బిగ్‌బాస్‌పై శ్రీరెడ్డి సంచలనం.. నానిని గెంటేస్తా, మెగా ఫ్యామిలీ హస్తం!
Recommended Video

సంచలన నటి శ్రీరెడ్డి మరో మారు వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. కాస్టింగ్ కౌచ్ పోరాటం పేరుతో కావలసినంత పబ్లిసిటీ పొందిన శ్రీరెడ్డి మీడియాలో హల్ చల్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఆ పవన్ కళ్యాణ్ తల్లిని దూషించి ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్న మీడియా, దాని వెనుక ఉన్న కుట్ర దారులకు పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దీనితో శ్రీరెడ్డి వార్తల ప్రసారాలని సదరు సంస్థలు నిలిపివేశాయి. ఇదిలా ఉండగా శ్రీరెడ్డి మరో మారు లైమ్ లైట్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ షో, ఆ షోకి హోస్ట్ గా మారబోతున్న నేచురల్ స్టార్ నాని టార్గెట్ గా శ్రీరెడ్డి కామెంట్స్ మొదలు పెట్టింది.

ఆసక్తి రేపుతున్న బిగ్ బాస్
బిగ్‌బాస్ షో దేశవ్యాప్తంగా విజయవంతం అయిన బుల్లి తెర రియాలిటీ షో. తెలుగులో తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రెండవ సీజన్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. జూన్ 10 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షోలో మొత్తం 16 మంది సభ్యులు పాల్గొనబోతున్నారు.

శ్రీరెడ్డి అంటూ ఊహాగానాలు
ఆ మధ్య సోషల్ మీడియాలో బిగ్‌బాస్ లో పాల్గొనబోయే పార్టిసిపెంట్స్ గురించి ఓ ప్రచారం జరిగింది. ఈ సీజన్ లో శ్రీరెడ్డి కూడా పాల్గొనబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని తేలింది.

నానిపై కామెంట్స్
శ్రీరెడ్డి గతంలోనే నానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికి నాని గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూనే ఉంది.
ఏం చేద్దాం నాని
తాజగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నాకు, నానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏం చెద్దాం రా నాని అని ట్వీట్ చేసింది.
బిగ్‌బాస్‌పై అటాక్
చూస్తుంటే నాని హోస్ట్ గా వ్యవహరించబోతున బిగ్‌బాస్ షోని కూడా శ్రీరెడ్డి వదిలేలా కనిపించడం లేదు. బిగ్ బాస్ షోపై మెగా ఫ్యామిలీ ప్రభావం ఉందని శ్రీరెడ్డి కామెంట్ చేసింది. కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో తాను ఎవరిని రెకమండ్ చేయలేదని నాని ఇటీవల ప్రెస్ మీట్ లో తెలిపాడు. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ కు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు.

నానినే గెంటేస్తా
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ కు శ్రీరెడ్డి రిప్లై ఇచ్చింది. బిగ్‌బాస్ షోలో నీకు అవకాశం ఇవ్వలేదా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, అవకాశం ఉంటె నానినే బిగ్‌బాస్ నుంచి గెంటేస్తా అంటూ శ్రీరెడ్డి తెలిపింది.


Click it and Unblock the Notifications











