Bigg Boss Telugu 6: శ్రీసత్యకు షాకింగ్ రెమ్యునరేషన్.. మొత్తం ఎంత రాబోతోందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులు కొంత పెదవి విరిచారు. కొంత హైప్ ఉన్న సెలబ్రిటీలను తీసుకువస్తారు అనుకుంటే ఈసారి పూర్తి స్థాయిలో తెలియనివారిని హౌస్ లోకి తీసుకువచ్చారు అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. అయితే కొందరు హౌస్ లోకి వచ్చిన తర్వాత మెల్లగా వారికంటూ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు.

ఇక శ్రీ సత్య కూడా ఓవైపు విమర్శలు అందుకుంటున్నప్పటికి మరోవైపు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అయితే మొత్తానికి ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవుతోంది. ఈ క్రమంలో ఆమెకు ఏ స్థాయిలో బిగ్ బాస్ పేమెంట్ ఇచ్చాడు అనే వివరాల్లోకి వెళితే..

20 మందితో పోటీ పడుతూ..

20 మందితో పోటీ పడుతూ..

శ్రీ సత్య అసలు హౌస్ లోకి వచ్చినప్పుడు పెద్దగా బయట ప్రపంచానికి తెలియదు. అప్పటివరకు ఏదో మోడల్ గా హోస్ట్ గా చేస్తూ నిలదొక్కుకోవాలి అని అనుకుంది. అయితే హఠాత్తుగా బిగ్ బాస్ లోకి అవకాశం రావడంతో ఆమె ఈ ఛాన్స్ ఎంత మాత్రం వేస్ట్ చేసుకోకూడదు అని అడుగుపెట్టేసింది. 20 మందితో పోటీగా నిలుస్తూ ఆమె దాదాపు ఫైనల్స్ దగ్గర వరకు వచ్చింది.

సత్య ఏలిమినెట్

సత్య ఏలిమినెట్

ఇక ఫైనల్స్ కు మరొక అడుగు దూరంలో ఉండగా శ్రీ సత్య ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం హౌస్ లో మొత్తం 6 మంది ఉండగా అబ్బాయిలు నలుగురు కూడా సేఫ్ జోన్ లో కొనసాగుతున్నారు. ఇక కీర్తి శ్రీ సత్య ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లిపోతారు అని అర్థమైంది. అయితే మొదట కీర్తి వెళ్ళిపోతుంది అని టాక్ కూడా వచ్చింది. కానీ చివరికి శ్రీ సత్య చివరి ఎలిమినేషన్ లో హౌస్ లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శ్రీహన్ తో కెమిస్ట్రీ

శ్రీహన్ తో కెమిస్ట్రీ

శ్రీ సత్య ఎక్కువగా శ్రీహన్ తోనే తన ప్రయాణాన్ని కొనసాగించింది. వీరి మధ్యలో కెమిస్ట్రీపై కూడా చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. ఒక విధంగా శ్రీ సత్య శ్రీహన్ ను వలలో వేసుకుంది అని కూడా మిగతా ఇంటి సభ్యులు కొందరు కామెంట్ కూడా చేశారు. అయినప్పటికీ ఆ విషయాలను పట్టించుకోకుండా ఇంత దూరం కూడా చాలా బాగానే నెట్టుకొచ్చింది.

ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు

ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు

ఇక శ్రీ సత్య చివరి వరకు పోరాడాలని బాగానే ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె కంటే మిగతా వాళ్ళు కాస్త బలమైన కంటెస్టెంట్స్ కావడంతో ఇప్పుడు వెళ్లిపోక తప్పలేదు. కానీ గతవారం కూడా ఆమె హౌస్లో నిలదొక్కుకునేందుకు కొన్ని ఛాలెంజెస్ లో అయితే బాగానే పోరాడింది. తనకు ఎదురుగా టాప్ కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.

వారానికి ఎంతంటే?

వారానికి ఎంతంటే?

ఇక మొత్తానికి శ్రీ సత్య 15వ వారం ముగియకముందే మధ్యలోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఇక ఆమె పారితోషికం ఎంత ఉంది అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే శ్రీ సత్య హౌస్ లోకి అడుగుపెట్టేముందు కేవలం ఒక వారానికి 30 వేలు అందుకునే విధంగా ఒక ఒప్పందం చేసుకుంది.

 మొత్తం ఎంతంటే?

మొత్తం ఎంతంటే?

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ముందే కంటెస్టెంట్స్ అందరితోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటూ. ఉంటాడు ఎవరైతే పది వారాలు దాటితే తప్పకుండా వారికి మరికొంత రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది అని చెబుతూ వారిలో స్ఫూర్తిని నింపే విధంగా చేస్తూ వచ్చాడు. ఇక మొత్తంగా 15 వారాలకు కూడా ఇప్పుడు శ్రీ సత్యకు రెమ్యునరేషన్ భారీగా అందుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఈ సీజన్కు ఆమె బోనస్ తో కలిపి 5 లక్షలు అందుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X