హాట్ సీట్‌లో రాజమౌళి, రజనీకాంత్, ఐశ్వర్యారాయ్.. కర్ణాటకలో జన్మించి, క్రేజీ షోకు పిలుపు!
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకధీరుడు రాజమౌళి, అందాల తార ఐశ్వర్యరాయ్ ఈ ముగ్గురి పేర్లు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ వీరి ముగ్గురి మధ్య ఓ పోలిక ఉంది. కర్ణాటకలో జన్మించిన వీరు ఇండియాలో క్రేజీ సెలెబ్రిటీలుగా ఎదిగారు. ప్రస్తుతం బుల్లి తెరపై విన్నూత్నమైన కార్యక్రమాలు వస్తున్నాయి. సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేసే పద్ధతులు మారుతున్నాయి. సెలెబ్రిటీలతో నిర్వహించే వివిధ కార్యక్రమాలు బాగా పాపులర్ అయ్యాయి. వాటిలో జీ కన్నడ ఛానల్‌లో వీకెండ్ విత్ రమేష్ కార్యక్రమం మంచి ఆదరణ పొందింది. కర్ణాటకతో సంబంధం ఉన్న సెలెబ్రిటీలని ఈ షోకు అతిథులుగా ఆహ్వానిస్తారు. త్వరలో వీకెండ్ విత్ రమేష్ నాల్గవ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

ఆ ముగ్గురికి పులుపు
వీకెండ్ విత్ రమేష్ నాల్గవ సీజన్ కోసం జీ కన్నడ సంస్థ బడా స్టార్లని ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకధీరుడు రాజమౌళి, అందాల తార ఐశ్వర్యారాయ్ ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన సెలెబ్రిటీలు హాట్ సీట్ లో కూర్చుని ప్రముఖ టివి పర్సనాలిటీ అయిన రమేష్ అరవింద్ ప్రశ్నలకు సమాధానం ఇస్తారు.

కర్ణాటకలో జన్మించి
ఈ షోకు కర్ణాటక సంబంధం ఉన్న వారినే ఆహ్వానిస్తుంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కర్ణాటకలో సినిమాల్లోకి వచ్చే ముందు వరకు బస్ కండక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చెన్నైకి వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఇప్పుడు ఆయన కోట్లాది మంది అభిమానులకు సూపర్ స్టార్ అయ్యారు. రజని సందర్భం వచ్చినప్పుడల్లా తన పాత జీవితాన్ని గుర్తుచేసుకుంటుంటారు.

రాజమౌళి కూడా
తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచిన దర్శకధీరుడు రాజమౌళి కూడా జన్మించింది కర్ణాటకలోని. కర్ణాటకలోని రాయచూర్ లో రాజమౌళి జన్మించారు. ఆ తర్వాత రాజమౌళి కుటుంబం ఆంధ్రకు వచ్చారు. ప్రపంచ సుందరిగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్న ఐశ్వర్యారాయ్ జన్మించింది మంగుళూరులో. ఐశ్వర్యారాయ్ విద్యాబ్యాసం కోసం ఆమె కుటుంబ సభ్యులు ముంబైలో స్థిరపడ్డారు. వీకెండ్ విత్ రమేష్ షోకు ఈ ముగ్గురు సెలెబ్రిటీలు హాజరు కానున్నట్లు వార్తలు వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గతంలో కుదర్లేదు
జీ కన్నడ సంస్థ గత సీజన్స్ లోనే రాజమౌళి, రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ లని వీకెండ్ విత్ రమేష్ షో కోసం ఆహ్వానించారు. ఆ సమయంలో కొన్ని కారణాల వలన వీరు అంగీకరించలేదు. నాల్గవ సీజన్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. క్రీడాకారులు, ప్రముఖ వ్యాపారవేతలని కూడా ఈ షోకు ఆహ్వానించారట. వారందరి పేర్లు త్వరలో బయటకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











