Super Singer సూపర్ సింగర్ విజేతను ప్రకటించిన తమన్.. విన్నర్ ఎవరు? ప్రైజ్ మనీ ఎంతంటే?
బుల్లితెరపై గత కొంత కాలంగా ఆటలు, పాటలు, కామెడీ షోలు వస్తూనే ఉన్నాయి. కొన్నింటికి మాత్రం ప్రత్యేక మైన గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా పాటల ప్రోగ్రామ్స్ ను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. అప్పట్లో బాల సుబ్రమణ్యం పాడుతా తీయగా ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయగా.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక స్టార్ మా టీవీలో కూడా సూపర్ సింగర్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే లేటెస్ట్ సీజన్ స్టార్ మా సూపర్ సింగర్ ఫైనాల్ కు చేరుకుంది. అయితే సూపర్ సింగర్ విన్నర్, రన్నర్ ఎవరు.. ఎంత ప్రైజ్ మనీ వచ్చింది.. అనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా పాటలు, కామెడీ, డ్యాన్స్ అంటూ రకరకాల షోలతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు చానెల్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తో ముందుకు వస్తున్నారు. అప్పట్లో పాడుతా తీయగా వంటి కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. బాల సుబ్రమణ్యం హోస్టుగా ఈ కార్యక్రమం కొనసాగేది. ఇప్పుడు ఆయన తనయుడు హోస్టుగా సాగుతోంది.

ఇక స్టార్ మా విషయానికి వస్తే.. బిగ్ బాస్ తర్వాత ఏదో ఒక షోతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అలా స్టార్ మా సూపర్ సింగర్ షో ప్రారంభం అయింది. డిసెంబర్ 23 నుంచి బిగ్ బాస్ షో అనంతరం ప్రారంభం అయిన ఈ షో... ప్రతి శనివారం, ఆదివారం రోజులలో రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అవుతుంది. అయితే షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తుడంగా, రాహుల్, స్వేత మోహన్, మంగ్లీ, అనంత్ శ్రీరామ్ జడ్జ్ లుగా వ్యవహారిస్తున్నారు.
ఈ సూపర్ సింగింగ్ షోలో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, కేరళల నుంచి కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. 20 మంది కంటెస్టెంట్స్‌తో షోను మొదలుకాగా.. ఆ తర్వాత టైటిల్ కోసం పదహారు మంది పోటీ పడ్డారు. కంటెస్టెంట్స్, జడ్జెస్, మార్కులతో పాటు ఇంట్రెస్టింగ్‌గా సింగింగ్ షో సాగింది. విభిన్నమైన ఆలోచనలు, విలక్షణమైన వాయిస్‌లతో సూపర్ సింగింగ్ షో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఇక ఎట్టకేలకు ఈ షో ముగింపుకు వచ్చింది.

అయితే ఈ షో గ్రాండ్ ఫినాలేకి గెస్టుగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ వచ్చాడు. ఆయన సమక్షంలోనే విన్నర్, రన్నర్ అనౌన్స్ మెంట్ జరిగింది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ షో.. విన్నర్, రన్నర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్ ప్లేస్ ఖరారు చేసుకున్నాయి. వీరికి ప్రైజ్ మనీ ఎంత వచ్చింది.. ఎవరు విన్నర్ అయ్యారు అనే వివరాలు బయటకు వచ్చాయి.
ఇక విన్నర్ ప్రవస్తి నిలువగా, రన్నర్ శ్వేత నిలిచింది. ఇక మూడో స్థానంలో పవన్ కల్యాణ్, నాలుగవ స్థానంలో సుమనస్, ఐదవ స్థానంలో అమిత, ఆరవస్థానంలో సాహితి నిలిచారు. విన్నర్ కు ప్రైజ్ మనీ పదిలక్షల రూపాయలు లభించాయి. ఇక రన్నర్ కు కూడా 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మనీని ఇచ్చారు. ఇక ఎట్టకేలకు ఈ షో ముగియడంతో దీని స్థానంలో త్వరలో నీతోనే డ్యాన్స ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











