Bigg Boss 5 finale: ఇద్దరు హీరోలను కలపడం కాదు.. RRR చేయడానికి గర్వపడే మరో కారణం: రాజమౌళి

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అత్యధిక భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా RRR. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి అనంతరం డైరెక్ట్ చేశారు కాబట్టి కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కోసం ప్రత్యేక అతిథిగా వచ్చిన రాజమౌళి సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. అంతేకాకుండా గర్వ కారణం కూడా ఉందని చెప్పారు.

బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్

బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్

బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కోసం కేవలం కంటెస్టెంట్స్ హడావిడి మాత్రమే కాకుండా వివిధ రకాల సినిమాలకు సంబంధించిన స్టార్ సెలబ్రిటీలను కూడా రప్పించారు. ఇక బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమాకు సమర్పకుడిగా ఉన్న రాజమౌళి ప్రత్యేకంగా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులను కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేశారు.

 సమర్పకుడిగా ఉన్న రాజమౌళి

సమర్పకుడిగా ఉన్న రాజమౌళి


బ్రహ్మాస్త్ర సినిమాకు రాజమౌళి సమర్పకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో అలియా భట్ రణబీర్ కపూర్ జంటగా నటిస్తుండగా బాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రాజమౌళి కి కూడా చాలా నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని బిగ్ బాస్ వేదికగా వివరణ ఇచ్చాడు.

 సినిమా సంగతి పక్కన పెడితే

సినిమా సంగతి పక్కన పెడితే

రాజమౌళి RRR సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాలను కూడా చెప్పాడు. సినిమా సంగతి పక్కన పెడితే తనకు అభిమానులు అందరూ కూడా కలిసి ఉంటే చాలా ఇష్టం అని స్టార్ హీరోలు నిజంగా చాలా స్నేహంగా ఉంటారు అని దాన్ని నేను వెండితెరపై కూడా చూపించాలి అని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నట్లు తెలియజేశారు.

 అభిమానులు అందరూ కూడా కలిసేందుకు

అభిమానులు అందరూ కూడా కలిసేందుకు


ఈ సినిమా కేవలం రెండు పాత్రలు మాత్రమే కాకుండా అభిమానులు అందరూ కూడా కలిసేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అని నాగార్జున వివరణ ఇచ్చారు. అదే ఆలోచన కూడా నాకు చాలా బలంగా కలిగింది అని రాజమౌళి తెలియజేశారు. తన చిన్నప్పటి నుంచి కూడా చారిత్రాత్మక పాత్రలు ఒకే వెండితెరపై చూపించాలని ఎంతో ఆశగా ఉండేది అని అదేవిధంగా RRR సినిమా లో కూడా ఇద్దరి సమరయోధులను చాలా బలంగా చూపించినట్లు తెలియజేశారు.

రాజమౌళి కాళ్ళు మొక్కిన రణ్ బీర్

రాజమౌళి కాళ్ళు మొక్కిన రణ్ బీర్


RRR సినిమా గురించి చెప్పిన తర్వాత రాజమౌళి బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది అని ఆయన్ ముఖర్జీ కథ చెప్పగానే ఎంతగానో నచ్చింది అని చెప్పారు. అతను నాకంటే పిచ్చోడిలా ఉన్నాడని నవ్వుతూ అన్నాడు. ఇక రణ్ బీర్ సింగ్ రాగానే ముందుగా రాజమౌళి పాదాలకు నమస్కారం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X