For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  EMKలో రాజమౌళి, కొరటాల.. కన్ఫ్యూజ్ చేసిన దర్శకులకు కౌంటర్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్!

  |

  బుల్లితెరపై రియాలిటీ షోలను నడిపించాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. ప్రతిక్షణం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలి. ముఖ్యంగా హోస్ట్ గా వ్యవహరించే వారికి పెద్ద బాధ్యత అని చెప్పాలి. ఇక హోస్ట్ అనే పదానికి సరికొత్త అర్థం అని చెబుతున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షోతో సరికొత్తగా ఆకట్టుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 1ను గ్రాండ్ గా మొదలుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ అలాంటి కాంట్రవర్సీ షోకు వెళ్ళకుండా కూల్ గా మీలో ఎవరు కోటీశ్వరులు షోను సరికొత్తగా స్టార్ట్ చేశాడు. మంచి రేటింగ్స్ ను కూడా అందుకుంటున్నాడు. ఒక విధంగ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5షో తో ఎన్టీఆర్ గట్టిగానే పోటీ పడుతున్నారు అని చెప్పవచ్చు. ఇక ఈసారి ఎవరు మీలో కోటీశ్వరులు షోకు స్పెషల్ గెస్ట్ గా అప్పుడప్పుడు సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సారి టాలీవుడ్ అగ్ర దర్శకుడు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి కొరటాల శివ రంగంలోకి దింపడం విశేషం.

  ఇష్టంతో సరికొత్తగా EMK

  ఇష్టంతో సరికొత్తగా EMK

  జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర ప్రేక్షకులకు కూడా మెల్లగా దగ్గరవుతున్నారు అని చెప్పవచ్చు. వెండితెరపై మాస్ క్లాస్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న తారక్ ఆ తర్వాత బిగ్ బాస్ షో తోకు హోస్ట్ గా వ్యవహరించి ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు అని చెప్పవచ్చు. అయితే షోను అలాగే సినిమాలను బ్యాలెన్స్ చేయలేక జూనియర్ ఎన్టీఆర్ ఒక సీజన్ కే తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షోను మాత్రం తారక్ చాలా ఇష్టంగా సరికొత్తగా మొదలు పెట్టాడు.

   అగ్ర హీరోతో గ్రాండ్ గా స్టార్ట్ చేసి..

  అగ్ర హీరోతో గ్రాండ్ గా స్టార్ట్ చేసి..

  జూనియర్ ఎన్టీఆర్ ఈ షోను సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో కొనసాగిస్తూ వస్తున్నాడు. ప్రశ్నలతో పోటీదారులను ఉత్తేజపరుస్తూ అలాగే జీవితంలో ఎన్నో మంచి విషయాలను జనాలకు చెబుతూ వస్తున్నాడు. వీలైనంత వరకు కాంట్రవర్సీ లేకుండా సాఫీగా కొనసాగుతొంది. జూనియర్ ఎన్టీఆర్ మధ్య మధ్యలో కొంత మంది సెలబ్రిటీలను కూడా షోలో కి ప్రత్యేక అతిథులుగా రప్పిస్తున్నాడు. వారిని కూడా అనేక రకాల ప్రశ్నలతో సందిగ్దంలో పడ్డ చేస్తూ మధ్య మధ్యలో సరదాగా కామెడీ కూడా చేస్తున్నాడు. రామ్ చరణ్ తో షోను గ్రాండ్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

   కొరటాల శివ - ఎస్ఎస్.రాజమౌళి

  కొరటాల శివ - ఎస్ఎస్.రాజమౌళి

  ఇక ఇక రామ్ చరణ్ తో చేసిన ఎపిసోడ్ కూడా భారీ స్థాయిలో రేటింగ్ కూడా వచ్చింది. ఇక ఈసారి అంతకు మించిన రేటింగ్స్ తో రికార్డులను బ్రేక్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా తనకు ఇష్టమైన అగ్ర దర్శకులను షోకి రప్పించాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఇద్దరు అగ్ర దర్శకులు ఒక రియాలిటీ షో లోకి రాబోతున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు షోలో వారి ఆలోచనలతో డబ్బులు గెలుచుకోవడానికి కొరటాల శివ, ఎస్ఎస్.రాజమౌళి సిద్ధమవుతున్నారు.

   రోల్ కెమెరా యాక్షన్ అంటూ..

  రోల్ కెమెరా యాక్షన్ అంటూ..

  రీసెంట్ గా షోకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి కొరటాల శివ ఇద్దరిని ఆహ్వానించిన జూనియర్ ఎన్టీఆర్ వారిని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని అనుకున్నాడు. అయితే ముందుగానే అగ్ర దర్శకులు కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. అంతేకాకుండా కొరటాల శివ రోల్ కెమెరా యాక్షన్ అనగా.. సౌండ్ క్లాటింగ్ యాక్షన్ అంటూ జక్కన్న షూటింగ్ లో ఉన్నట్లుగా వారీ మార్క్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు.

   ఇక్కడ నేనే బాస్

  ఇక్కడ నేనే బాస్

  ఇక ఇద్దరి డామినేషన్ గమనించిన జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ఆశ్చర్యపోయి ఆ తర్వాత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్న చెబుతున్న కూడా కొరటాల శివ రాజమౌళి ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుంటూ సమాధానం కోసం ఆలోచిస్తున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఎంత సేపు మీరు మీరు మాట్లాడుకోవడమనే ఇక్కడ మాకు అవకాశం ఇవ్వరా? అంటూ సరికొత్త షాక్ ఇచ్చాడు. అంతేకాకుండా ఆప్షన్స్ ఇవ్వకుండా ప్రశ్నలు క్యాన్సల్ చేయవచ్చా అంటూ జూనియర్ ఎన్టీఆర్ కంప్యూటర్ గురువు గారిని అడిగేశాడు. అదేమిటి అని ఇద్దరు దర్శకులు కూడా తారక్ ను గట్టిగానే అడిగారు. ఇక చివరకు జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం తగ్గకుండా ఇక్కడ లొకేషన్ నాది డైరెక్షన్ నాది.. నేనే ఇక్కడ బాద్ అంటూ ఇద్దరు దర్శకులకు సరదాగా నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు.

  Recommended Video

  Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
  షో ప్రసారం అయ్యేది ఎప్పుడంటే?

  షో ప్రసారం అయ్యేది ఎప్పుడంటే?

  ఆ దెబ్బకు కొరటాల శివ రాజమౌళి కూడా నవ్వుతూ సరే ఇంకోసారి ఇలాంటి తప్పు చేయము అని సమాధానమిచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ జెమినీ టీవీలో సెప్టెంబర్ 20 సోమవారం 8:30కి ప్రసారం కానుంది. ఎస్ఎస్ రాజమౌళి తో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉందని అందరికీ తెలిసిన విషయమే. వీరి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ వంటి హ్యాట్రిక్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి RRR సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక కొరటాల శివతో ఇదివరకే జనతా గ్యారేజ్ సినిమా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మరో సినిమాను మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

  English summary
  Ss rajamouli and koratala siva are the guests for jr ntr Evaru Meelo Koteeswarulu, EMK
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X