ఏడేళ్ల పాటు దానికి దూరంగానే .. ఆడపిల్లను కనాలని ఉంది, అనసూయ షాకింగ్ కామెంట్స్
కష్టపడితే ఎవరైనా , ఎంతటి సామాన్యులైనా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోచ్చని నిరూపించారు స్టార్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్. ఇదే విషయాన్ని యువతకు కూడా చెబుతుంటారు ఈ జబర్దస్త్ బ్యూటి. ఓ సాధారణ న్యూస్ రీడర్ స్టేజ్ నుంచి స్టార్ సెలబ్రెటీ స్థాయికి చేరుకున్నారు ఈ ముద్దుగుమ్మ. అనసూయ జీవితంలో సుశాంక్ భరద్వాజ్‌తో పరిచయం, ప్రేమ, పెళ్లి అత్యంత కీలకం.
తెలుగు న్యూస్ ఛానెల్స్‌లో ఒకటైన సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించారు అనసూయ భరద్వాజ్. అనంతరం ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న అనసూయకి ఈ కార్యక్రమం దశ తిప్పింది. నాగబాబు, రోజా వంటి స్టార్లు స్టేజ్‌పై జడ్జిలుగా ఉన్నప్పటికీ.. అనసూయ కూడా తన హవా చూపించారు. జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీతో సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు హోస్ట్‌గా చేసే అవకాశాలను దక్కించుకున్నారు అనసూయ.

ఇదే సమయంలో సినిమాల్లోనూ అనసూయకు అవకాశాలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ ఆమెను ఎక్కడికో తీసుకెళ్లింది.
రంగస్థలం తర్వాత క్షణం, విన్నర్, గాయత్రి, ఎఫ్2, యాత్ర, కథనం, చావు కబురు చల్లగా, భీష్మ పర్వం, ఖిలాడీ, విమానం, పెద్దకాపు, రజాకార్ వంటి సినిమాల్లో అనసూయ నటించింది. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి తన గ్లామర్ షోతో భారీ హైప్ తీసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప పార్ట్ 1, పార్ట్ 2లలో ద్రాక్షాయణిగా నెగిటివ్ రోల్‌లో నటించి మెప్పించారు అనసూయ.
ఎన్‌సీసీలో ఉన్న రోజుల్లో అనసూయ - సుశాంక్ మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికీ ఆమె వయసు 16 ఏళ్లే. అప్పటికే ఒకరినొకరు అర్ధం చేసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమెను ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి సుశాంకే చదివించాడు. పెద్దలను ఒప్పించాకే పెళ్లి చేసుకుందామని చెప్పి దాదాపు 9 ఏళ్ల పాటు వెయిట్ చేసి మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకున్నామని అనసూయ తెలిపారు. సాక్షి టీవీలో యాంకరింగ్ చేస్తున్నప్పుడు అనసూయ ప్రేమ వ్యవహారం ఆ ఛానెల్‌లో అందరికీ తెలుసునట. డిప్రెషన్‌లో ఉంటూనే విధులకు హాజరయ్యే దాన్నని ఆమె పలుమార్లు వెల్లడించారు.
అయితే సుశాంక్‌తో పెళ్లి జరిగేలా చూడాలని సాయిబాబాకు అనసూయ మొక్కుకున్నారట. 11 గురువారాల పాటు పూజలు చేసి అందుకోసం తనకు ఎంతో ఇష్టమైన చాక్లెట్, ఆలూగడ్డను వదులుకున్నానని ఆమె చెప్పారు. ఏడేళ్ల పాటు వాటి జోలికి పోలేదని అనసూయ అన్నారు. మేం ముగ్గురం ఆడపిల్లలం కావడంతో తొలుత అబ్బాయి పుడితే బాగుండు అనిపించింది అని.. కానీ రెండోసారి మాత్రం ఆడపిల్ల కావాలని అనుకున్నానని, కానీ అప్పుడూ బాబే పుట్టాడని ఆమె వెల్లడించారు. నాకు ఇప్పటికీ ఆడపిల్లపైనే ఉందని.. 40 ఏళ్లు వచ్చినా సరే అమ్మాయిని కనేందుకు ట్రై చేస్తానని అనసూయ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











