స్టార్ యాంకర్ ఉదయభానును తొక్కేసిందెవరు? ఐదేళ్ల పాటు దారుణంగా
తెలుగు నాట టెలివిజన్ రంగం అప్పుడప్పుడే పరిచయమైన కొత్తల్లో యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్నారు సుమ, ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చక్రవర్తి . వీరిలో సుమ ఒక్కరే ప్రస్తుతం లైమ్ లైట్‌లో ఉండగా.. మిగిలినవారు అడపాదడపా మాత్రమే పలకరిస్తున్నారు. ఇక అప్పట్లో వీరి మధ్య వృత్తిపరమైన పోరు ఓ రేంజ్‌లో ఉండేది. వీరిలో ఉదయభాను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. హీరోయిన్లను మించిన అందం, ఫిగర్‌తో అప్పట్లో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టారు ఉదయభాను. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడిపారు. అయితే ఏమైందో కానీ దాదాపు ఐదారేళ్ల పాటు ఆమె బుల్లితెరపై కనిపించలేదు.
నిజానికి తెలుగు నాట ఇప్పుడు స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న సుమ కనకాల కంటే కూడా ఉదయభాను సీనియర్. యాంకరింగ్‌లో ఆమె ట్రెండ్ సెట్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. నవంబర్ 6, 1972న కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో జన్మించారు ఉదయభాను. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే, ఈమెకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. నిజానికి ఉదయభాను తొలుత సినీరంగంలో ప్రవేశించారు. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి చేతుల మీదుగా 22 ఏళ్ల వయసులో ఆమె ఎంట్రీ జరిగింది. మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఎర్ర సైన్యంలో నటించారు. ఆ తర్వాత కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రవణ మాసంతో పాటు పలు కన్నడ , తమిళ చిత్రాల్లోనూ ఉదయభాను నటించారు.

ఇదే సమయంలో యాంకర్‌గా టర్న్ అయిన ఆమె.. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి ప్రోగ్రామ్‌తో తెలుగునాట గుర్తింపు సంపాదించారు. ఇక జెమినీ టీవీలో వచ్చిన వన్స్ మోర్ ప్లీజ్‌తో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దివంగత హాస్యనటుడు వేణుమాధవ్‌తో కలిసి ఉదయభాను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. యాంకర్ అంటే ఉదయభాను.. ఉదయభాను అంటే యాంకర్ అన్నంతగా ముద్ర వేసుకుంది. ఈవిడ కనిపించని ఛానెల్ అంటూ ఏది ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.
మిద్దె విజయేంద్ర మౌళి అనే వ్యక్తిని పెళ్లాడిన ఉదయభానుకి ఇద్దరు కుమార్తెలు. భూమి ఆరాధ్య , యువి నక్షత్ర. ప్రస్తుతం భర్త , పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఉదయభాను. మధ్యలో యాంకరింగ్‌కు దూరమైన ఆమె కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ కూడా చేశారు. అయితే గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ సభలో పాల్గొని అందరికీ షాకిచ్చారు ఉదయభాను. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానని.. బీసీ గళమెత్తడానికి వచ్చానని తెలిపారు.

అక్కడితో ఆగిపోతే ఏ గొడవ ఉండేది కాదు.. కాను నేను ఐదేళ్లుగా ఏ టీవీల్లో కనిపించడం లేదని, మీరు గమనించే ఉంటారని ఉదయభాను అన్నారు. నన్ను తొక్కడానికి ప్రయత్నించారని.. కానీ అలుపు లేకుండా పోరాడుతూ మీ ముందుకు వచ్చానని అన్నారు. ఓ ఛానెల్‌లో పాడిన పాట తర్వాత తనకు అవకాశాలు తగ్గిపోయానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉదయభాను వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె పాట ఎవరిని హర్ట్ చేసింది? ఎవరు ఉదయభానును తొక్కేశారన్నది మాత్రం ఆమె చెప్పలేదు.


Click it and Unblock the Notifications











