twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుమక్క యూ ట్యూబ్ పాట్లు.. ఆ యాంకర్స్ పేమెంట్స్ ఎంతంటే?

    |

    లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమలు కూడా చాలా ఇబ్బందులకు లోనవుతున్నాయి. సినీ రంగంపై ఆధారపడిన చాలా మంది నటీనటులు టెక్నీషియన్స్ ఆర్థికంగా దెబ్బ తింటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ప్రతిరోజు స్టార్ యాక్టర్స్ కంటే ఎక్కువగా బిజీగా ఉండే యాంకర్స్ పరిస్థితి కొంత కష్టంగానే మారింది. రోజు షోలతో ఈవెంట్స్ తో బిజీగా ఉండేవారు ఒక్కసారిగా పని లేకుండా ఇంట్లోనే ఉంటున్నారు.

    Recommended Video

    Anchor Suma Serious On Telugu Peope Behavior | చెప్పేది మీకే.. అర్దం కావట్లేదా..?
    బోర్ కొట్టకుండా..

    బోర్ కొట్టకుండా..

    ప్రతిరోజు షోలతో హడావుడిగా కనిపించే యాంకర్స్ కి ఒక్కసారిగా నెలరోజుల పాటు ఖాళీగా ఉండడం పిచ్చెక్కించేస్తోందట. లాక్ డౌన్ తప్పదని ఇంట్లోనే ఉంటున్నారు. రోజు కెమెరా ముందుకు రానిదే వారికి దిక్కు తోచదు కాబట్టి కొత్తగా యూ ట్యూబ్ ద్వారా వారి టాలెంట్ ని భయటపెడుతున్నారు. బోర్ కొట్టకుండా వీడియోలు చేస్తూ యాంకర్ సుమ కొత్త దారిలో వెళుతోంది.

    సుమక్క న్యూ ప్లాన్..

    సుమక్క న్యూ ప్లాన్..

    లాక్ డౌన్ లో యాంకర్ సుమ తన యూ ట్యూబ్ ఛానెల్ గ్రోథ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. మిగతా యాంకర్స్ ని కూడా తన టీమ్ లో చేర్చుకుంది. శ్రీ ముఖి, ప్రదీప్, అనసూయ, రష్మీ వంటి వారితో కలిసి ఒక కొత్త తరహా ప్రోగ్రామ్స్ చేస్తోంది. యాంకర్స్ అంతా ఇంట్లోనే ఉంటూ వారికి సంబంధించిన ఫుటేజ్ ని మాత్రమే సుమకు పంపిస్తున్నారు. ఆ విధంగా అల్లరిగా ఎదో వచ్చిన కామెడీ చేసుకుంటూ యాంకరింగ్ దాహాన్ని తీర్చుకుంటున్నారు.

    యూ ట్యూబ్ పాట్లు..

    యూ ట్యూబ్ పాట్లు..

    ఆన్లైన్ లైవ్ గ్రూప్ కాల్స్ తోనే ఈ యాంకర్స్ అంతా వారి స్కిట్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఓ విధంగా ఇది చాలా కష్టంగా ఉందట. స్క్రిప్ట్ తో సంబంధం లేకుండా ఎవరికి వారు సొంతంగా వారి టాలెంట్ తో సుమక్క ఛానెల్ కోసం కష్టపడుతున్నారట. ఒక ఫ్రేమ్ లో అయితే షూటింగ్ స్పాట్ లోనే ఒకరిపై మరొకరికి అవగాహన ఉంటుంది. కానీ ఇప్పుడు టైమింగ్ కి తగ్గట్టు వర్క్ చేయలేక కాస్త ఇబ్బందులు పడుతున్నారట.

    ఆ యాంకర్స్ పేమెంట్స్ ఎంతంటే?

    ఆ యాంకర్స్ పేమెంట్స్ ఎంతంటే?

    రోజుకి వేలల్లో లక్షల్లో పేమెంట్స్ అందుకునే యాంకర్స్ ఒక్కసారిగా యూ ట్యూబ్ మీద పడ్డారు. ఇక సుమక్క తన ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న యూ ట్యూబ్ ఛానెల్ లో శ్రీ ముఖి, ప్రదీప్, అనసూయ, రష్మీ వంటి స్టార్ యాంకర్స్ నటిస్తున్నారు కాబట్టి వారికి పేమెంట్స్ ఎంత ఇస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే వీడియోలకు వచ్చే వ్యూవ్స్ ని బట్టి వారం వ్యవధిలోనే సుమ మిగతా యాంకర్స్ కి మంచి ఎమౌంట్ ఇస్తోందట. ఈ విధంగా యాంకర్స్ యూ ట్యూబ్ ద్వారా వారికంటూ ఒక సపరేట్ సేఫ్ జోన్ ని సెట్ చేసుకుంటున్నారు.

    English summary
    Anchor suma in Lockdown is trying to boost her YouTube channel Growth. The rest of the anchors were included in his team. SreeMukhi, Pradeep, Anasuya and Rashmi are working on a new type of program. The anchors are all at home and are only sending out footage of them. Anchoring thirsty, making fun of the comedy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X