Anasuya Bharadwaj : మిస్ యూ అంటూ నెటిజన్ల పోస్ట్ .. అనసూయ షాకింగ్ రెస్పాన్స్
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు అనసూయ భరద్వాజ్. చాలా తక్కువ సమయంలోనే ఈమె ఈ క్రేజ్ దక్కించుకున్నారు. హీరోయిన్లను మించిన అందంతో యువతలో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు అనసూయ. యాంకరింగ్‌కు ప్రస్తుతానికి గ్యాప్ ఇచ్చి సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. కష్టపడితే ఎవరైనా , ఎంతటి సామాన్యులైనా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోచ్చని నిరూపించారు అనసూయ భరద్వాజ్. ఓ సాధారణ న్యూస్ రీడర్ స్టేజ్ నుంచి స్టార్ సెలబ్రెటీ స్థాయికి చేరుకున్నారు ఈ ముద్దుగుమ్మ.
తెలుగు న్యూస్ ఛానెల్స్‌లో ఒకటైన సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించారు అనసూయ భరద్వాజ్. తర్వాత ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న అనసూయ జీవితాన్ని ఈ కార్యక్రమం మలుపు తిప్పింది. నాగబాబు, రోజా వంటి స్టార్లు స్టేజ్‌పై జడ్జిలుగా ఉన్నప్పటికీ.. అనసూయ తన అందం, హాట్ షోతో గ్లామర్ అద్దారు. తద్వారా జబర్దస్త్ బ్లాక్ బస్టర్ కావడంలో తను కూడా ముఖ్య భూమిక పోషించారు. జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీతో సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు హోస్ట్‌గా చేసే అవకాశాలను దక్కించుకుని దూసుకెళ్లారు అనసూయ.

ఇదే సమయంలో సినిమాల్లోనూ అనసూయకు అవకాశాలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ ఆమెలోని నటిని బయటపెట్టింది. రంగస్థలం తర్వాత క్షణం, విన్నర్, గాయత్రి, ఎఫ్2, యాత్ర, కథనం, చావు కబురు చల్లగా, భీష్మ పర్వం, ఖిలాడీ, విమానం, పెద్దకాపు, రజాకార్ వంటి సినిమాల్లో అనసూయ నటించింది. హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేస్తూ దున్నేస్తున్న కాలంలో వారి జోరుకు బ్రేకులు వేశారు రంగమ్మత్త. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తన గ్లామర్ షోతో ఆ సినిమాలకు భారీ హైప్ తీసుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప పార్ట్ 1, పార్ట్ 2లలో ద్రాక్షాయణిగా నెగిటివ్ క్యారెక్టర్‌లోనూ అదరగొట్టారు అనసూయ.
సినిమాలు, షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు ఈ స్టార్ యాంకర్. వీలు కుదిరినప్పుడల్లా వెకేషన్‌కు వెళ్తుంటారు. ఇంట్లో పండుగలు, నోములు, ఇతర శుభకార్యాలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ మిస్ కారు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా రెండింటికి సమయాన్ని కేటాయించి గృహిణిగానూ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అయితే తనకు జీవితాన్ని, ప్రజల్లో పాపులారిటీని ఇచ్చిన జబర్దస్త్‌ను వీడటం ఆమె అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను సైతం ఉల్కిపడేలా చేసింది.

ఇప్పటికీ కూడా అనసూయ జబర్దస్త్‌ను ఎందుకు వదిలేశారన్నది మిస్టరీయే. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తుంటాయి. దీనిపై ఏనాడూ రంగమ్మత్త స్పందించలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం మీరు లేని జబర్దస్త్‌ను చూడలేకపోతున్నామని.. అసలు ఎందుకు ఆ ప్రోగ్రామ్‌ను వదిలిపెట్టేశారంటూ ప్రశ్నిస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ జబర్దస్త్‌లోని ఓ క్లిప్‌ను షేర్ చేస్తూ మిస్ అనసూయ మేడం అంటూ పోస్ట్ పెట్టాడు. దీనిపై స్పందించిన ఆమె '' అయ్యో నేను ఎక్కడికి పోలేదండి '' అంటూ రిప్లయ్ ఇచ్చారు. అంతేకాదు.. ఈ పోస్ట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టారు ఈ జబర్దస్త్ యాంకర్.


Click it and Unblock the Notifications











