మాకెందుకు సినిమా ఆఫర్లు ఇవ్వరు? సీరియల్ నటి ఆవేదన

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి శ్రీవాణి (Srivani). ఇటీవల జబర్దస్త్ వర్షా హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొని, తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్ లోని పలు కీలక విషయాలను బహిరంగంగా వెల్లడించారు. పెళ్లి, లివింగ్ రిలేషన్, సీరియల్స్, సినిమాల మధ్య అవకాశాలపై కూడా అనుభవాలను పంచుకున్నారు. ఈ సమయంలో సీరియల్స్ లో నటించేవారికి సినిమా ఆఫర్లు ఇవ్వరా? అని ప్రశ్నకు షాకింగ్ సమాధానమిచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే?

హైదరాబాద్‌కు చెందిన శ్రీవాణి తొలుత దర్శకుడు కోదండరామిరెడ్డి రూపొందించిన 'గొడవ' చిత్రంలో చిన్న పాత్ర పోషించి సినీ ప్రయాణం ప్రారంభించారు. అనంతరం సినీరంజనీ కార్యక్రమం ద్వారా యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన టెలివిజన్ అవకాశాలతో సంఘర్షణ, కాంచన గంగ, చంద్రముఖి, మావి చిగురు, కలవారి కోడళ్లు, రాములమ్మ, తిరుమాంగల్యం వంటి ప్రముఖ సీరియల్స్‌లో నటించి, మెప్పించింది.

Srivani Gives Shocking Reply on Why Serial Actors Don t Get Movie Offers

సీరియల్స్ నటిస్తే సినిమాలు ఎందుకు రావా? అని యాంకర్ వర్ష ప్రశ్నించగా.. 'సీరియల్ నటులకు సినిమా ఆఫర్లు రావు అనడం పూర్తిగా సరైన కామెంట్ కాదు. వస్తాయి, కానీ అందరూ ఊహించే రేంజ్‌లో రాకపోవచ్చు. ప్రధాన కారణం డేట్స్' అన్నారు. సీరియల్స్, సినిమాల పని వేళలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, సీరియల్ డేట్స్‌ ఇవ్వాల్సి వస్తే సినిమాలకు సమయం ఇవ్వలేమని వివరించారు.

సీరియల్స్ బెటరా? సినిమాలు బెటరా? అని యాంకర్ ప్రశ్నించగా.. నటి శ్రీవాణి సమాధానమిస్తూ.. 'ఇప్పుడు నేను సీరియల్స్ చేస్తున్నా అంటే, సీరియల్స్ బెటర్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ, ఎవరికైతే సినిమా అవకాశాలు రావడానికి వెయిట్ చేసే సపోర్ట్ ఉంటుందో వారు సినిమాలు ప్రయత్నించవచ్చు. ఆ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది" అని తెలిపారు.

ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టే వారికి శ్రీవాణి సలహా ఇచ్చింది. 'మనకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. సంవత్సరాలపాటు సాగే సీరియల్స్‌లో మధ్యలో వదిలేయడం సరైంది కాదు. కమిట్మెంట్ అంటే వేరే అర్థం కాదు -ఇతరులకు ఇచ్చే నమ్మకం" అని వివరించారు. ఇక ఇండస్ట్రీలో కమిట్‌మెంట్స్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని రూమర్స్ ఉన్నాయని వర్ష అడగగా, శ్రీవాణి ఘాటుగా స్పందించారు.

"అవి పూర్తిగా అబద్ధాలు. నాకెవరూ అలాంటి విషయం చెప్పలేదు. నేను యాంకర్‌గా మొదలుపెట్టి సక్సెస్ అయ్యాను. నేడు కూతుర్నీ ఇండస్ట్రీలోకి తీసుకువస్తున్నాను. టాలెంట్ ఉంటే అవకాశాలు ఎవరికి అయినా వస్తాయి. అలాగే.. ఇండస్ట్రీలో ఎదుటివాళ్లు ఎలా ప్రవర్తిస్తారన్నది, మనం ఎలా ప్రవర్తిస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుందని నటి శ్రీవాణి స్పష్టం చేశారు. 'మన వ్యవహారం, మన వైఖరి చూసే మనమీద అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే ప్రొఫెషనల్‌గా, మర్యాదగా ఉండటం చాలా ముఖ్యం' అని తెలిపారు.

"బయట ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. అవేవీ ఇంత త్వరగా బయటికి రావు. కానీ ఇండస్ట్రీలో జరిగిన ఏ చిన్న విషయం అయినా వెంటనే వైరల్ అవుతుంది. అందుకే నటులు చాలా అప్రమత్తంగా ఉండాలి" అని శ్రీవాణి హెచ్చరించారు. కొన్ని సమయాల్లో ఇండస్ట్రీని లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేయడం అలవాటైపోయిందని, కానీ వాటి ప్రభావాన్ని కూడా ఆలోచించాలని సూచించారు.'ఎదుటివాళ్లపై తప్పులు చూపించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మాకు కూడా ఇంటి కుటుంబాలు ఉన్నాయి. ఈ రంగంలో పని చేస్తున్న ప్రజల జీవితాలూ ఇలా బాధపడతాయి'అంటూ ఘాటు సమాధానం ఇచ్చారు.

కమిట్‌మెంట్స్, వదంతులు, తప్పుబాట్లు అన్నీ ఉంటే ఇండస్ట్రీలో నటించడం అసాధ్యం అవుతుందని, అందుకే ఆ విషయాల్లో అతిశయోక్తి చేయవద్దని స్పష్టం చేశారు. 'ఈ రంగం అంత ప్రమాదకరం అయితే మేము ఇన్నాళ్లు ఎలా కొనసాగేవాళ్లం?'అని ప్రశ్నించారు.మారుతున్న కాలానికి తగ్గట్టు నటులు కూడా తమను మార్చుకోవాలని శ్రీవాణి సూచించారు. 'ఒకే దారిలో లాగిపోవడం కరెక్ట్ కాదు. మనం కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. పాత చింతకాయ పచ్చడి లాగా ఒకే స్టైల్లో ఉండకూడదు'అని తెలిపారు. ప్రస్తుతం శ్రీవాణి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్‌తో పాటు అనేక మంది నటులు కూడా ఆమె అభిప్రాయాలను సమర్థించుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X