేపథ్యంలోని జాతి రత్నాలు అనే షో కూడా బాగా క్లిక్ అవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త వాళ్లను తీసుకొచ్చి స్టాండ్ అప్ కామెడీ చేయిస్తూ అలరిస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన పటాస్ షో లాగానే ఈ షో కూడా అందరిని ఆసక్తికరంగా ఆకట్టుకుంటుంది. ఇక తాజా ఎపిసోడ్ ప్రోమో విడుదలవుగా ఈ ప్రోమోలో నూకరాజు పరువు తీసేసింది శ్రీముఖి. ఆ వివరాల్లోకి వెళితే

నోరు మూయించి
ప్రస్తుతానికి శ్రీముఖి హోస్ట్ గా జాతి రత్నాలు అనే షో నడుస్తోంది. ఈ షోలో ఇమ్మానుయేల్, నూకరాజు, పంచ్ ప్రసాద్ వంటి వారు అలరిస్తున్నారు. వీరు తప్ప మిగతా వారందరూ కొత్త వారే. ఎప్పటికప్పుడు కొత్త వారిని తీసుకువచ్చి స్టాండప్ కామెడీ చేయిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో నూకరాజు ఒక డబల్ మీనింగ్ డైలాగ్ వేస్తే శ్రీముఖి కూడా వెంటనే ఏమాత్రం తడుముకోకుండా తాను కూడా ఒక డబల్ మీనింగ్ డైలాగ్ వేసి అతని నోరు మూయించింది.

కౌంటర్లు వేస్తూ
అసలు విషయం ఏమిటంటే తాజాగా ఈ బ్యాచ్ అందరూ కలిసి రంగస్థలం సినిమా స్పూఫ్ వేశారు. ఈ క్రమంలోనే జగపతి బాబు పాత్రలో పంచ్ ప్రసాద్, చిట్టి బాబు పాత్రలో నూకరాజు, జబర్దస్త్ మహేష్ క్యారెక్టర్ లో ఇమ్మానియేల్, సమంత క్యారెక్టర్ లో శ్రీముఖి నటించింది. రామ్ చరణ్ చెవిటి పాత్రలో నూకరాజు కనిపించగా తనకు వినిపించడం లేదు అనే విధంగా పక్కన ఉన్న ఇమ్మానియేల్ కౌంటర్లు వేస్తూ కనిపించాడు.

ఇప్పించినందుకు
ఇక తర్వాత శ్రీముఖి వచ్చి తన పొలం సర్పంచి లాక్కున్నాడు అని వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టి నూకరాజుకి తన బాధ చెప్పుకునే ప్రయత్నం చేయగా నూకరాజుకు వినిపించనట్టే యాక్టింగ్ చేస్తాడు. తర్వాత అసలు విషయం అర్థం కావడంతో సర్పంచ్ సంగతి చూసి నీ పొలం నీకు ఇప్పిస్తా అని అంటాడు. అలా ఇప్పించినందుకు నాకేమైనా ఉందా అనే ఉద్దేశంతో నూకరాజు డబల్ మీనింగ్ డైలాగు వేస్తాడు.

పాపులారిటీ
దానికి శ్రీముఖి కూడా వెంటనే తడుముకోకుండా నీకేమైనా ఉందా లేదా నాకు ఎలా తెలుస్తుంది నీకే తెలియాలి కదా అంటూ దారుణమైన కామెంట్ వేసింది. అయితే అక్కడ ఉన్న వారందరూ దాన్ని సరదాగా తీసుకోవడంతో అందరూ నవ్వేస్తారు. ఇక మొత్తం మీద నూకరాజు ఈ మధ్య మంచి పాపులారిటీ దగ్గించుకుంటున్నాడు అనే చెప్పాలి.

స్పెషల్ ప్రోగ్రాంలు
ఒకపక్క జబర్దస్త్ లో కనిపిస్తూనే మరోపక్క ఇతర షోస్ లో కూడా కనిపిస్తున్నాడు. పటాస్ సమయంలో ఆసియాతో కలిసి సందడి చేసిన ఆయన ఇప్పుడు ఆమెతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా పసిగట్టిన మల్లెమాల టీం వారిద్దరి గురించి కూడా కొన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కాష్ వంటి కార్యక్రమాలలో కనిపిస్తూ ఉన్నారు. త్వరలోనే వీరి మీద కూడా స్పెషల్ ప్రోగ్రాంలు డిజైన్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.


Click it and Unblock the Notifications











